Guntur Kaaram Trailer Views Record: దుమ్మురేపిన గుంటూరు కారం ట్రైలర్.. 24 గంటల్లో ఆల్‍టైమ్ రికార్డ్

Best Web Hosting Provider In India 2024

Guntur Kaaram Trailer View Record: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం మూవీపై క్రేజ్ ఏ రేంజ్‍లో ఉందో మరోసారి రుజువైంది. గుంటూరు కారం ట్రైలర్‌ దుమ్మురేపింది. ఏకంగా ఓ ఆల్‍టైమ్ రికార్డు సృష్టించింది. గుంటూరు కారం ట్రైలర్ ఆదివారం (జనవరి 7) రిలీజ్ అయింది. మహేశ్ బాబు లుక్, మాస్ యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో 24 గంటల్లోనే ఈ ట్రైలర్‌కు భారీ స్థాయి వ్యూస్ వచ్చాయి. దీంతో ఆల్‍టైమ్ రికార్డ్ సృష్టించింది. ఈ వివరాలను గుంటూరు కారం మూవీ టీమ్ నేడు (జనవరి 8) అధికారికంగా వెల్లడించింది.

 

ట్రెండింగ్ వార్తలు

గుంటూరు కారం సినిమా ట్రైలర్‌కు యూట్యూబ్‍లో 24 గంటల్లోనే 39 మిలియన్ల (3.9 కోట్లు)కు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో 24 గంటల వ్యవధిలో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సౌత్ ఇండియన్ ట్రైలర్‌గా గుంటూరు కారం ఆల్‍టైమ్ రికార్డు సృష్టించింది. దక్షిణాదిలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని హారిక, హాసినీ క్రియేషన్స్ వెల్లడించింది.

“ఈడు రౌడీ రమణ… సినిమా స్కోపు.. ఈ సంక్రాంతికి 70ఎంఎంలో బొమ్మ దద్దరిల్లిపోతుంది. ఆల్‍టైమ్ రికార్డ్. గుంటూరు కారం ట్రైలర్‌కు వ్యూస్ 39 మిలియన్స్ దాటేశాయి. 24 గంటల్లో మోస్ట్ వ్యూవ్డ్ సౌత్ ఇండియన్ ట్రైలర్” అని మూవీ టీమ్ ట్వీట్ చేసింది. ఈ రికార్డుకు సంబంధించిన పోస్టర్ కూడా పోస్ట్ చేసింది. గుంటూరు మిర్చీల మధ్య బీడీ తాగుతూ మహేశ్ జీపు దిగే పోజుతో ఈ పోస్టర్ ఉంది. సంక్రాంతి సందర్బంగా జనవరి 12వ తేదీన భారీ స్థాయిలో థియేటర్లలో గుంటూరు కారం మూవీ రిలీజ్ కానుంది.

గుంటూరు కారం సినిమాలో ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ క్యారెక్టర్ చేస్తున్నారు మహేశ్ బాబు. చాలా కాలం తర్వాత మహేశ్.. మాస్ మూవీ చేస్తుండటంతో క్రేజ్ విపరీతంగా ఉంది. మదర్ సెంటిమెంట్ కూడా ఈ చిత్రంలో ప్రధానంగా ఉంటుందని ట్రైలర్‌ ద్వారా అర్థమైంది. మహేశ్ యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ అదిరిపోయింది.

 

గుంటూరు కారం చిత్రంలో మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. మహేశ్ తల్లి పాత్రను సీనియర్ నటి రమ్యకృష్ణ పోషించారు. జగపతి బాబు, జయరాం, ఈశ్వరి రావు, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, సునీల్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి థమన్ సంగీతం అందించారు.

గుంటూరు కారం రన్‍టైమ్

గుంటూరు కారం సినిమా రన్‍టైమ్ (నిడివి) వివరాలు అధికారంగా బయటికి వచ్చాయి. ఈ సినిమా 2 గంటల 39 నిమిషాలు (159 నిమిషాలు) ఉండనుంది. ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు.

మరోవైపు, గుంటూరు కారం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు వేదిక, డేట్ కూడా ఖరారైంది. గుంటూరులోని నంబూరు ఎక్స్ రోడ్స్ వద్ద రేపు (జనవరి 9) సాయంత్రం 5 గంటల నుంచి ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

 
WhatsApp channel
 

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024