
Best Web Hosting Provider In India 2024

Jamal Kudu sitar rendition: యానమిల్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందులోని జమాల్ కుదు సాంగ్ కూడా అదే స్థాయిలో హిట్ అయింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ కోట్ల కొద్దీ వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసింది. అయితే తాజాగా ఈ పాటకు ఓ వ్యక్తి సితార్ రెండిషన్ ఇచ్చాడు. ఇది ఒరిజినల్ సాంగ్ కంటే కూడా మరో లెవల్ అని చెప్పొచ్చు.
ట్రెండింగ్ వార్తలు
సితార్ ప్లేయర్ అయిన రిషబ్ రిఖిరామ్ శర్మ ఇప్పుడీ జమాల్ కుదు పాటను తనదైన స్టైల్లో వాయించాడు. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో కొన్ని రోజుల కిందట పోస్ట్ చేశాడు. యూట్యూబ్ లో ఆ ఒరిజినల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో.. ఈ సితార్ వెర్షన్ కూడా అంతే హిట్ అయింది. రిషబ్ అందించిన ఈ సరికొత్త వెర్షన్ కూడా ఫ్యాన్స్ కు బాగా నచ్చింది.
“చిన్నప్పటి నుంచీ నేను రెండు మ్యూజికల్ దారుల్లో వెళ్లాను. ఓవైపు సితార్ ను సాంప్రాదాయ మార్గంలో నేర్చుకుంటూనే మరోవైపు నాకు నేనుగా దానితో భిన్నమైన మ్యూజిక్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాను. ఇప్పుడు నా ఈ రెండు అభిరుచులను కలిపి మీ ముందుకు తీసుకొస్తున్నాను” అనే క్యాప్షన్ తో రిషబ్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు.
జమాల్ కుదు సూపర్ హిట్
నిజానికి యానిమల్ మూవీలోని ఈ జమాల్ కుదు సాంగ్ ఇరాన్ కు చెందిన సాంప్రదాయ బండారీ మ్యూజిక్. దీనిని ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన హర్షవర్దన్ రామేశ్వర్ కాస్త మార్చి అందించాడు. ఇది కాస్తాఇండియన్ మ్యూజిక్ లవర్స్ కు తెగ నచ్చేసింది. పాటలోని భాష తెలియకపోయినా.. ఆ పాట పాడిన తీరు, మ్యూజిక్ ను బాగా ఎంజాయ్ చేశారు.
యానిమల్ రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ చూసిన ఈ పాటే వినిపించింది. మూవీలో విలన్ అయిన బాబీ డియోల్ పాత్ర అబ్రార్ ఎంట్రీ సందర్భంగా వచ్చే పాట ఇది. ఇందులో అతడు తలపై మందు గ్లాస్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తాడు. చాలా మంది ఆ స్టెప్పులు ట్రై చేస్తూ రీల్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇక యూట్యూబ్ లో అయితే ఈ సాంగ్ లిరికల్, వీడియో రెండూ సూపర్ హిట్ అయ్యాయి.
మొదట రిలీజ్ అయిన జమాల్ కుదు లిరికల్ సాంగ్ ను 2.6 కోట్ల మంది చూడగా.. వీడియో సాంగ్ కు ఏకంగా 5.3 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ సాంగ్ ఎంత హిట్ అయిందో మూవీ కూడా అదే స్థాయిలో సక్సెస్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకుపైగా కలెక్షన్లు వచ్చాయి. ఓవైపు విమర్శల వర్షం కురుస్తున్నా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం యానిమల్ దూకుడు కొనసాగించింది.
తాజాగా మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సందర్భంగా మూవీ టీమ్ యానిమల్ టికెట్లను కేవలం రూ.100 కే ఇస్తున్నట్లు కూడా అనౌన్స్ చేసింది. బాక్సాఫీస్ రన్ దాదాపు ముగింపు దశలో ఉండటంతో ఇక త్వరలోనే యానిమల్ ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.