Anasuya Bharadwaj: వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది: అనసూయ

Best Web Hosting Provider In India 2024

Anasuya Bharadwaj: టెలివిజన్ షోల ద్వారా అనసూయ భరద్వాజ్.. కెరీర్ ఆరంభంలో ఫుల్ పాపులర్ అయ్యారు. టీవీ యాంకర్‌గా అందంతో పాటు తన మాటలతో ఆకట్టుకున్నారు. జబర్దస్త్ కామెడీ షోతో ఫేమస్ అయ్యారు. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ వస్తున్నారు. అయితే, ఇటీవలే యాంకరింగ్‍కు అనసూయ పూర్తిస్థాయిలో బ్రేక్ ఇచ్చేశారు. సినిమాలపైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. అయితే, అనసూయపై సోషల్ మీడియాలో కొన్నిసార్లు ట్రోల్స్ వస్తుంటాయి. వీటిపై ఆమె చాలాసార్లు దీటుగా బదులిచ్చారు. ఇప్పుడు మరోసారి ట్రోలర్స్ గురించి స్పందించారు.

 

ట్రెండింగ్ వార్తలు

ఇన్‍స్టాగ్రామ్ వేదికగా అనసూయకు ఓ ప్రశ్న ఎదురైంది. “మీ మీద చెడుగా ట్రోల్ చేసే వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు” అని ఆమెకు క్వశ్చన్ వచ్చింది. దీనికి ఆమె బదులిచ్చారు. ఆ వివరాలివే..

ట్రోలర్స్ అంటే వీళ్లే అంటూ సమాధానం పోస్ట్ చేశారు అనసూయ. “వారు వింత జీవులు. వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని తెలుసుకున్నా. ఆ కంపు నాకు అంటొద్దు కదా. అందుకే వాటికి నేనేం చెప్పి టైమ్ వేస్ట్ చేసుకోను” అని అనసూయ బదులిచ్చారు.

ఇంగ్లిష్‍లో ఎక్కువగా ఎందుకు మాట్లాడుతున్నారన్న ప్రశ్నకు కూడా అనసూయ స్పందించారు. తాను ఇంగ్లిష్ మీడియంలో చదివానని, అందులోనూ ఉత్తరాది వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల ఇంగ్లిష్‍లో మాట్లాడడం అలవాటైందని తెలిపారు.

అనసూయ తరచూ తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను, అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంటారు. వీడియోలు, ఫొటోలు కూడా షేర్ చేస్తుంటారు. అయితే, ఈ క్రమంలో కొందరు అనసూయపై ట్రోల్స్ చేస్తుంటారు. గతంలో చాలసార్లు ఇలా జరిగింది. గతంలోనూ తనను ట్రోల్ చేసే వారిపై చాలాసార్లు ఘాటుగా స్పందించారు అనసూయ. ఇప్పుడు.. ట్రోల్స్‌కు దూరంగా ఉంటేనే మంచిదంటూ రాసుకొచ్చారు.

సోగ్గాడే చిన్ననాయనతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అనసూయ. ఆ తర్వాత క్షణం చిత్రంలో కీలకపాత్ర చేశారు. రంగస్థలం చిత్రంతో అనసూయ సినీ కెరీర్ మలుపు తిరిగింది. రంగమ్మత్త పాత్రతో ఆమెకు నటిగా మంచి గుర్తింపు వచ్చింది..

 

పుష్ప చిత్రంలో కూడా అనసూయకు కీలకపాత్ర దక్కింది. ద్రజ్ఞాయణిగా విభిన్నమైన క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత మరిన్ని చిత్రాల్లోనూ నటించి మెప్పించారు.

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2: ది రూల్ చిత్రంలో అనసూయ ప్రస్తుతం నటిస్తున్నారు. పుష్పకు సీక్వెల్‍గా వస్తున్న ఈ మూవీలోనూ ఆమె కీరోల్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 రిలీజ్ కానుంది.

ఇక, ప్రేమ విమానం సినిమాతో ఇటీవల ఓటీటీలోకి కూడా అనసూయ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో శాంత అనే పాత్ర చేశారు. ఈ మూవీ జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రేమ విమానంలో దేవాన్ష్, అనిరుధ్ నామా, సంగీత్ శోభన్, సావీ మేఘన, వెన్నెల కిశోర్ కీలకపాత్రలు పోషించారు. సంతోష్ కట్టా దర్శకత్వం వహించిన ఈ మూవీ పాపులర్ అయింది. అనసూయ క్యారెక్టర్ హైలైట్ అయింది. అనూప్ రూబెన్స్ ఈ ఓటీటీ చిత్రానికి సంగీతం అందించారు.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024