Best Web Hosting Provider In India 2024
Srikakulam Sherlock Holmes: టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా మారారు. శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ పేరుతో ఓ సినిమా చేస్తోన్నాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను 24 మంది టాలీవుడ్ డైరెక్టర్లు ఒకేసారి రిలీజ్ చేశారు. సోమవారం జరిగిన శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్‌కు నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ సినిమాకు రైటర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాతోనే దర్శకుడిగా అతడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటిస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
షర్మిలమ్మ పాత్రతో…
శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ మూవీ మూడు పాత్రల నేపథ్యంలో సాగుతుందని దర్శకుడు రైటర్ మోహన్ అన్నాడు. షెర్ అంటే షర్మిలమ్మ…లోక్ అంటే లోక్‌నాథం…హోమ్ అంటే ఓం ప్రకాష్…ఈ మూడు పాత్రల చుట్టే కథ సాగుతుందని డైరెక్టర్ పేర్కొన్నాడు. రెట్రో బ్యాక్‌డ్రాప్‌లో ఫన్నీ థ్రిల్లర్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నట్లు చెప్పాడు.
షెర్లాక్‌హోమ్స్‌గా వెన్నెలకిషోర్ పాత్ర ఆద్యంతం నవ్వులను పంచుతుందని తెలిపాడు. నటుడిగా ఆయనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇదని దర్శకుడు రైటర్ మోహన్ చెప్పాడు. శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌లో కొత్త వైబ్ కనిపిస్తోందని, ఫస్ట్ లుక్ చూస్తుంటే మంచి వినోదం ఉంటుదనే నమ్మకం కలుగుతుందని దిల్ రాజు చెప్పాడు.
అనన్య నాగళ్ల హీరోయిన్…
శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ సినిమాలో అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో కంప్లీట్ ఫన్‌తో తన క్యారెక్టర్ ఉంటుందని ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్‌లో అనన్య నాగళ్ల చెప్పింది. ఓ పజిల్‌లా నెక్స్ట్ ఏం జరుగబోతుందనే క్యూరియాసిటీని కూడా కలిగిస్తుందని చెప్పింది.
శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ సినిమాలో వెన్నెలకిషోర్ తండ్రిగా నాగమహేష్ కనిపించబోతున్నాడు. నేనింతే హీరోయిన్ శియాగౌతమ్‌తో పాటు రవితేజ మహాదాస్యం, అనీష్ కురివిల్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం.
వెన్నెలకిషోర్ బిజీ…
ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీయెస్ట్ కమెడియన్‌లలో ఒకరిగా వెన్నెలకిషోర్ కొనసాగుతోన్నాడు. గత ఏడాది వెన్నెలకిషోర్ 20కిపైగా సినిమాల్లో నటించాడు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న మహేష్ బాబు గుంటూరు కారంతో పాటు తేజా సజ్జా హనుమాన్‌లో వెన్నెలకిషోర్ డిఫరెంట్ రోల్స్ చేశాడు. ప్రస్తుతం రామ్‌చరణ్‌గేమ్ ఛేంజర్‌తో పాటు పలు భారీ బడ్జెట్ సినిమాల్లో వెన్నెలకిషోర్ నటిస్తున్నాడు. కమల్‌హాసన్, శంకర్ కాంబోలో వస్తోన్న ఇండియన్2తో కోలీవుడ్‌లోకి వెన్నెలకిషోర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
హీరోగా రెండు సినిమాలు…
కమెడియన్‌గానే కాకుండా హీరోగా కూడా శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌తో పాటు చారి 111 అనే సినిమా చేస్తున్నాడు వెన్నెలకిషోర్. దర్శకుడిగా గతంలో వెన్నెల వన్ ఆండ్ హాఫ్, జప్ఫా సినిమాలు చేశాడు వెన్నెలకిషోర్. అనుకున్న స్థాయిలో ఈ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో మళ్లీ మెగాఫోన్ పట్టలేదు.
వకీల్ సాబ్‌లో…
మరోవైపు అనన్య నాగళ్ల కూడా హీరోయిన్‌గా చిన్న సినిమాలు చేస్తూనే పెద్ద సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేస్తోంది. మల్లేషం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య…పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌లో ఓ ఇంపార్టెంట్ రోల్ చేసింది.