Sweet Potato Chaat : చిలగడదుంపల చాట్ రెసిపీ.. మధుమేహులకు మంచి ఫుడ్

Best Web Hosting Provider In India 2024

చలికాలంలో తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలలో చిలగడదుంప ఒకటి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులు, చిన్న పిల్లలు కూడా మంచిది. ఉపవాస సమయంలో చిలగడదుంపలను ఎక్కువగా వాడటం చూస్తుంటాం. అయితే శీతాకాలంలో వీటిని తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పుడు చిలగడదుంప స్నాక్స్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం..

 

ట్రెండింగ్ వార్తలు

చిలగడదుంప చాట్ రెసిపీ

కావాల్సిన పదార్థాలు : 1/2 కిలో ఉడికించిన చిలగడదుంప, 1/4 tsp మిర్చి పౌడర్, 1/2 tsp ఆమ్చూర్, 1/2 tsp నిమ్మరసం, రాక్ ఉప్పు రుచికి తగ్గట్టుగా.

ఎలా తయారు చేయాలంటే..

చిలగడదుంపను ఆవిరి మీద ఉడికించి, తొక్క తీసేయాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో 1/2 చెంచా ఆమ్చూర్, రాళ్ల ఉప్పు, కారపు పొడి, చాట్ మసాలా పొడి, వేయించిన జీలకర్ర పొడి వేయాలి(మీ రుచి ప్రకారం మసాలాలు జోడించండి). ఆపై 1/2 స్పూన్ నిమ్మరసం జోడించండి. తర్వాత మిక్స్ చేసి సర్వ్ చేయాలి… అంతే చిలగడదుంప చాట్ రెడీ అయినట్టే.

మీరు దీన్ని మీకు కావలసిన పరిమాణంలో తయారు చేసుకోవచ్చు. చలికాలంలో ఈ ఆహారం చాలా మంచిది. రాళ్ల ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును ఉపయోగించవచ్చు. ఇతర మసాలా దినుసులు మీ అవసరాన్ని బట్టి వాడుకోవాలి. చిలగడదుంపలోని పోషకాలు విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, మినరల్స్ శరీరానికి మంచిది.

చిలగడదుంప కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీర్ణక్రియకు చాలా మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు సూపర్ ఫుడ్ గా పని చేస్తుంది. క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. చిలగడదుంపలు మెదడు ఆరోగ్యానికి కూడా ఉపయోగకరం. రోగనిరోధక శక్తిని పెంచడమేకాకుండా చర్మానికి మంచిది.

 

చిలగడదుంప మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడుతుంది. ఇందులోని సమ్మేళనం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ అదుపులో ఉండాలంటే చిలగడదుంపలను ఉడికించి తీసుకోవచ్చు. చాట్ రూపంలోనూ తినొచ్చు. కానీ మీ రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే చిలగడదుంపను డాక్టర్ సలహా మేరకు మాత్రమే తినాలి.

చిలగడదుంపలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, థయామిన్, కెరోటినాయిడ్స్ ఎముకలను బలోపేతం చేస్తాయి. చిలగడదుంప కణాలను నాశనం కాకుండా చూస్తుంది. మీరు ఇప్పటివరకు స్వీట్ పొటాటోని తినకపోతే వాటిని తినడానికి చలికాలం ఉత్తమం.

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024