Best Web Hosting Provider In India 2024
Rangareddy Crime : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణం జరిగింది. కేవలం 20 రూపాయల కోసం నవ మాసాలు మోసి జన్మనిచ్చిన కన్న తల్లిపై ఓ కసాయి కొడుకు విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. షాద్ నగర్ లో సుగుణమ్మ అనే వృద్ధురాలు నివసిస్తుంది. ఆమెకు శివకుమార్ అనే కొడుకు ఉన్నాడు. సుగుణమ్మ స్థానికంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. డబ్బు కోసం తల్లిని శివకుమార్ తరచూ వేధించేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి రూ.20 కోసం శివకుమార్ తల్లి సుగుణమ్మతో గొడవపడ్డాడు. తన వద్ద డబ్బులు లేవని తల్లి చెప్పడంతో….ఆమెపై శివకుమార్ దాడికి దిగాడు. విచక్షణా రహితంగా దాడి చేసి ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. అక్కడ ఉన్నవారు శివకుమార్ ను ఆపే ప్రయత్నం చేయగా….శివకుమార్ ఆగకుండా అలానే దాడి చేశాడు. తల్లిని విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా….చీరతో తల్లి మెడను గట్టిగా బిగించాడు. దాంతో సుగుణమ్మ స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. తల్లి స్పృహ కోల్పోవడంతో శివకుమార్ అక్కడ నుంచి పరారయ్యాడు. పక్కనున్న వారు ఆమెను ఆస్పత్రికి తరలించగా సుగుణమ్మ చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు శివకుమార్ పై కేసు నమోదు చేశారు.
ట్రెండింగ్ వార్తలు
వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి
తెలంగాణలో వీధి కుక్కల బెడద ఏమాత్రం తప్పడం లేదు. నిత్యం ఏదో ఒక చోట చిన్నారులపై విధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో విధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. మక్లూర్ మండలం కల్లెడలో గత నెల 25న నిషాన్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న నిశాన్ ఆరోగ్యం రెండు రోజుల క్రితం విషమించింది. పరిస్థితి మరింత విషమంగా మారడంతో బాలుడిని హైదరాబాద్ కు తరలిస్తూ ఉండగానే మార్గమధ్యలో నిషాన్ మరణించాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇప్పటికైనా వీధి కుక్కల దాడులు తగ్గేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా