Best Web Hosting Provider In India 2024
Dharani Portal Committee : రాష్ట్రంలో ధరణి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన కమిటీ బుధవారం రెండోసారి భేటీ అయ్యింది. అయితే రెండోసారి భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నెల 11న తొలిసారి ఈ కమిటీ సమావేశమైంది. కోర్టులకు ఎక్కువగా ఎలాంటి సమస్యలు వెళుతున్నాయనే దానిపై కమిటీ సమావేశంలో సభ్యులు చర్చించినట్లు సమాచారం. ధరణి పోర్టల్ ద్వారా రైతులు పడుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై సభ్యులు చర్చలు జరిపారు. దానికి కొనసాగింపుగా కమిటీ ఇవాళ మరోసారి భేటీ అయ్యింది. ప్రధానంగా గ్రామాల్లోని సామాన్య రైతులు ధరణి విషయంలో పడుతున్న ఇబ్బందులు పరిష్కారం చూపడంపై కమిటీ దృష్టి సారించింది. ఎంతకీ తెగని భూముల పంచాయతీ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా త్వరలో కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు చేయనుంది. ధరణి సాఫ్ట్ వేర్ ఏమిటి? ధరణిలో ఇప్పటి వరకు జరిగిన మార్పులు చేర్పులపైన కమిటీ సమగ్రంగా రిపోర్ట్ తెప్పించుకొని ప్రభుత్వానికి పలు కీలక సూచనలు ఇవ్వనుంది.
ట్రెండింగ్ వార్తలు
ఫీల్డ్ విజిట్ ద్వారా ధరణి సమస్యలను తెలుసుకునే దిశగా ప్రభుత్వం?
అవసరమైతే ఫీల్డ్ విజిట్ చేసి సమస్యలను తెలుసుకోవాలని కమిటీ ఆలోచన చేస్తుంది. ధరణిలో ఉన్న సమస్యలపై ఈ కమిటీ త్వరలో ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను అందించనుంది. కాగా ధరణి పోర్టల్ స్థానంలో భూమాతను తీసుకోవాలనుకుంటున్న ప్రభుత్వం…..గత ప్రభుత్వ పరిష్కార మార్గాలను అమలు చేయకపోవడానికి గల కారణాలు అన్వేషించి సమస్యలపై ఇప్పటిదాకా వచ్చిన దరఖాస్తులు ఎన్ని? వాటిలో ఆమోదించినవెన్ని? తిరస్కరించినవెన్ని? ఇంకా పెండింగ్లో ఉన్నవెన్ని? వాటి పరిష్కారానికి మార్గాలు ఏమిటి…. అన్న కోణంలో కమిటీ చర్చించింది. కమిటీ అనుసరించాల్సిన రూట్ మ్యాప్ ను త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎవరెవరు ఏం చేయాలి? విడివిడిగా చేయాలా? కలిసి అధ్యయనం చేయాలా? గ్రౌండ్ రిపోర్ట్ ఎలా? ఎవరితో మీటింగ్స్ పెట్టాలి? ఎవరి సూచన స్వీకరించాలి…..ఈ అన్నీ అంశాలపై నిర్దిష్టమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ధరణి కమిటీ కన్వీనర్ గా భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ ఉన్నారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్, భూ చట్టాల నిపుణుడు సునీల్ విశ్రాంత, స్పెషల్ గ్రేట్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ కమిటీ సభ్యులుగా ఉన్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
టాపిక్