Guppedantha Manasu January 17th Episode: శైలేంద్ర ఓవ‌ర్‌యాక్ష‌న్‌- అన్న‌య్య‌కు షాకిచ్చిన రిషి – వ‌సు ఎండీ సీట్‌కు ఎస‌రు

Best Web Hosting Provider In India 2024

Guppedantha Manasu January 17th Episode: రిషి అడ్రెస్ తెలుసుకోవ‌డానికి కొత్త ఎత్తు వేస్తాడు శైలేంద్ర‌. రిషి చ‌నిపోయిన‌ట్లు డీబీఎస్‌టీ కాలేజీ స్టూడెంట్స్‌, లెక్చ‌ర‌ర్స్‌ను న‌మ్మిస్తాడు. శైలేంద్ర సృష్టించిన పుకార్లు నిజ‌మేన‌ని న‌మ్మిన స్టూడెంట్స్ ఒక‌వేళ రిషి బ‌తికి ఉంటే త‌మ ముందుకు తీసుకురావాల‌ని మ‌హేంద్ర‌కు డెడ్‌లైన్ పెడ‌తారు.

 

ట్రెండింగ్ వార్తలు

రిషి చ‌నిపోయిన‌ట్లు కాలేజీ గ్రూపుల్లో తానే ప్ర‌చారం చేసిన‌ట్లు త‌ల్లి దేవ‌యానితో చెబుతాడు శైలేంద్ర‌. శైలేంద్ర‌తో దేవ‌యాని మాట్లాడుతోండ‌గా ఆమె ద‌గ్గ‌ర‌కు ధ‌ర‌ణి వ‌స్తుంది. రిషి చ‌నిపోయిన‌ట్లుగా వినిపిస్తున్న వార్త‌లు విని కంగారు ప‌డుతుంది.

రిషి చ‌నిపోయిన‌ట్లు వ‌స్తోన్న‌ వార్త‌లు నిజ‌మేకావ‌చ్చున‌ని ధ‌ర‌ణితో అంటుంది దేవ‌యాని. దాంతో దేవ‌యానిపై విరుచుకుప‌డుతుంది ధ‌ర‌ణి. అలాంటి అప‌శ‌కున‌పు మాట‌లు నోటికి ఎలా వ‌స్తాయి దేవ‌యానికి వార్నింగ్ ఇస్తుంది.

రిషిని పెంచి పెద్ద చేసిన మీరే ఇలా మాట్లాడ‌చ్చా అంటూ క్లాస్ ఇస్తుంది. ఎవ‌రో గిట్ట‌ని వాళ్లు ఇలా ఫొటోను పోస్ట్ చేశార‌ని ద‌రిద్ర‌పు వెధ‌వ‌లు…వాడి ఫొటో, వాళ్ల అమ్మ ఫొటో ఇలాగే పెట్టి పిండం పెట్టాలంటూ తిట్ల వ‌ర్షం కురిపిస్తుంది. కోడ‌లి తిట్ల‌ను భ‌రించ‌లేక దేవ‌యాని పారిపోతుంది. మీరే చేశార‌ని నాకు తెలుసున‌ని మ‌న‌సులో అనుకుంటుంది ధ‌ర‌ణి.

శైలేంద్ర నాట‌కం…

రిషి చ‌నిపోయిన‌ట్లు తాను సృష్టించిన పుకార్ల‌ను ఉప‌యోగించి వ‌సుధార‌పై ఫ‌ణీంద్ర‌లో ద్వేషాన్ని పెంచాల‌ని ఫిక్స్ అవుతాడు. వ‌సుధార కాలేజీని అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని చెబుతాడు. అక్క‌డే జ‌గ‌తి ఫొటో ఉండ‌టంతో ఈ టైమ్‌లో పిన్ని ఉంటే బాగుండేద‌ని ఎమోష‌న‌ల్ అవుతున్న‌ట్లుగా నాట‌కం ఆడుతాడు. ఇలాంటి క‌ష్ట‌కాలం వ‌చ్చిన‌ప్పుడే పిన్ని గుర్తుకొస్తుంద‌ని అంటాడు.

 

రిషి క‌నిపించ‌కుండాపోవ‌డం, వ‌సుధార ప‌ట్టించుకోక‌పోవ‌డంతో క‌ళ్ల ముందే కాలేజీ కుప్ప‌కూలిపోతున్న‌ట్లుగా ఉంద‌ని ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తాడు. ఈ కాలేజీకి పేరుప్ర‌ఖ్యాతులు తెచ్చిపెట్టింది రిషి…అత‌డే లేన‌ప్పుడు కాలేజీని న‌డ‌ప‌టం వేస్ట్ అని, కాలేజీని మూసివేద్దామ‌ని చెబుతాడు.

అత‌డిపై మ‌హేంద్ర సీరియ‌ప్ అవుతాడు. నీ డ్రామాలు ఆప‌మ‌ని చెబుతాడు. కాలేజీని మూసేయ‌డ‌మ‌న్న‌ది జ‌ర‌గ‌ద‌ని, స‌మ‌స్య‌కు భ‌య‌ప‌డి పారిపోయే ప్ర‌స‌క్తే లేద‌ని మ‌హేంద్ర కోపంగా చెబుతాడు. స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించాలో ఆలోచించు అంతే కానీ నీకు తోచిన ఐడియాలు ఇవ్వ‌కు అంటూ క్లాస్ పీకుతాడు.

అనుప‌మ‌పై ఫైర్‌…

కాలేజీని మూసేయాలంటూ బ‌య‌టివాళ్లు ఆలోచించిన‌ట్లు ఆలోచించ‌కు అంటూ అనుప‌మ కూడా శైలేంద్ర‌కు గ‌ట్టిగా స‌మాధాన‌మిస్తుంది. నేను కాదు బ‌య‌టివాడిని మీరు అంటూ కోపంగా శైలేంద్ర బ‌దులిస్తాడు. కొడుకుకు ఫ‌ణీంద్ర వార్నింగ్ ఇస్తాడు. అనుప‌మ బ‌య‌టివ్య‌క్తి కాద‌ని…మ‌న కాలేజీ మ‌నిషి అని హెచ్చ‌రిస్తాడు. కాలేజీని మూసేస్తే స్టూడెంట్స్ భ‌విష్య‌త్తు పాడ‌వుతుంద‌ని, వేరే కాలేజీకి వారిని ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం కుద‌ర‌ద‌ని అనుప‌మ అంటుంది.

రామ‌ల‌క్ష్మ‌ణుల్లా ఆద‌ర్శంగా ఉండేవాళ్లం…

కాలేజీని మూసేయ‌డానికి మ‌హేంద్ర అడ్డు చెప్ప‌డంతో మ‌ళ్లీ కొత్త డ్రామా మొద‌లుపెడ‌తాడు. నా త‌మ్ముడు రిషి చ‌నిపోయాడ‌నే మాట‌లునా గుండెల‌ను క‌లిచివేస్తున్నాయ‌ని ఎమోష‌న‌ల్ అవుతాడు శైలేంద్ర‌.

ఈ ప‌రిస్థితి తీసుకొచ్చింద‌ని ఎవ‌రు? రిషి, నేను రామ‌ల‌క్ష్మ‌ణుల్లా ఆద‌ర్శంగా ఉండేవాళ్ల‌మ‌ని, కానీ ఇప్పుడు రిషి క‌నిపించ‌డం లేద‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటాడు. కొడుకు నాట‌కం నిజ‌మ‌ని ఫ‌ణీంద్ర న‌మ్ముతాడు. వ‌సుధార కాలేజీకి వ‌స్తేనే ఈ స‌మ‌స్య‌ల‌కు క్లారిటీ వ‌స్తుంద‌ని అంటాడు.

 

మినిస్ట‌ర్ క్లాస్‌..

కాలేజీకి మినిస్ట‌ర్ వ‌స్తాడు. అత‌డి ముందు కూడా త‌న డ్రామాను కంటిన్యూ చేయాల‌ని చూస్తాడు శైలేంద్ర‌. రిషి చ‌నిపోయిన‌ట్లుగా కాలేజీ గ్రూపుల్లో ఎవ‌రు పోస్ట్ పెట్టారో తెలియ‌డం లేద‌ని, కానీ అంద‌రూ నిజ‌మ‌ని న‌మ్ముతున్నార‌ని అంటాడు. శైలేంద్ర మాట‌ల‌తో మినిస్ట‌ర్ కోప‌గించుకుంటాడు. ఇంకోసారి ఇలా మాట్లాడొద్దు అంటూ హెచ్చ‌రిస్తాడు.

అప్పుడే అక్క‌డికి వ‌సుధార వ‌స్తుంది. వ‌సుధార వ‌చ్చి రావ‌డంతోనే ఆమెకు క్లాస్ ఇస్తాడు మినిస్ట‌ర్‌. నువ్వు ఎండీ సీట్‌లో కూర్చున్న‌ద‌గ్గ‌ర నుంచి అన్ని పొర‌పాట్లే జ‌రుగుతున్నాయ‌ని అంటాడు. నువ్వు కాలేజీకి ఎందుకు రెగ్యుల‌ర్‌గా రావ‌డం లేద‌ని అడుగుతాడు. బోర్డ్ మెంబ‌ర్స్ నీపై కోపంగా ఉన్నార‌ని, క‌నీసం మీ ఇంట్లో వాళ్లు కూడా నీ గురించి స‌మాధానం చెప్ప‌డం లేద‌ని వ‌సుధార‌పై కోప్ప‌డుతాడు మినిస్ట‌ర్‌.

అస‌లు రిషి ఎక్క‌డున్నాడో చెప్ప‌మ‌ని వ‌సుధార‌ను అడుగుతాడు మినిస్ట‌ర్‌. కానీ వ‌సుధార మాత్రం స‌మాధానం చెప్ప‌కుండా మౌనంగా ఉంటుంది. మౌనం స‌మాధానం కాద‌ని మినిస్ట‌ర్‌, రిషి చ‌నిపోయిన‌ట్లు జ‌రుగుతోన్న ప్ర‌చారాన్ని ఆపాలంటే అత‌డు ఎక్క‌డున్నాడో వెంట‌నే తెలియాల‌ని చెబుతాడు.

బోర్డ్ మెంబ‌ర్స్ ప్ర‌శ్న‌లు..

రిషి క్షేమంగా ఉన్నాడ‌ని వ‌సుధార బ‌దులిస్తుంది. మొన్న రిషి త‌ప్పిపోయాడ‌ని అన్నారు. ఇప్పుడేమో క్షేమంగా ఉన్నార‌ని అంటున్నారు. ఏది నిజ‌మ‌ని న‌మ్మాలి అంటూ బోర్డ్ మెంబ‌ర్స్ వ‌సుధార‌ను నిల‌దీస్తారు. ఇలా మాట మారిస్తే వాళ్లంతా నిన్ను ఎలా న‌మ్ముతారు అంటూ శైలేంద్ర కూడా వ‌సుధార‌ను ఇరికిస్తాడు.

 

త‌ను ఏ ఉద్దేశంతో రిషి గురించి బ‌య‌ట‌పెట్ట‌డం లేదో మ‌న ఆలోచించాలి క‌దా అంటూ వ‌సుధార‌కు స‌పోర్ట్ చేస్తాడు మ‌హేంద్ర‌. రిషి బ‌తికే ఉన్నాడ‌ని స్టూడెంట్స్‌ను ఎలా న‌మ్మిస్తాం. ఏ ఆధారం లేకుండా చెబితే వాళ్లు ఎలా న‌మ్ముతారు అని వ‌సుధార‌ను ప్ర‌శ్నిస్తాడు శైలేంద్ర‌. రిషి గురించి మీరు బ‌య‌ట‌పెట్ట‌క‌పోతే మీరు ఎండీ సీట్ నుంచి త‌ప్పుకోవాల్సివ‌స్తుంద‌ని బోర్డ్ మెంబ‌ర్స్ అంటారు.

శైలేంద్ర‌కు షాక్‌…

బోర్డ్ మెంబ‌ర్స్ అడుగుతున్నారు క‌దా రిషి ఎక్క‌డున్నాడో చెప్ప‌మ‌ని శైలేంద్ర అంటాడు. చెబుతాను కానీ మీకు ఓ ఇంపార్టెంట్ మెసేజ్ వ‌చ్చింది అది చూడ‌మ‌ని శైలేంద్ర‌తో అంటుంది వ‌సుధార‌. శైలేంద్ర‌కు వాయిస్ మెసేజ్ పంపిస్తాడు రిషి. కొన్ని అత్య‌వ‌స‌ర ప‌నుల వ‌ల్ల కాలేజీకి రాలేక‌పోతున్నాన‌ని చెబుతాడు.

నాకు ఎదురైన ఇబ్బందుల వ‌ల్ల వ‌సుధార ఈ మ‌ధ్య స‌రిగా కాలేజీకి రాలేక‌పోయింద‌ని, అందులో త‌న త‌ప్పు లేద‌ని, త‌న వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని రిషి చెబుతాడు. ఎండీగా వ‌సుధార ప‌ర్‌ఫెక్ట్ అని త‌న‌పై నాకు ఇప్ప‌టికీ న‌మ్మ‌క‌ముంద‌ని, వ‌సుధార మాత్ర‌మే కాలేజీకి ముందుకు తీసుకెళ్ల‌గ‌ల‌ద‌ని రిషి అంటాడు.

గిట్ట‌ని వాళ్లు…

నేను చ‌నిపోయిన‌ట్లు ఎవ‌రో గిట్ట‌ని వాళ్లు సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టార‌ని, తాను క్షేమంగా ఉన్న‌ట్లు వాయిస్ మెసేజ్‌లో రిషి చెబుతాడు. ఓ సీక్రెట్ ఆప‌రేష‌న్‌లో ఉన్నాన‌ని, తొంద‌ర‌లోనే కాలేజీకి వ‌స్తాన‌ని చెబుతాడు. మినిస్ట‌ర్‌తో పాటు బోర్డ్ మెంబ‌ర్స్ ఈ ఆధారం చాల‌ని చెబుతారు. స్టూడెంట్స్‌కు వినిపిస్తే వాళ్లే సెలైంట్ అవుతార‌ని అంటాడు.

 

కానీ శైలేంద్ర మాత్రం ఇదంతా ఫేక్ అని, టెక్నాల‌జీ ఉప‌యోగించి రిషి వాయిస్‌తో ఇలాంటివి వంద సృష్టించ‌వ‌చ్చ‌ని అంటాడు. వాయిస్ మెసేజ్‌ను బ‌ట్టి రిషి క్షేమంగా ఉన్నాడ‌ని చెప్ప‌లేమ‌ని అనుమానం వ్య‌క్తం చేస్తాడు శైలేంద్ర‌. అత‌డిపై అనుప‌మ‌, మ‌హేంద్ర ఫైర్ అవుతారు.

మినిస్ట‌ర్‌కు ఫోన్‌..

అప్పుడే మినిస్ట‌ర్‌కు రిషి ఫోన్ చేస్తాడు. మిష‌న్ ఎడ్యుకేష‌న్‌కు సంబంధించి మీరు అప్ప‌గించిన ఓ సీక్రెట్ ఆప‌రేష‌న్ ప‌నిలో ఉన్నాన‌ని, కాలేజీలో ప‌రిస్థితుల‌ను మీరే చ‌క్క‌దిద్దాల‌ని మినిస్ట‌ర్‌ను కోరుతాడు రిషి. మినిస్ట‌ర్ అందుకు ఒప్పుకుంటాడు. స్టూడెంట్స్‌కు తాను స‌ర్ధిచెబుతాన‌ని బోర్డ్ మెంబ‌ర్స్‌తో అంటాడు. మినిస్ట‌ర్ మాట్లాడుతోండ‌గా మ‌ధ్య‌లో శైలేంద్ర జోక్యం చేసుకుంటాడు. అత‌డిపై మినిస్ట‌ర్ ఫైర్ అవుతాడు.శైలేంద్ర‌ను నోరుమూసుకోమ‌ని అంటాడు.

మ‌హేంద్ర వార్నింగ్‌..

బోర్డ్ మీటింగ్ ముగిసిన త‌ర్వాత వ‌సుధార బ‌య‌ట‌కు వెళ్ల‌బోతుంది. ఆమెకు అడ్డుగా శైలేంద్ర నిల్చొని ఉంటాడు. అడ్డుత‌ప్పుకోమ‌ని శైలేంద్రతో అంటుంది వ‌సుధార‌. రిషి ఎక్క‌డున్నాడో చెబితేనే అడ్డుత‌ప్పుకుంటాన‌ని వ‌సుధార‌కు బ‌దులిస్తాడు శైలేంద్ర‌. నువ్వు ఎంత ప్ర‌య‌త్నించిన ప్ర‌శ్న‌…ప్ర‌శ్న‌గానే మిగిలిఉంటుంద‌ని వ‌సుధార అంటుంది. రిషి చేస్తోన్న సీక్రెట్ ఆప‌రేష‌న్ ఏమిటో ఇప్పుడు తేలియాల‌ని శైలేంద్ర డిమాండ్ చేస్తాడు.

అప్పుడే అక్క‌డికి ఎంట్రీ ఇచ్చిన మ‌హేంద్ర‌.. నీకెందుకు చెప్పాలిరా అంటూ శైలేంద్ర‌కు గ‌ట్టిగా స‌మాధాన‌మిస్తాడు. రిషి ఎక్క‌డుంటే నీకెందుకు అని అంటాడు. నా కొడుకు గురించి ఆరాలు తీయ‌డానికి నువ్వు ఎవ‌డికి అంటూ వార్నింగ్ ఇస్తాడు. తాను ఈ కాలేజీ బోర్డ్ మెంబ‌ర్‌నేన‌ని మ‌హేంద్ర‌తో అంటాడు శైలేంద్ర‌.

 

నామ‌మాత్రానికే నీ పేరును బోర్డ్ మెంబ‌ర్స్ లిస్ట్‌లో జాయిన్ చేశామ‌ని, నీకు ఈ కాలేజీకి ఏ సంబంధం లేద‌ని శైలేంద్ర గాలి మొత్తం తీసేస్తాడు. రిషి చేస్తోన్న సీక్రెట్ మిష‌న్ ఏదో తెలుసుకొని దానిని చెడ‌గొట్టాల‌ని అనుకుంటున్నావా అంటూ క్లాస్ ఇస్తాడు. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024