Best Web Hosting Provider In India 2024
Krishna mukunda murari serial january 10th: దేవ్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. ఇక నుంచి ఈ ఇంటి కోడలివి నువ్వేనని రేవతి సంతోషంగా చెప్తుంది. ముకుంద మాత్రం ఏడుస్తూ ఉండిపోతుంది. అవుట్ హౌస్ లో శకుంతల తెల్లారితే లగ్గం ఏంటి పరిస్థితని ఆలోచిస్తూ ఉండగా కృష్ణ సంతోషంగా ఉంటుంది. అసలు దోషి దొరికిపోయాడని పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందని చెప్తుంది. ఆ మాట విని శకుంతల చాలా సంతోషిస్తుంది. ఇక తమకి మంచి రోజులు వచ్చాయని సంతోషపడతారు. ఈరోజు ఎపిసోడ్ ప్రోమోలో ఏముందంటే..
ట్రెండింగ్ వార్తలు
చెయ్యని నేరానికి కృష్ణ ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అవుట్ హౌస్ లో ఉంది. తను ఈ ఇంట్లో ఉండటానికి అన్ని అర్హతలు ఉన్నాయి. కావాలంటే నేను అవుట్ హౌస్ లో ఉంటానని ముకుంద చెప్తుంది. అవును పెద్దమ్మ ఇక కృష్ణ అక్కడ ఉండాల్సిన అవసరం ఏముందని మురారి కూడా అంటాడు. భవానీ ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది. అగ్రిమెంట్ మ్యారేజ్ కాబట్టి వాళ్లిద్దరికీ పెళ్లి చేసి ఇంట్లోకి కోడలిగా తీసుకోద్దామని చెప్తుందా లేదా తెలియాలంటే ఈరోజు ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.
నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందని కృష్ణ తన చిన్నమ్మకి సంతోషంగా చెప్తుంది. పెళ్లి ఎలా ఆగిందని శకుంతల అడిగితే ముకుంద అన్నయ్య దేవ్ శ్రీధర్ ని చంపాడు. ఏసీపీ సర్ రూపం మార్చింది కూడా అతనే అని జరిగింది మొత్తం చెప్తుంది. దేవ్ చేతి ఉంగరం చూసి హంతకుడు దేవ్ అనేసి గుర్తు పట్టిన విషయం మొత్తం శకుంతలకి చెప్తుంది. తన చెల్లి ఆనందం కోసం చేశానని చెప్పినట్టు చెప్తుంది.
ముకుందని భవానీ ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెప్తుంది. ఇందులో తన తప్పేమీ లేదని తనని నమ్మమని ముకుంద ఏడుస్తూ అడుగుతుంది. కానీ భవానీ మాత్రం ఒప్పుకోదు. ఈ కన్నీళ్ళు చూసి మోసపోయాను. నువ్వు నీ అన్నయ్యలా నటించావని అంటుంది.
ముకుంద: నేను నటించడం లేదత్తయ్య వాడు అలా చేస్తాడని కూడా నేను ఊహించలేదు
భవానీ: అని నన్ను నమ్మమంటావా? ఈ కన్నీళ్ళు చూసే ఇన్నిరోజులు నేను మోసపోయాను. వీళ్ళంతా ప్రభాకర్ నేరం చేయలేదని అంటే వీళ్ళని నానామాటలు అన్నాను. ఇక ఇప్పుడు కూడా నిన్ను నమ్మితే నువ్వు చేసిన తప్పులో నాకు భాగం ఉన్నట్టే
రేవతి: అలా ఎందుకు అనుకుంటాం అక్క
భవానీ: మీరు ఇప్పటికీ నాకు గౌరవం ఇస్తున్నారంటే అది మీ మంచితనం. మురారి నేను అన్నదాంట్లో తప్పేమైన ఉందా?
మురారి: తప్పే పెద్దమ్మ మీరు తప్పు చేస్తే కదా ఇలా మాట్లాడింది. మోసం చేస్తే తప్పు కానీ మోసపోవడం తప్పు కాదు. ఇదే విషయంలో మీరే కాదు మేము మోసపోయాం కాకపోతే మీరు కృష్ణని నమ్మలేదు. మొదటి నుంచి మీకు కృష్ణ అంటే ఇష్టం లేదు ఇక దీనికి బాధపడటం ఎందుకు
క్షమాపణ అడిగిన ముకుంద
ముకుంద: నేనేవరిని మోసం చేయలేదు. మీరంతా నేను మా అన్న కలిసి మోసం చేశామని నమ్ముతున్నారా? అని అడుగుతుంది. అందరూ నమ్ముతున్నట్టే అని మౌనంగా ఉంటారు. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన కృష్ణ మాత్రం తాను నమ్మడం లేదని చెప్తుంది.
కృష్ణ: నీ అంతట నువ్వు వెళ్లిపోతున్నావా లేదంటే ఎవరైనా వెళ్లిపొమ్మన్నారా?
భవానీ: మీ అత్తయ్య కాదు నేనే వెళ్లమన్నా. వీళ్ళ అన్నయ్యకి చట్టం శిక్ష విధిస్తే చెల్లికి నేను శిక్ష వేస్తున్నా
కృష్ణ: క్షమించండి తను ఈ ఇంటి మనిషి, ఈ ఇంటి కోడలు
భవానీ: ఆ హక్కు ఎప్పుడో కోల్పోయింది. తనని ఎవరూ ఆపే ప్రయత్నం చేయవద్దు. తను ఇప్పుడు శ్రీనివాస్ కూతురు మాత్రమే
ముకుందకి అండగా నిలిచిన కృష్ణ
కృష్ణ: ఎక్కడికి వెళ్తుంది. తను నా భర్తని ప్రేమించింది. ఇప్పటికీ ప్రేమిస్తుంది కూడా. అది ముమ్మాటికి నిజం ఎవరూ హర్షించకపోగా అసహ్యించుకుంటారు. కానీ మీ అందరూ పెద్దత్యయ్య పెళ్లి చేయడానికి సిద్ధపడితే మీరు అందరూ అంగీకరించారు ఎవరూ ఎదిరించలేదు. ఇందాక దేవ్ చేతికి ఉంగరం చూడకపోయి ఉంటే ఏం జరిగేది. నేను మిమ్మల్ని ఎవరిని నిందించడం లేదు. భయం, గౌరవం నిజాన్ని తొక్కిపెట్టేసింది. దీనికి ఎవరు బాధ్యులు కాదు. పెద్దత్యయ్య నేను ఎక్కువ మాట్లాడితే క్షమించండి. మాది అగ్రిమెంట్ మ్యారేజ్ ని మీకు ముందే చెప్పకపోవడం నాది తప్పు అందుకే తలవంచి శిక్ష అనుభవించాను కానీ ముకుంద చేయని తప్పుకి శిక్ష ఎందుకు వేయాలి?
ముకుంద: థాంక్స్ కృష్ణ నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావ్. నిజంగా నేను ఏ తప్పు చేయలేదు. వాడు నా అన్న చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. కానీ ఒక నిజం చెప్పనా నువ్వు అనుకున్నంత మంచిదాన్ని కాదు. చాలా తప్పులు చేశాను కానీ నీ మాటల్లో నిజాయతీ చూసి నేను మారాను
కృష్ణ: విన్నారు కదా దానం కంటే క్షమాదానం గొప్పది అంటారు. దయచేసి ముకుందకి క్షమాదానం చేయండి.
ముకుంద: నా పెళ్లి అని అందరికీ చెప్పుకున్నాను. ఇప్పుడు బయటకి వెళ్ళి ఏం చెప్పను. ఒక క్రిమినల్ కి చెల్లిగా పుట్టడం నా తప్పా. మురారి ప్లీజ్ నన్ను క్షమించు ఇక నీ జీవితంలో కృష్ణ తప్ప ఎవరూ ఉండరు. ఇక ఎప్పుడూ మిమ్మల్ని డిస్ట్రబ్ చేయను. ప్లీజ్ అందరూ నన్ను క్షమించండని కన్నీళ్ళు పెట్టుకుంటుంది
కృష్ణ: పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది ఒక్కసారి ఆలోచించండి పెద్దత్తయ్య. మీరు ముందు నన్ను అసహ్యించుకున్నారు నా విషయంలో మీరు మారలేదా? నాకోసం హాస్పిటల్ కూడా కట్టించారు కదా. ఏసీపీ సర్ మీరు మాట్లాడండి ఇక్కడ మాట్లాడి పెద్దత్తయ్యని ఒప్పించాల్సింది మీరే
మురారి: కృష్ణ చెప్పినట్టు ముకుంద మారిందని చెప్తుంది కదా తను కూడా క్షమించమని అడుగుతుంది కదా ఒక్కసారి ఆలోచించండి
భవానీ: క్షమించమని అడిగావ్ కానీ క్షమించను. మీది అగ్రిమెంట్ మ్యారేజ్ అని తెలిసినా, మురారికి గతం గుర్తుకు వచ్చినా మీరు చేసింది తప్పని మిమ్మల్నే క్షమించలేదు. ఏ తప్పు చేయని నిన్ను శిక్షించిన నేను తప్పు చేసిన వాళ్ళని ఎలా వదులుతాను
కృష్ణ: ఒక్కసారికి క్షమించండి పెద్దత్తయ్య
భవానీ: సరే భవిష్యత్ లో ఇక ఏం జరిగినా దానికి నువ్వే బాధ్యురాలివి. దానికి ఒప్పుకుంటే నేను అలాగే క్షమిస్తాను
కృష్ణ: సరే తప్పకుండా బాధ్యత వహిస్తాను మీకు మాట ఇస్తున్నా