Best Web Hosting Provider In India 2024
Siren OTT Streaming: ఇటీవల కాలం ఓటీటీలో హవా తెగ పెరిగిన విషయం తెలిసిందే. 20 నుంచి 30 రోజుల్లో ఓటీటీలోకి సినిమాలను ఓటీటీలోకి వదులుతున్నారు. భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రాలను మాత్రం నెల దాటిన తర్వాతే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. మరికొన్ని సినిమాలు అయితే.. థియేటర్లలో కాకుండా నేరుగానే ఓటీటీలో విడుదల చేస్తున్నారు. అలాంటి వాటిలో స్టార్ హీరో హీరోయిన్లు నటించిన సినిమాలు సైతం ఉంటున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
అలా ఇప్పుడు తాజాగా ఓటీటీలోకి నేరుగా రానున్న సినిమానే సైరన్ (Siren Movie 2023). 2023లో తెరకెక్కిన సైరన్ మూవీలో మహానటి కీర్తి సురేష్, టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తొలిసారిగా కలిసి నటించారు. వీరి ఇద్దరి కలయికలో వస్తోన్న తొలి సినిమా సైరన్. ఇద్దరు టాలీవుడ్ పాపులర్ హీరోయిన్స్ కలిసి నటించిన సినిమాగా సైరన్ విశేషంగా మారింది. వీరిద్దరు మాత్రమే కాకుండా సైరన్ మూవీలో తమిళ స్టార్ హీరో జయం రవి కూడా మరో ప్రధాన పాత్ర పోషించాడు.
ఇలా కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, జయం రవి అగ్ర నటీనటులు నటించిన సినిమా సైరన్ ఇప్పుడు డైరెక్టుగా ఓటీటీలోకి రానుండటంతో భారీగా బజ్ ఏర్పడింది. ఈ ముగ్గురితోపాటు సైరన్ మూవీలో తమిళ పాపులర్ కమెడియన్ యోగిబాబు, నటుడు సముద్రఖని, కౌశిక్ మెహతా, తులసి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక సైరన్ మూవీకి ఆంటోని భాగ్యరాజ్ కథ, దర్శకత్వం వహించారు. సైరన్‌కు సుజాత విజయ్ కుమార్, అనూష విజయ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు.
సైరన్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్, హీరో జీవీ ప్రకాష్ కుమార్ సంగీంత అందించారు. ఎస్‌కే సెల్వ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇలా ప్రముఖ టెక్నిషీయన్స్, నటీనటులతో తెరకెక్కిన సైరన్ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తి చేసుకుంది. రివేంజ్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కిన సైరన్ మూవీని ఎప్పటి నుంచో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, అది వర్కౌట్ కాలేదు. దాంతో ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్.
సైరన్ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 వేదికగా రిలీజ్ చేయనున్నారు. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా సైరన్ మూవీని జీ5లో రిలీజ్ చేయనున్నారని జోరుగా టాక్ నడుస్తోంది. థియేటర్లలో విడుదల కావాల్సిన సినిమా ఇలా నేరుగా ఓటీటీలోకి వస్తుందని తెలియడంతో తమిళ ప్రేక్షకులు ఒకింత షాక్‌కు గురైనట్లు సమాచారం. ఏది ఏమైనా కీర్తి సురేష్, అనుపమ, జయం రవి స్టార్ కాస్ట్ నటించిన సినిమా నేరుగా ఓటీటీలోకి వస్తుందంటే సినీ లవర్స్‌కు పండగే అని చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే ఇటీవల దసరా సినిమాతో హిట్ కొట్టి, భోళా శంకర్ మూవీలో చిరంజీవికి చెల్లెలుగా నటించిన కీర్తి సురేష్ రఘుతాత, రివాల్వర్ రీటా సినిమాలతో పాటు అక్క అనే వెబ్ సిరీస్ చేస్తోంది. అక్క అనే వెబ్ సిరీసుతో హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది కీర్తి సురేష్. ఇందులో కీర్తి సురేష్‌తోపాటు బాలీవుడ్ బోల్డ్ బ్యూటి రాధికా ఆప్టే కూడా నటిస్తోంది. ఇక అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వైర్ మూవీతో రానుంది.