Best Web Hosting Provider In India 2024
NNS January 9th Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (జనవరి 9) 128వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. తనను హత్య చేసిన వ్యక్తి అమర్ ఇంట్లోకి ప్రవేశించడంతో ఉలిక్కిపడుతుంది అరుంధతి. అక్కడ ఉన్న వాడిని చూసి దొంగ అనుకుంటుంది. ఆ తర్వాత ఇతనిని ఎక్కడో చూశాను అనుకుంటూ అతడు తనని చంపిన వాడే అని గుర్తుపట్టి భయంతో వణికి పోతుంది.
ట్రెండింగ్ వార్తలు
లోపలికి వెళ్తున్న హంతకుడిని.. నీకు లోపల ఏం పని అంటూ అరుస్తుంది. కానీ హంతకుడికి వినిపించదు. ఇప్పుడు లోపలికి వెళ్లి ఏం చేస్తాడో అనుకుంటూ గుప్తా గారికి చెప్పాలి అనుకొని చిత్రగుప్తుడిని పిలుస్తుంది అరుంధతి. అతను అందుబాటులో లేకపోవడంతో ఈయన ఎక్కడికి వెళ్లారో అనుకుంటూ మళ్లీ హంతకుడి దగ్గరికి వెళుతుంది. ఇంతలోనే హంతకుడు తన పద్ధతిలో తలుపు తెరిచి లోపలికి వెళ్ళిపోతాడు.
మనోహరి ఎక్కడ ఉందో అని వెతుకుతూ పిల్లల గదికి వెళ్తాడు. ఆగు, పిల్లల గదికి వెళ్ళకు వాళ్ళని ఏమి చేయకు నన్ను చంపింది సరిపోలేదా అంటూ కేకలు వేస్తుంది అరుంధతి. కానీ తన మాటలు హంతకుడికి వినిపించకపోవడంతో ప్రతి గది చెక్ చేస్తూ ఉంటాడు. ఎవరిని ఏం చేస్తాడో అని భయంతో అమర్ రూమ్ కి వెళ్లి అమర్ ని లేపుతుంది. కానీ అమర్ లేవకపోతే గట్టిగా పిలుస్తుంది. ఆ వైబ్రేషన్ ని ఫీలవుతాడు అమర్. అరుంధతి పిలిచినట్లుగా అనిపించింది ఏంటి అనుకుంటాడు ఆ తర్వాత మంచినీళ్ల కోసం కిందికి వస్తాడు అమర్. ఈ లోగా హంతకుడు మనోహరి రూమ్ కి వెళ్లి ఆమెని నిద్ర లేపుతాడు.
నిద్రలో హంతకుడిని చూసి కంగారు పడుతుంది. భయంతో వణికి పోతుంది మనోహరి. నీకేమైనా పిచ్చా ఇక్కడికి ఎందుకు వచ్చావు.. అమర్ కి దొరికావంటే చంపేస్తాడు అంటుంది. చంపితే నన్ను ఒక్కడినే చంపడు.. మిమ్మల్ని కూడా చంపుతాడు.. అందుకే నిజం చెప్పి చచ్చి పోదాం అనుకుంటున్నాను అంటూ హంతకుడు మెల్లగా తలుపు తీసేసరికి ఎదురుగా మంచినీళ్లు తాగుతున్న అమర్ కనిపిస్తాడు. అది చూసిన మనోహరి మరింత భయపడిపోతుంది. నిజం చెప్పొద్దు అంటూ బ్రతిమాలుకుంటుంది.
ఈ లోపు అమర్ నీళ్లు తాగి మళ్లీ తన రూమ్ కి వెళ్ళిపోతుంటే హంతకుడు ఇక్కడే ఉన్నాడు చూడండి అంటూ భర్తని వెంబడిస్తూ అంటుంది అరుంధతి. అమర్ పైకి వెళ్ళటం చూసి హంతకుడు కంగారుగా బయటికి పారిపోతాడు. భర్త నిద్రపోవడం చూసిన అరుంధతి కంగారుగా కిందికి వస్తుంది. మెయిన్ డోర్ వేసి ఉండటం చూసి హంతకుడు వెళ్లిపోయినట్లున్నాడు అనుకుంటుంది. బయటికి వచ్చిన తర్వాత వెళ్లిన పని వర్క్ అవుట్ అయిందా అని హంతకుడి ఫ్రెండ్ హంతకుడిని అడుగుతాడు.
భయాన్ని గుర్తు చేయటం కాదు మరెప్పుడూ మర్చిపోకుండా చేశాను అని గర్వంగా చెప్తాడు హంతకుడు. అంతలోనే మనోహరి ఫోన్ చేసి నాకు కొంచెం టైం ఇవ్వు.. రెండు రోజుల్లో నువ్వు అడిగిన డబ్బు అరేంజ్ చేస్తాను అంటుంది. నీ ఇష్టం అప్పటివరకు నేను సిటీలోనే ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు హంతకుడు. వీడికి ఇప్పుడు డబ్బు ఇస్తే మళ్లీ బ్లాక్ మెయిల్ చేయడని గ్యారెంటీ లేదు, అలాగని వదిలేస్తే మళ్లీ వస్తాడు.. ఎలాగైనా శాశ్వతంగా వదిలించుకోవాలి అనుకుంటుంది మనోహరి.
పూజలో ఉన్న ఘోర తన ప్రయత్నం ఫలించినందుకు కోపంతో రగిలిపోతాడు. దేవా ని పిలిచి నేను ఎప్పుడూ ఓడిపోలేదు కానీ ఇప్పుడు ఓడిపోతున్నాను దీనికి కారణం ఏమిటి అని అడుగుతాడు. ఇప్పుడు అర్థమైందా నీ కన్నా ముందు ప్రయత్నించిన వాళ్ళు ఎందుకు ఓడిపోయారో. వశీకరణం అంత సులభమైన పని కాదు. మీకు సాయం చేయడం కోసం ఒక ప్రాణిని పంపిస్తాను అని చెప్పి శ్వేతనాగుని పంపిస్తాడు దేవా. ఇప్పుడే ఈ పాముని ఇంటి లోపలికి పంపించి ఆ ఆత్మ ని బయటికి రప్పించి ఆత్మని బంధిస్తాను అని ఆనందంగా అనుకుంటాడు ఘోరా.
పిల్లలు ఆడుకుంటుంటే అంజు పడిపోతుంది. దెబ్బ తగిలి ఏడుస్తున్న అంజూని దగ్గరకు తీసుకొని ఓదార్చలేక కన్నీరు పెట్టుకుంటుంది అరుంధతి. ఏడుస్తూ కోపంతో దేవుడిని తిట్టుకుంటుంది. దేవుడి రూపంలో అంజు బాధ తీర్చడానికి ఎవరు వస్తారు? ఈ రోజు ఎపిసోడ్లో సర్ప్రైజ్ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు జనవరి 09న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే.