Best Web Hosting Provider In India 2024
Kesineni Nani: టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి అమోదం పొందిన వెంటనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వం చేస్తానని కేశినేని నాని ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు కేశినేని నాని జనవరి 10 బుధవారం మధ్యాహ్నం సిఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు.
ట్రెండింగ్ వార్తలు
కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసిన వెంటనే వైసీపీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నం చేశారు. దీనికి నాని సైతం సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కేశినేని నాని వైసీపీలో చేరితే ఎంపీ టిక్కెట్ మాత్రమే కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని ఇతర అసెంబ్లీ టిక్కెట్లను నానికి కేటాయించే అవకాశాలు ఉండకపోవచ్చని తెలుస్తోంది.
కేశినేని నాని టీడీపీ తరపున వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో తొలిసారి టీడీపీ తరపున గెలిచారు. నాటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్‌ను ఓడించారు. 2019లో పొట్లూరి వరప్రసాాద్‌ను కేశినేని నాని ఓడించారు.
ఇటీవల తిరువూరు బహిరంగ సభ నేపథ్యంలో తలెత్తిన వివాదాలతో నాని టీడీపీకి రాజీనామా చేశారు. ఆ మర్నాడు కేశినేని కుమార్తెను శ్వేత కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. కేశినేని కుమార్తెను మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో విభేదాలు తలెత్తాయి. ఆ తర్వాత ముదిరిపాకాన పడ్డాయి. విజయవాడ టీడీపీలో బుద్దా వెంకన్న, బొండా ఉమా, నాగుల్ మీరా, కేశినేని చిన్ని ఓ వర్గంగా నాని ఒక్కడే ఓ వర్గంగా వ్యవహరించారు. రెండేళ్లుగా పార్టీతో పలు సందర్భాల్లో కేశినేని నాని విభేదించారు.
రెండు విడతలుగా విజయవాడ ఎంపీగా పనిచేసిన నాని పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. పార్టీ మారనున్న నేపథ్యలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న విజయవాడ పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో భారీగా ఓట్లను కేశినేని నాని చీల్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ నెల 11న వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. తనతోపాటు మరో 5 అసెంబ్లీ సీట్లను కేశినేని నాని కోరినట్లు తెలుస్తోంది. విజయవాడ తూర్పు నుండి తన కూతురు కేసినేని శ్వేతకు, విజయవాడ పశ్చిమ నుండి ఎమ్మెస్ బేగ్‌కు అవకాశం కల్పించాలని కోరినట్టు తెలుస్తోంది. నందిగామ నుండి కన్నెగంటి జీవరత్నం, తిరువూరు నుండి నల్లగట్ల స్వామి దాసుకు, మైలవరం నుండి బొమ్మసాని సుబ్బారావుకు టిక్కెట్లు కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కేశినేని నానికి మాత్రమే విజయవాడ పార్లమెంటు టిక్కెట్ భరోసా లభించినట్టు తెలుస్తోంది.
విజయవాడ పార్లమెంటు నియోజక వర్గంలో బీసీ అభ్యర్ధిని వైసీపీ బరిలో దింపుతుందని ఇన్నాళ్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం కేశినేని నాని తెరపైకి రావడంతో విజయవాడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. గత కొన్నేళ్లుగా ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు ఎన్నికవుతుండటంతో ఈసారి దానిని మార్చాలని వైసీపీ భావించింది. కేశినేని చేరికతో ఏమి జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది.