Best Web Hosting Provider In India 2024
Naa Saami Ranga 3 days box office collections: నా సామిరంగ అంటూ సంక్రాంతి బరిలోకి దిగిన కింగ్ నాగార్జున.. చాలా రోజుల తర్వాత మంచి హిట్ అందుకున్నట్లే కనిపిస్తున్నాడు. పక్కా పండగ మూవీగా అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ మూవీ.. మూడు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కు చేరువైనట్లు మేకర్స్ వెల్లడించారు.
ట్రెండింగ్ వార్తలు
నా సామిరంగ మూవీ 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.24.8 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. వీటిని అధికారికంగా సినిమా ప్రొడ్యూసర్లే రివీల్ చేశారు. విజయ్ బిన్నీ డైరెక్ట్ చేసిన ఈ మూవీని శ్రీనివాస చిట్టూరి.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించాడు. భోగి పండుగ అయిన జనవరి 14న ఈ సినిమా రిలీజ్ కాగా.. పండగ మూడు రోజులూ మంచి వసూళ్లు రాబట్టింది.
రీమేక్‌తో వచ్చి హిట్టు కొట్టిన నాగ్
నా సామిరంగ మూవీ మలయాళంలో వచ్చిన పురింజు మరియం జోస్ మూవీకి రీమేక్. దీనిని తెలుగు నేటివిటీకి, అందులోనూ సంక్రాంతి పండగకు తగినట్లుగా మార్పులు చేసుకొని తీశారు. అయితే గుంటూరు కారం, హనుమాన్ మూవీస్ కి ఉన్న హైప్ నేపథ్యంలో నా సామిరంగ హిట్ కొడుతుందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఇప్పుడా సందేహాలను పటాపంచలు చేస్తూ నా సామిరంగ 3 రోజుల్లోనే రూ.24.8 కోట్ల గ్రాస్, రూ.12.46 కోట్ల షేర్ వసూలు చేసింది. అక్కడ ఇక్కడ అని కాదు.. అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ కు చేరువ కావడం మరో విశేషం. సంక్రాంతికి వస్తున్నాం.. బ్లాక్‌బస్టర్ కొడుతున్నాం.. అని ముందే చెప్పిన నాగార్జున.. చెప్పినట్లే మూవీ సూపర్ సక్సెస్ కావడం విశేషం.
తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.9 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన నా సామిరంగ మూవీ.. తర్వత కూడా అదే జోరు కొనసాగిస్తోంది. గుంటూరు కారం నెగటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర బాగానే ఉన్నా.. హనుమాన్ కు క్రమంగా క్రేజ్ పెరుగుతున్నా.. వాటి పోటీని తట్టుకొని కింగ్ నాగార్జున నిలబడ్డాడు. నా సామిరంగంలో కిష్టయ్యగా ఔట్ అండ్ ఔట్ మాస్ రోల్లో నాగార్జున నటించాడు. అతడిపై తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు డైలాగ్స్, హీరోయిజం అభిమానులను ఆకట్టుకుంటోన్నాయి.
అంజిగా అల్లరి నరేష్ నటనకు ప్రశంసలు దక్కుతోన్నాయి. కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో అచ్చమైన సంక్రాంతి మూవీగా దర్శకుడు విజయ్ బిన్నీ నా సామిరంగను తెరకెక్కించాడు. నా సామిరంగంలో అల్లరి నరేష్, రాజ్‌తరుణ్ మరో హీరోలుగా నటించారు. నాగార్జునకు జోడీగా ఆషికా రంగనాథ్ నటించిన ఈ మూవీలో మీర్నామీనన్, రుక్సర్ థిల్లన్ కీలక పాత్రలు పోషించారు.
నా సామిరంగ సినిమా కథ కొత్తదేం కాదు. ఇలాంటి కథలు ఇప్పటికీ చాలానే వచ్చాయి. కానీ, నా సామిరంగ సినిమా 1980 కాలం నేపథ్యంలో జరుగుతుంది. రెండు గ్రామాల మధ్య ఏర్పడిన వైరం, ప్రేమకథ, స్నేహం, అభిమానం వంటి ఎమోషన్లతో కలగలపిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ నా సామిరంగ.