Best Web Hosting Provider In India 2024
Brahmamudi January 9th Episode: శ్వేతతో రాజ్ క్లోజ్‌గా ఉండటం కావ్య కళ్లారా చూస్తుంది. వారిద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటుంది. కానీ ఆ విషయం రాజ్‌ను అడగాలని ఉన్నా ఆడగలేకపోతుంది. రాజ్ ఆఫీస్ నుంచి రాగానే కోపంగా నిల్చుంటుంది. ఆమెను చూసి రాజ్ కంగారుపడతాడు. కానీ శ్వేత గురించి కాకుండా ఆఫీస్‌కు పంపించిన టిఫిన్ క్యారేజీ ఏది అని సీరియస్‌గా రాజ్‌ను అడుగుతుంది కావ్య. .
ట్రెండింగ్ వార్తలు
పక్కింటి వాళ్లకు, వెనకింటివాళ్లకు ఇచ్చిన టిఫిన్ బాక్స్‌లు తిరిగిరాకపోతే మీ అడవాళ్లు ఎందుకు అల్లాడుతారు అంటూ కావ్యపై సెటైర్ వేస్తాడు రాజ్. ఏదైనా వదిలేస్తే మళ్లీ తిరిగి రావడం లేదని, అది వస్తువైనా..మనిషి అయినా అంటూ కావ్య కోపంగా భర్తకు బదులుస్తుంది. కాఫీ తాగుతారా..బయటతాగి వచ్చారా అంటూ రాజ్‌ను కోపంగా అడుగుతుంది కావ్య.
బయట తాగి రావడం ఏంటి రాజ్ తిరిగి ప్రశ్న అడుగుతాడు. అసలు ఎందుకు ఇలా ఉన్నావని అడుగుతాడు. నాకు జ్ఞానదంతం వచ్చిందని సీరియస్‌గా సమాధానమిచ్చి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రాజ్ ఆలోచనల్లో ఉండగా టవల్ పట్టుకొని అతడి కళ్ల ముందు కావ్య ప్రత్యక్షమవుతుంది. ఆమెను చూసి రాజ్ భయపడిపోతాడు.
అనామిక అలక…
సత్యనారాయణ స్వామి వ్రతం కోసం కళ్యాణ్ సిద్ధమవుతాడు. అతడు వేసుకున్న డ్రెస్ బాగాలేదని అనామిక అంటుంది. ఇలాంటి కలర్స్ నాకు బాగా సూట్ అవుతాయని అప్పు అన్నదని అనామికతో అంటాడు కళ్యాణ్. అప్పు టాపిక్ రాగానే అనామిక అలుగుతుంది. అనామిక కోపం పోవడానికి ఇక నుంచి నీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటానని మాటిస్తాడు. వ్రతం కోసం కళ్యాణ్‌ను తాను రెడీ చేస్తానని అంటుంది అనామిక.
రాజ్‌పై సెటైర్స్…
రాజ్ గార్డెన్‌లో కూర్చొని ఆలోచిస్తుంటాడు. ఒక్కసారిగా అతడి ముఖం ముందు కాఫీ కప్ పెడుతుంది కావ్య. కాఫీ అని చెప్పి ఇవ్వొచ్చుగా అంటూ కావ్యపై సెటైర్ వేస్తాడు రాజ్. చెప్పకపోయినా కాఫీ… కాఫీలానే ఉంటుంది. టీలాగా ఉండదు అంటూ తిక్కతిక్కగా సమాధానమిస్తుంది కావ్య. మనుషులు టేస్ట్ మార్చుకున్నట్లు కాఫీ రోజుకో టేస్ట్ మార్చుకోదు అంటుంది.
నీ తిక్క సమాధానాలకు తలనొప్పి పెరిగిపోయిందని రాజ్ అంటాడు. ఈ తలనొప్పి ఇంట్లో తగిలించుకున్నారా…బయటే తగిలించుకొని వచ్చారా అంటూ మళ్లీ సెటైర్ వేస్తుంది. ఇమ్మంటే ఇస్తా…పొమ్మంటే పోతా..ఉండమంటే ఉంటా అని మళ్లీ అర్థపర్థం లేకుండా రాజ్‌తో మాట్లాడుతుంది కావ్య. ఎక్కడికి అని రాజ్ అడిగితే బయటకో..లోపలికో అంటూ సమాధానం చెప్పి వెళ్లిపోతుంది.
కళ్యాణ్ షాక్…
కళ్యాణ్‌ను ట్రెండీగా తయారు చేస్తుంది అనామిక. అతడి గెటప్, డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం మార్చేస్తుంది. తన రూపాన్ని అద్ధంలో చూసుకొని కళ్యాణ్ షాక్ అవుతాడు. స్టైలిష్‌గా వాక్ చేయమని కళ్యాణ్‌తో అంటుంది అనామిక. కానీ ఆమె చెప్పినట్లు చేయలేకపోతాడు. అనామిక దగ్గరుండి అతడితో స్టైల్‌గా వాకింగ్ చేస్తుంది. ఇక నుంచి ఇలాగే ఉండమని అంటుంది.
అప్పుకు పెళ్లి…
కళ్యాణ్ జ్ఞాపకాల నుంచి బయటపడటానికి మళ్లీ పిజ్జా డెలివరీ ఉద్యోగంలో చేరాలని అప్పు నిర్ణయించుకుంటుంది. కళ్యాణ్ ను మర్చిపోలేక అప్పు పడుతోన్న బాధను కృష్ణమూర్తి, కనకం చూడలేకపోతారు. అప్పుకు పెళ్లి చేస్తేనే కళ్యాణ్‌ను మర్చిపోతుందని, అప్పుడే కొత్త జీవితాన్ని మొదలుపెట్టగలదని అన్నపూర్ణమ్మ అంటుంది. అప్పుకు పెళ్లి చేయడానికి కృష్ణమూర్తి ఒప్పుకోడు.
రోజుకో వెరైటీ…
భోజనం చేసే సమయంలో రోజు పప్పు తప్ప మరోటి చేయవా…రోజుకో వెరైటీ చేయోచ్చుగా అంటూ కావ్యతో అంటాడు రాజ్. బయటివాళ్లను పిలిచి వడ్డించమని చెప్పనా వెరైటీగా ఉంటుందని కావ్య సమాధానమిస్తుంది. కావ్య ఏం చెబుతుందో రాజ్‌కు అర్థం కాదు. బయటకు తిరుగుతున్నారుగా….కొత్త రుచులకు అలవాటుపడ్డట్లున్నారు కదా అని అంటున్నానని కావ్య రాజ్‌కు చెబుతుంది. రాజ్ ఇంటి ఫుడ్ తప్ప బయటి భోజనం చేయడని అపర్ణ కొడుకును సమర్థిస్తుంది. నేను ఇన్నాళ్లు అలాగే అనుకున్నానని కావ్య లోలోన అనుకుంటుంది.
కళ్యాణ్ గెటప్…
ఆ తర్వాత కొత్త గెటప్‌లో కళ్యాణ్ అందరి ముందుకు వస్తాడు. అతడి గెటప్ చూసి అందరూ షాకవుతారు. డ్రెస్ అదిరిపోయిందని కళ్యాణ్‌కు కాంప్లిమెంట్ ఇస్తాడు. కొత్త పెళ్లాం…కొత్త గెటప్ …అదరిందయ్యా కళ్యాణ్ అంటూ అందరూ అతడిని ఆటపట్టిస్తారు.
రుద్రాణికి రివర్స్ పంచ్..
ఇప్పుడు గెటప్ మార్చింది…తర్వాత ఇంకేం మారుస్తుందో అంటూ అనామికపై పంచ్ వేయబోతుంది రుద్రాణి. భార్య కోసం బట్టలు మార్చుకోవడంలో తప్పు లేదు. క్యారెక్టర్ మార్చుకుంటే తప్పు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటూ భార్యను మోసం చేస్తే తప్పు అంటూ రాజ్‌పై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్ వేస్తుంది కావ్య. అంటే కళ్యాణ్ మారిపోతున్నాడని అంటున్నావా రుద్రాణి అడుగుతుంది. మీ అబ్బాయి రాహుల్ మారిపోతున్నాడని రుద్రాణికి రివర్స్ పంచ్ వేస్తుంది కావ్య. కళ్యాణ్‌కు సపోర్ట్ చేసి కావ్య మాట్లాడుతుంది. కానీ ధాన్యలక్ష్మి, అపర్ణ మాత్రం కావ్యను సూటిపోటి మాటలతో దెప్పిపొడుస్తారు. ఇందిరాదేవి వారించిన వినరు.
రాజ్ వార్నింగ్…
కావ్యపై తనపై మాటల దాడి ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలని రాజ్ అనుకుంటాడు. అదే విషయం గురించి బెడ్‌రూమ్‌లో ఆలోచిస్తుంటాడు. అప్పుడే కావ్య రూమ్‌లోపలికి వస్తుంది. వచ్చి రాగానే ఏంటి వెటకారం మాటలు అంటూ ఫైర్ అవుతాడు. ఏంటి సంగతి అని నిలదీస్తాడు. నాతో ఉండటం నచ్చడం లేదా అని రాజ్‌ను అడుగుతుంది కావ్య. అణుబాంబుతో ఆడుకోవాలని, మిస్సైల్‌తో మసాజ్ చేసుకోవాలని ఎవరూ అనుకోరని రాజ్ వ్యంగ్యంగా మాట్లాడుతాడు.
నాది సేమ్ ఫీలింగ్ అని కావ్య బదులిస్తుంది. అసలు తిక్కతిక్కగా ఎందుకు మాట్లాడుతున్నావని మళ్లీ కావ్యను నిలదీస్తాడు. క్లారిటీ రావడం లేదని, వచ్చిన తర్వాత మిమ్మల్నే అడుగుతాను. అప్పటివరకు ప్రశాంతంగా ఉండండి అని రాజ్‌తో చెప్పి కావ్య నిద్రపోవడానికి సిద్ధమవుతుంది. కోపంగా కావ్యను దిండుతో కొట్టబోతాడు రాజ్. కళ్లు మూసుకొని కూడా రాజ్ చేస్తున్న పనులను కనిపెట్టేస్తుంది కావ్య. కొడితే గృహహింస కేస్ అవుతుంది. చంపితే మర్డర్ కేసు అవుతుంది.ఏదైనా మీరు జైలుకు వెళతారు అంటూ సెటైర్స్ వేస్తుంది.