Ginger For Hairs : జుట్టు పెరుగుదలకు అల్లం ఎలా ఉపయోగించాలి?

Best Web Hosting Provider In India 2024

జుట్టు రాలడం, జుట్టు నెరవడం వంటి సమస్యలను చాలా మంది ఎదుర్కొంటారు. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇంటి నివారణలు కొన్ని ఉన్నాయి. జుట్టు పెరుగుదలకు అల్లం ప్రయోజనాలను తప్పక తెలుసుకోవాలి. అల్లంలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది తలకు రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మీ జుట్టుకు అల్లంతో కలిగే ప్రయోజనాలు చూద్దాం..

 

ట్రెండింగ్ వార్తలు

అల్లంలో జింజెరాల్ ఉంటుంది. ఇది స్కాల్ప్‌లో సర్క్యులేషన్‌ను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. హెయిర్ ఫోలికల్స్‌కు పోషకాలను అందిస్తుంది. అల్లంలో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఇది జుట్టు పెరుగుదలను నిరోధించే చుండ్రు, ఇతర స్కాల్ప్ సమస్యలను నివారిస్తుంది. ఆరోగ్యకరమైన స్కాల్ప్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది. మొత్తం ఆరోగ్యానికి అల్లం అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది.

అల్లం తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అదే సమయంలో ఇది ప్రతి హెయిర్ ఫోలికల్‌ను ప్రేరేపిస్తుంది. ఫలితంగా పొడవైన, బలమైన జుట్టు ఏర్పడుతుంది. ఇందులోని సమృద్ధిగా ఉండే విటమిన్లు, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ మీ జుట్టును బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. జుట్టు రాలడాన్ని నిరోధించడానికి, తేమ నష్టాన్ని సరిచేయడానికి సహాయపడతాయి.

అల్లం యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను నిరోధించే చుండ్రు, ఇతర స్కాల్ప్ సమస్యలను నివారిస్తుంది. ఫలితాల కోసం షాంపూలో అల్లం వేసి తలకు మసాజ్ చేసుకోవచ్చు.

అల్లం సహజ కండిషనింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. తాజా అల్లం ముక్క యొక్క ప్రత్యేకమైన నూనెలు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు మీ హెయిర్ ఫోలికల్స్ డ్యామేజ్, చిట్లడం నుండి రక్షిస్తాయి. జుట్టు విరిగిపోయినట్లయితే జుట్టును కడగడానికి ముందు నీటిలో తాజా అల్లం చల్లుకోండి.

 

జుట్టు పెరుగుదల కోసం అల్లం హెయిర్ మాస్క్‌ను తయారు చేసుకోవచ్చు. తాజా అల్లం గ్రైండ్ చేసి దాని రసాన్ని తీయాలి. అందులో ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె వంటివి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నేరుగా స్కాల్ప్, హెయిర్‌కు అప్లై చేసి మసాజ్ చేయండి. సుమారు 30 నిమిషాల నుండి గంట వరకు అలాగే ఉంచుకోవాలి. మీ జుట్టు సంరక్షణ దినచర్యకు అల్లం ఉపయోగించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించాలి.

అల్లంను నేరుగా తలకు అప్లై చేస్తే చర్మం చికాకు వస్తుంది. ఎరుపు లేదా మంట వంటి అలెర్జీకి కారణం కావొచ్చు. సున్నితమైన చర్మంపై అల్లం అధిక వినియోగం మంచిది కాదు. ముందు ప్యాచ్ టెస్ట్ చేయించాలి. అల్లం సాధారణంగా మంచిదే అయినప్పటికీ.. కొందరి చర్మానికి పడదు.

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024