Best Web Hosting Provider In India 2024
Guppedantha Manasu january 10th episode: మహేంద్ర ద్వారా రిషిని కలవాలని ధరణి అనుకుంటుంది. ఆమెను సీక్రెట్‌గా ఫాలో అవుతాడు శైలేంద్ర. భార్య ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. అతడి ప్లాన్ వర్కవుట్ కాదు. ధరణికి దొరికిపోతాడు. తనను దొంగచాటుగా ఫాలో అయిన భర్తపై ఇన్‌డైరెక్ట్‌గా తిట్ల దండకం మొదలుపెడుతుంది. చెడామడా వాయిస్తుంది. ధరణి మాటలతో శైలేంద్ర ఫైర్ అవుతాడు. కోపంగా భార్యను ఇంట్లోకి లాక్కేళుతాడు.
ట్రెండింగ్ వార్తలు
రిషిని చూడటానికి…
అసలు నువ్వు బాబాయ్ ఇంటికి ఎందుకు వెళ్లావు? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలని అనుకున్నావని ధరణిని నిలదీస్తాడు శైలేంద్ర. రిషిని చూడటానికి వెళ్లానని భర్తకు సమాధానమిస్తుంది ధరణి. రిషి తిరిగి వచ్చాడా? అతడు ఎక్కడున్నాడో నీకు తెలుసా అంటూ ఎగ్జైటింగ్‌గా ధరణిని అడుగుతాడు శైలేంద్ర. రిషి ఎక్కడున్నాడో తనకు తెలియదని ధరణి సమాధానమిస్తుంది రిషి క్షేమం గురించి కనుక్కుందామని మహేంద్ర ఇంటికి వెళ్లాను. అంతే కానీ రిషి తిరిగి వచ్చాడా? అసలు అతడు ఎక్కడున్నాడో కూడా తనకు తెలియదని భర్తకు చెబుతుంది. మహేంద్ర ద్వారా ఆ విషయాలు తెలుసుకుందామని అనుకున్నానని, కానీ చిన మావయ్య ఇంట్లో లేడని శైలేంద్రతో అంటుంది ధరణి.
శైలేంద్రకు క్లాస్…
భర్తతో మాట్లాడుతూనే సీక్రెట్‌గా మొబైల్ కెమెరా ఆన్ చేస్తుంది ధరణి. శైలేంద్రతో మాట్లాడే మాటల్ని రికార్డ్ చేసేలా ప్లాన్ చేస్తుంది. నిజంగా రిషి ఎక్కడున్నాడో నీకు తెలియదా అంటూ మరోసారి ధరణిని అడుగుతాడు శైలేంద్ర. నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని ప్రశ్నిస్తాడు. నేను ఏదైనా దాస్తే అది మంచికోసమే…మీలా చెడు కోసం కాదని భర్తకు మాటకు మాట బదులిస్తుంది ధరణి. మీరు చేసిన దుర్మార్గాలు, దారుణాలు నాలుగైదు మాటల్లో చెప్పుకునేవి కాదని కోపంగా అంటుంది. నేను రిషిని చూడాలని అనుకుంటే ఏదో మహా అపరాధం అన్నట్లు నన్ను ఎందుకు నిలదీస్తున్నారని శైలేంద్రకు క్లాస్ ఇస్తుంది.
ధరణి రివర్స్ ఎటాక్…
ఎండీ పదవి మీద ఆశతో రిషిపై ఎన్నో ఎటాక్స్ చేయించారు…ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు అంటూ భర్త దుర్మార్గాలను అతడి నోటి నుంచే బయటపెట్టాలని రివర్స్ ఎటాక్ చేస్తుంది ధరణి. ఎండీపదవిలో కూర్చోవాలని కలలు కనడం కాదు…ఆ పదవికి తగ్గ అర్హతలు ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలని శైలేంద్రను అవమానిస్తుంది. నీకు అవన్నీ అవనసరం అంటూ ధరణికి వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర. నాకు అవసరమే…మీరు ఇలా రోజుకో గొడవ చేస్తే చూస్తూ ఊరుకోలేనని ధరణి ధీటుగా భర్తకు మాటకు మాట చెబుతుంది. మీరు ఇంత నీచంగా ఉన్నారేంటి? మీకు మనఃసాక్షి అనేది ఉందా? బంధం బంధుత్వాల విలువ తెలుసా…మిమ్మల్ని చూస్తుంటే అసలు మీరు మనిషేనా అనిపిస్తుందని శైలేంద్రను మాటలతో అవమానిస్తుంది ధరణి. భార్య మాటలతో శైలేంద్ర కోపం సర్రున పెరిగిపోతుంది. ధరణిని కొట్టడానికి చెయ్యేత్తుతాడు. కానీ ఫణీంద్రను పిలుస్తుంది ధరణి. తండ్రి పేరు వినగానే శైలేంద్ర వెనక్కి తగ్గుతాడు.
నన్ను పావులా వాడుకున్నారు…
ఇన్నాళ్లు మీరు నా దగ్గర నటించారు. మీ నిజ స్వరూపం బయటపడకూడదనే నాతో ప్రేమగా ఉన్నారు…రిషికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికే నన్ను పావులా వాడుకున్నారని తెలిసిందని శైలేంద్రతో అంటుంది ధరణి. ఇప్పుడు మీలోని రాక్షసుడు బయటపడ్డాడని, మీ గురించి అందరికి తెలిసిందని, మావయ్య ఫణీంద్ర దగ్గర కూడా మీరు వేసుకున్న ముసుగు తొందరలోనే తొలగిపోతుందని భర్తను భయపెడుతుంది ధరణి. భార్య అన్ని మాటలు అంటోన్న తండ్రి అంటే ఉన్న భయం కారణంగా శైలేంద్ర ఆమెను ఏం అనలేకపోతాడు. అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు. అప్పటివరకు శైలేంద్రతో మాట్లాడిన మాటల్ని మొబైల్‌లో రికార్డు చేసిన ధరణి…అవసరమైనప్పుడు శైలేంద్రను బ్లాక్‌మెయిల్ చేయడానికి ఆ వీడియోను వాడుకోవాలని అనుకుంటుంది.
పాత రోజుల్లోకి…
రిషిని తీసుకొని బయటకు వస్తుంది వసుధార. రిషి కనిపించకుండాపోయినప్పుడు తాను పడిన బాధను అతడికి చెబుతుంది. నా కోసం ఓ పని చేస్తారా అని రిషిని అడుగుతుంది వసుధార. ఆమె ఏం అడుగుతుందో రిషి ఎగ్జైటింగ్ అవుతాడు. కానీ నాకు సీట్‌బెల్ట్ పెడతారా అని అడుగుతుంది. దీనికేనా ఇంత బిల్డప్ ఇచ్చావు అంటూ వసుధారతో అంటాడు రిషి. నాకు పాత రోజుల్లోకి వెళ్లాలని ఉందని, మళ్లీ ప్రేమికులుగా మారిపోవాలని అనిపిస్తుందని వసుధార అంటుంది. అందుకే అలా అడిగానని వసుధార అంటుంది. వసుధార కోరిక మేరకు రిషి సీట్‌బెల్ట్ పెట్టాలని అనుకుంటాడు. కానీ తనకు అయిన గాయాల వల్ల లేవలేకపోతాడు.
దొరికిన లెటర్స్…
ఆ తర్వాత కారు డాష్‌బోర్డ్‌లోని లెటర్స్ అనుకోకుండా కిందపడతాయి. శైలేంద్ర దుర్మార్గాలను గురించి రిషికి తెలియజేస్తూ జగతి రాసిన ఉత్తరాలు అవి. కానీ తనకు ఓపిక లేకపోవడంతో ఆ లెటర్స్ తర్వాత చదువుతానని, నీ దగ్గర దాచిపెట్టమని వసుధారతో అంటాడు రిషి.
పెద్దయ్య ఇంటికి శైలేంద్ర..
రిషి అడ్రెస్ ఎలాగైనా కనిపెట్టాలని శైలేంద్ర ఫిక్స్ అవుతాడు. వసుధారను కిడ్నాప్ చేసిన రౌడీ ద్వారా రిషిని కాపాడిన పెద్దయ్య ఇంటి అడ్రెస్ తెలుసుకుంటాడు. ఒకవేళ రిషి గనక పెద్దయ్య ఇంట్లో ఉంటే అతడిని అక్కడే చంపేయాలని కసితో రగిలిపోతాడు శైలేంద్ర. డైరెక్ట్‌గా ఇంట్లోకి వస్తాడు. రిషి కోసం ఇళ్లంతా వెతుకుతాడు. కానీ అతడికి రిషి కనిపించడు.
ప్లాన్ రివర్స్…
శైలేంద్రను చూసిన పెద్దయ్య, పెద్దమ్మ..ఎవరు నువ్వు…ఏం కావాలని అడుగుతారు. తాను రిషి కోసం వచ్చిన విషయం దాచిపెట్టి..వైద్యం చేయించుకోవడానికి వచ్చానని అబద్ధం ఆడుతాడు శైలేంద్ర. నడుమునొప్పి చాలా కాలంగా వేధిస్తుందని చెబుతాడు. శైలేంద్ర అబద్ధం ఆడుతున్నాడని పెద్దయ్య కనిపెడతాడు. అతడితో కషాయం అని చెప్పి బలవంతంగా కాకరకాయ రసం తాగిస్తాడు.
కాకరకాయ రసం తర్వాత రిషి గురించి పెద్దయ్యను అడగాలని శైలేంద్ర ప్రయత్నిస్తాడు. వైద్యం తర్వాతే నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని బలవంతంగా శైలేంద్రపై మంచంపై పడుకోబెడతాడు పెద్దయ్య. కర్ర తీసుకొని శైలేంద్రను తుక్కుతుక్కుగా కొడతాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.