
Best Web Hosting Provider In India 2024

ఆచార్య చాణక్యుడు తన జీవితకాల జ్ఞానాన్ని, అనుభవాన్ని చాణక్య నీతిలో రాశాడు. చాణక్యుడి ఈ సూత్రాలు మానవ జీవితంలోని ప్రతి ముఖ్యమైన అంశానికి ఉపయోగపడతాయి. జీవితంలో కొన్ని రంగాలలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అని ఆయన సూచించాడు. మనం నిత్య జీవితంలో ఈ సూత్రాలను సక్రమంగా పాటిస్తే అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు.
ట్రెండింగ్ వార్తలు
చాణక్యుని నీతి శాస్త్రం కొంత మంది వ్యక్తులను ఎప్పుడూ దూరం ఉంచాలని చెబుతుంది. ఎందుకంటే వారు ఎవరి బాధను అర్థం చేసుకోలేరు. అందుకే ఎల్లప్పుడూ కొంతమందికి దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. వారు మీరు ఏం చేసినా పట్టించుకోరని వెల్లడించాడు.
చాణక్యుడు ప్రకారం, మద్యం, మత్తు పదార్థాల బానిసల నుండి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. ఎందుకంటే అలాంటి వారు ఎప్పుడూ డబ్బు వసూలు తీసుకునేందుకు నిమగ్నమై ఉంటారు. డబ్బు కోసం దొంగతనాలు, దోపిడీలు, హత్యలు వంటి నేరాలకు చేస్తుంటారు. మత్తు వారికి అత్యంత ప్రాధాన్యత. అలాంటి వారితో కలిస్తే మీరు వారిలా మారవచ్చు. లేదంటే వారి తప్పుకు మీరు మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. అలాగే వారు మీ ఎమేషన్స్ కు అస్సలు విలువ ఇవ్వరు.
స్వార్థపరుడు తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అలాంటి వారికి ఇతరుల బాధలు ఎప్పుడూ అర్థం కావు. అలాంటి వారికి ఎప్పుడూ దూరంగా ఉండటమే మంచిది. స్వార్థపరుడు తన పని అయిపోయిందంటే.. ఇక అక్కడ నుంచి మెల్లగా జారుకుంటాడు. వెనకాల ఏం జరుగుతుందనే విషయాన్ని పెద్దగా పట్టించుకోడు. స్వార్థంతో మిమ్మల్ని ముంచేస్తారు.
దొంగతనం చేయాలనే ఉద్దేశ్యం ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఒక దొంగ ఎవరి బాధను అర్థం చేసుకోడు. ఈ దొంగతనం తర్వాత ఎవరికి ఎంత నష్టం వాటిల్లుతుందో వారికి అర్థం కాదు. దొంగతనం చేసే అలవాటు ఉన్నవాడు కనీసం చీపురు పుల్లను అయినా ఎత్తుకెళ్లాలి అనే ఆలోచన ఉంటుంది. అలాంటివారు మీతో ఉంటే మీ జీవితంలోని విలువైన వస్తువులు కోల్పోవలసి వస్తుంది.
చాణక్య నీతి ప్రకారం రాజులు, అధికారులు సాధారణ ప్రజల బాధలను, భావాలను అర్థం చేసుకోరు. వారు ఎల్లప్పుడూ నియమాలు, సాక్ష్యాల ఆధారంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. అందులో సాధారణ ప్రజలకు న్యాయం జరగొచ్చు.. జరగకపోవచ్చు. వారికి దగ్గరి వారి కోసం ఇతరుల జీవితాలను బలి చేస్తారు.
ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు లోకాన్ని విడిచి వెళ్ళాలి. ఇది ప్రకృతి నియమం. ఎవరైనా చనిపోయే సమయం వచ్చినప్పుడు, యమరాజు ఎవరినీ విడిచిపెట్టడు. అతనికి ఎవరి బాధలు, భావాలు అర్థం కాదు. సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. ఎవరి ఎమోషన్స్ తోనూ ఆయనకు పని లేదు.