Best Web Hosting Provider In India 2024
OTT Movies 2023 By Ormax: ఓటీటీలో ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు విడుదల అవుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే. వాటిలో కొన్ని థియేటర్ రిలీజ్ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. మరికొన్ని సినిమాలను నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్ చేస్తుంటారు మేకర్స్. అలా గతేడాది అంటే 2023 సంవత్సరంలో ఓటీటీల్లో నేరుగా విడుదలై అత్యధిక వ్యూస్ సాధించిన హిందీ చిత్రాల జాబితాను ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ వెల్లడించింది.
ట్రెండింగ్ వార్తలు
గతేడాది ఓటీటీ టాప్ చిత్రాలు
ఓర్మాక్స్ మీడియా సంస్థ ఇండియాలోని వివిధ రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీసులు, ఇంటర్నేషనల్ షోస్, అంతర్జాతీయ సినిమాలు, హిందీ మూవీస్ జాబితాను ప్రకటిస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే. అలా తాజాగా 2023లో ఇండియాలో స్ట్రీమింగ్ అయిన ఓటీటీ ఒరిజనల్స్ (Streaming Originals In India: The 2023) పేరుతో గతేడాది అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రాలను మంగళవారం అంటే జనవరి 16న విడుదల చేసింది ఓర్మాక్స్ మీడియా సంస్థ.
బావల్‌కు అధిక వ్యూస్
ఓర్మాక్స్ మీడియా విడుదల చేసిన జాబితాలో ఎవరూ ఊహించని విధంగా బాలీవుడ్లో కాంట్రవర్సీగా మారిన బావల్ (Baawal) హిందీ చిత్రం టాప్ ప్లేస్‌లో అర్హత సాధించింది. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ నటించిన ఈ రొమాంటిక్ లవ్ డ్రామా మూవీని 21.2 మిలియిన్ల (2.12 కోట్లు) మంది వీక్షించినట్లు ఓర్మాక్స్ మీడియా తెలిపింది. బావల్ మూవీ 2023 జూలై 21న విడుదలై వివాదాస్పదమైంది. బావల్ మూవీలో అడాల్ఫ్ హిట్లర్, రెండో ప్రపంచ యుద్థ సమయంలో యూరోపియన్ యూదుల మారణ హోమానికి సంబంధించినటువంటి సున్నిత అంశాలను చూపించారు.
ఆ చిత్రాలను పక్కన పెట్టి
దాంతో బావల్ మూవీపై విమర్శలు తలెత్తాయి. ఈ సినిమాకు దంగల్, చిచోరే వంటి పాపులర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన నితేష్ తివారీ దర్శకత్వం వహించారు. అయితే, లస్ట్ స్టోరీస్ 2 (Lust Stories 2), షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ నటించిన ది ఆర్చీస్ (The Archies), మిషన్ మజ్ను వంటి క్రేజ్ తెచ్చుకున్న చిత్రాలను సైతం పక్కన పెట్టి బావల్ అధిక వ్యూస్ తెచ్చుకోవడం హిందీ చిత్రపరిశ్రమలో ఆశ్చర్యంగా ఉంది. బావల్ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
బ్లడీ డాడీ-గుల్మోహర్
ఇక బావల్ తర్వాత రెండో స్థానంలో షాహిద్ కపూర్ యాక్షన్ థ్రిల్లర్ బ్లడీ డాడీ (Bloody Daddy) మూవీ నిలిచింది. దీనికి 17 మిలియన్ వ్యూస్ (1.7 కోట్ల వీక్షణలు) వచ్చాయి. ఈ బ్లడీ డాడీ మూవీ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. అనంతరం మూడో ప్లేసులో పాపులర్ యాక్టర్ మనోజ్ బాజ్ పాయి, షర్మిలా ఠాగూర్ నటించిన ఫ్యామిలీ డ్రామా గుల్మోహర్ మూవీ ఉంది. దానికి 16.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ చిత్రం కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రదర్శితమవుతోంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చిత్రాలు
తర్వాతి వరుసలో మరోసారి డిస్నీ హాట్ స్టార్ మూవీ “తుమ్సే నా హో పాయేగా” ఉంది. ఇష్వక్ సింగ్, మహిమా మక్వానా, గౌరవ్ పాండే, గుర్ప్రీత్ సైని ప్రధాన పాత్రలు పోషించిన ఈ కామెడీ డ్రామా మూవీ 14.3 మిలియన్ వ్యూస్ సాధించుకుంది. ఇక ఐదో స్థానంలో తారా సుతారియా నటించిన సర్వైవల్ థ్రిల్లర్ అపూర్వ ఉంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న అపూర్వ మూవీకి 12.6 మిలియన్ వీక్షణలు వచ్చాయి.
రష్మిక మందన్నా మిషన్ మజ్ను
సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్నా నటించిన స్పై థ్రిల్లర్ మిషన్ మజ్ను చిత్రానికి 10.8 వ్యూస్ వచ్చాయి. ఈ సినిమా నేరుగా గతేడాది నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది. షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, అగస్త్య నంద, శ్రీదేవి చిన్న కూమార్తె ఖుషీ కపూర్ డెబ్యూ ఫిల్మ్ ది ఆర్చీస్ నిలిచింది. నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఆర్చీస్కు 10 మిలియన్ వీక్షణలతో 13వ స్థానంలో నిలిచింది. మరో నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2.. 9.8 మిలియన్ వ్యూస్‌తో 15వ స్థానం సాధించింది.