Govt Job Alert : హైదరాబాద్ సాలార్‌జంగ్ మ్యూజియంలో ఉద్యోగాలు – అర్హతలు, ముఖ్య వివరాలివే

Best Web Hosting Provider In India 2024

Salar Jung Museum Recruitment 2024 Updates: సాలార్‌జంగ్ మ్యూజియంలోని పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా… గ్రూప్-ఎ, బి, సి కేటగిరి పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో క్యూరేటర్, డిప్యూటీ క్యూరేటర్, అకౌంటెంట్, సీనియర్ ఫొటోగ్రాఫర్, గ్యాలరీ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆఫ్ లైన్ లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ప్రచురితమైన తేదీ నుంచి 45 రోజుల లోపు దరఖాస్తులను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య వివరాలు ఇక్కడ చూడండి…

 

ట్రెండింగ్ వార్తలు

ముఖ్య వివరాలు:

రిక్రూట్ మెంట్ ప్రకటన – కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ.

ఉద్యోగాల భర్తీ – సాలార్ జంగ్ మ్యూజియం, హైదరాబాద్.

ఉద్యోగాలు- గ్రూప్-ఏ, బీ, సి పోస్టులు.

క్యూరేటర్ (ఎడ్యుకేషన్) గ్రూప్-ఎ – 01 పోస్టు. మాస్టర్ డిగ్రీ (మ్యూజియోలజీ/ఫైన్ ఆర్ట్స్/ఆర్కియోలజీ/హిస్టరీ/ఎడ్యుకేషన్)తోపాటు సంబంధిత విభాగంలో 7 సంవత్సరాల అనుభవం ఉండాలి. మ్యూజియోలజీలో పీజీ డిగ్రీ లేనివారు డిప్లొమా(మ్యూజియాలజీ) అర్హత కలిగి ఉండాలి.

క్యూరేటర్ (డిస్‌ప్లే) గ్రూప్-ఎ – 01 పోస్టు, బ్యాచిలర్ డిగ్రీ (ఆర్కిటెక్చర్/ఇంటీరియర్ డిజైన్/ఫైన్ ఆర్ట్స్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. సంబంధిత విభాగంలో 7 సంవత్సరాల అనుభవం ఉండాలి.

క్యూరేటర్ (కన్జర్వేషన్) గ్రూప్-ఎ- 01 పోస్టు, మాస్టర్ డిగ్రీ (కెమిస్ట్రీ/కన్జర్వేషన్). సంబంధిత విభాగంలో 7 సంవత్సరాల అనుభవం ఉండాలి.

డిప్యూటీ క్యూరేటర్ గ్రూప్-ఎ – 04 పోస్టులు, మాస్టర్ డిగ్రీ (మ్యూజియాలజీ/ఫైన్ ఆర్ట్స్/ఆర్కియోలజీ/హిస్టరీ)తోపాటు సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. కలెక్షన్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ అనుభవం ఉండాలి.

డిప్యూటీ క్యూరేటర్(కన్జర్వేషన్) గ్రూప్-ఎ – 01 పోస్టు, మాస్టర్ డిగ్రీ (కెమిస్ట్రీ/కన్జర్వేషన్)తోపాటు సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.

అకౌంటెంట్ గ్రూప్-1 పోస్టు – డిగ్రీ (ఫైన్ ఆర్ట్స్)తోపాటు ఫొటోగ్రఫీ స్పెషలైజేషన్ ఉండాలి. సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.

 

గ్యాలరీ అసిస్టెంట్ గ్రూప్-సి – 01 పోస్టు, మాస్టర్ డిగ్రీ (మ్యూజియాలజీ/ఆర్కియోలజీ/హిస్టరీ లేదా ఫైన్ ఆర్ట్స్) ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

ఎలక్ట్రికల్ అటెండర్ గ్రూప్-సి (ఎంటీఎస్)- 01 పోస్టు, పదోతరగతితోపాటు ఐటీఐ సర్టిఫికేట్ (ఎలక్ట్రికల్ ట్రేడ్) కలిగి ఉండాలి. మ్యూజియంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి – పోస్టును అనుసరించి వయోపరిమితిని విధించారు.

దరఖాస్తు విధానం – ఆఫ్‌లైన్ లో సమర్పించాలి. సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.

పూర్తి చేసిన దరఖాస్తులను

The Director, Salar Jung Museum,

Hyderabad – 500 002 అడ్రస్ కు పంపాలి.

అధికారిక వెబ్ సైట్ – https://www.salarjungmuseum.in/index.html

Email : salarjungmuseum1951@gmail.com

Fax: +91 40 24572558.

 

కింద ఇచ్చిన పీడీఎఫ్ లో పూర్తి నోటిఫికేషన్ తో పాటు నింపాల్సిన దరఖాస్తు ఫారమ్ కూడా ఉంది…..

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024