Best Web Hosting Provider In India 2024
Indian 2 OTT: ఇండియన్ మూవీకి సుమారు 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ గా వస్తున్న సినిమా ఇండియన్ 2. ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాదే రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ వివరాలు బయటకు వచ్చాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఇండియన్ 2 రానుంది.
ట్రెండింగ్ వార్తలు
ఇండియన్ 2 స్ట్రీమింగ్ వివరాలను నెట్ఫ్లిక్సే బుధవారం (జనవరి 17) అధికారికంగా వెల్లడించింది. తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ఆ వివరాలను తెలిపింది. “సేనాపతి ప్రతీకారంతో మళ్లీ వస్తున్నాడు. మనం సిద్ధంగా ఉండాలి. ఇండియన్ 2 థియేట్రికల్ రిలీజ్ తర్వాత త్వరలోనే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మీ నెట్ఫ్లిక్స్ లో రానుంది” అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని చెప్పింది.
ఇండియన్ 2 రిలీజ్ ఎప్పుడు?
ఇండియన్ 2 మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కానీ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ సినిమా గ్రాఫిక్స్ పనులు ఇంకా ఉన్నాయి. రానున్న రిపబ్లిక్ డేనాడు మూవీ టీమ్ నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుందని భావిస్తున్నారు. బహుషా ఆరోజే మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. సోనీ మ్యూజిక్ మూవీ ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ తోపాటు ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్ధార్థ్, బ్రహ్మానందం, సముద్రఖని, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఇండియన్ ఫస్ట్ లుక్ పోస్టర్, ఇంట్రో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఎప్పుడూ 27 ఏళ్ల కిందట 1996లో వచ్చిన ఇండియన్ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఇప్పుడు ఇండియన్ 2 మూవీని మరింత భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను చెన్నైతోపాటు లాస్ ఏంజిల్స్, తైవాన్, సౌతాఫ్రికాలలో జరిపారు. ఇంటెన్స్ యాక్షన్ సీన్లతో ఇండియన్ 2 మూవీ ఓ రేంజ్ లో ప్రేక్షకులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది.
భారతీయుడు సినిమాను ఎక్కడ ముగించారో అక్కడి నుంచే ఈ సీక్వెల్ ను మొదలు పెట్టినట్లు ఇండియన్ 2 ఇంట్రో వీడియోలో చూపించారు. దేశం వదిలి వెళ్లి ఎక్కడో విదేశం నుంచి ఇండియాకు కాల్ చేసి.. “ఏ తప్పు జరిగినా మళ్లీ వస్తాను.. ఈ భారతీయుడికి చావే లేదు” అంటూ సేనాపతి మాట్లాడిన మాటలతో భారతీయుడు సినిమా ముగుస్తుంది.
సరిగ్గా అక్కడి నుంచే ఈ భారతీయుడు 2 ఇంట్రో మొదలైంది. ఆ తర్వాత ప్రతి పనికీ లంచాలు తీసుకునే అధికారులను చూపించారు. కమ్ బ్యాక్ ఇండియన్ అంటూ బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ మొదలవుతుంది. ఈ మనషులు ఎవరూ మారలేదు.. నువ్వు మరోసారి రావాల్సిందే అంటూ ఈ పాట సాగిపోతుంది. చివర్లో కమల్ హాసన్ మరోసారి సేనాపతి రూపంలో ఎంట్రీ ఇస్తాడు.