Best Web Hosting Provider In India 2024
OTT Releases this week: తెలుగు వాళ్లకు ఇప్పుడు రానున్నది సంక్రాంతి వీకెండ్. ఈ వీకెండ్ లో థియేటర్లలో సంక్రాంతి సినిమాలతోపాటు ఓటీటీల్లోనూ కొన్ని ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్, మూవీస్ వస్తున్నాయి. వీటిలో రెండు తెలుగు సినిమాలు, రెండు వెబ్ సిరీస్, రెండు హాలీవుడ్ మూవీస్ ఉన్నాయి.
ట్రెండింగ్ వార్తలు
కోట బొమ్మాళి పీఎస్, ఎక్ట్ర్సా ఆర్డినరీ మ్యాన్ మూవీస్ ఈ వారమే ఓటీటీలోకి వస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, జియో సినిమా, ఆహాలాంటి ఓటీటీల్లో ఈ సినిమాలు, వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఈ వారం ఓటీటీలోకి వస్తున్న సినిమాలు, సిరీస్ ఇవే
కోట బొమ్మాళి పీఎస్ – ఆహా ఓటీటీ
మలయాళ మూవీ నయట్టు రీమేక్ గా తెలుగులో వచ్చిన సినిమా కోట బొమ్మాళి పీఎస్. శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, శివానీ రాజశేఖర్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమా జనవరి 11 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మూవీ – నెట్‌ఫ్లిక్స్
నితిన్, శ్రీలీల కలిసి నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా విఫలమైంది. ఓ పెద్ద యాక్టర్ కావాలనుకుని జూనియర్ ఆర్టిస్ట్ గా మారిన హీరో.. ఓ కంపెనీ ఎండీతో ప్రేమలో పడిన తర్వాత అతని జీవితం ఎలా మలుపు తిరిగిందన్నదే మూవీ స్టోరీ. ఈ సినిమా జనవరి 12 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
కిల్లర్ సూప్ వెబ్ సిరీస్ – నెట్‌ఫ్లిక్స్
బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయీ నటించిన వెబ్ సిరీస్ కిల్లర్ సూప్. ప్రియుడి కోసం భర్త అడ్డు తొలగించుకోవాలని చూసే ఓ గృహిణి చుట్టూ తిరిగే కథ ఇది. మనోజ్ తోపాటు కొంకణాసేన్ శర్మ, సయాజీ షిండే, నాజర్ లాంటి వాళ్లు నటించిన ఈ కిల్లర్ సూప్.. జనవరి 11 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3
ఓవైపు తెలుగులో సంక్రాంతికి హనుమాన్ మూవీ రిలీజ్ కానుండగా.. అదే హనుమంతుడి స్టోరీ చెప్పే ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ వెబ్ సిరీస్ మూడో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ యానిమేటెడ్ సిరీస్ మూడో సీజన్ జనవరి 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
మిషన్ ఇంపాజిబుల్ 7
టామ్ క్రూజ్ నటించిన హాలీవుడ్ మూవీ మిషన్ ఇంపాజిబుల్ 7 ఈ వారమే ఓటీటీలోకి రానుంది. మానవాళిని అంతం చేయడానికి రూపొందించిన ఓ సరికొత్త ఆయుధాన్ని వెతికే పనిలో హీరో ఉంటాడు. ఈ సినిమా జనవరి 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రానుంది.
కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్
గతేడాది హాలీవుడ్ లో వచ్చిన హిట్ మూవీస్ లో ఒకటి లియెనార్డో డికాప్రియో నటించిన కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్. ఈ సినిమా జనవరి 12 నుంచి ఆపిల్ టీవీ ప్లస్ లో స్ట్రీమింగ్ కానుంది.
టాపిక్