Best Web Hosting Provider In India 2024
Guppedantha Manasu January 18th Episode: రిషి అడ్రెస్ కనిపెట్టడం కోసం అతడు చనిపోయినట్లుగా పుకార్లు సృష్టిస్తాడు శైలేంద్ర. మినిస్టర్‌తో పాటు బోర్డ్ మెంబర్స్ ముందు వసుధారను ఇరికించి ఆమె ద్వారానే రిషి ఎక్కడున్నాడో నిజం చెప్పించాలని అనుకుంటాడు. కానీ వసుధార …శైలేంద్రకు ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. తాను సేఫ్‌గా ఉన్నట్లు, తొందరలోనే కాలేజీకి వస్తానని రిషి చేత శైలేంద్రకు వాయిస్ మెసేజ్ పంపించి దానిని బోర్డ్ మెంబర్స్‌తో పాటు మినిస్టర్ వినేలా చేస్తుంది. తాను సీక్రెట్ వర్క్‌లో ఉన్నానని మినిస్టర్‌కు చెబుతాడు రిషి.
ట్రెండింగ్ వార్తలు
శైలేంద్రకు అవమానం…
మినిస్టర్‌తో కలిసి రిషి చేస్తోన్న సీక్రెట్ టాస్క్ ఏమిటో తెలుసుకోవాలని శైలేంద్ర ఫిక్స్ అవుతాడు. బోర్డ్ మీటింగ్ ముగిసిన తర్వాత రిషి చేస్తోన్న సీక్రెట్ వర్క్ తనకు తెలియాలని వసుధారను బెదిరిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మహేంద్ర…శైలేంద్రకు వార్నింగ్ ఇస్తాడు.
నీకు ఈ కాలేజీకి సంబంధం లేదని అవమానిస్తాడు. నువ్వు ఇప్పటివరకు చేసిన దుర్మార్గాలు సరిపోలేదా…ఇంకా పాపాలకు ఒడిగడుతున్నావు. ఇప్పుడు రిషి చేస్తోన్న పనేమిటో తెలుసుకొని దానిని నాశనం చేస్తావా అంటూ హెచ్చరిస్తాడు. నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుందని అంటాడు. మహేంద్ర వార్నింగ్‌లకు శైలేంద్ర బెదరడు.
తాటతీస్తానని వార్నింగ్..
మినిస్టర్‌తో కలిసి రిషి చేస్తోన్న సీక్రెట్ ఆపరేషన్ ఏమిటో ఖచ్చితంగా తనకు తెలియాల్సిందేనని పట్టుపడతాడు శైలేంద్ర. ఇది మీ పర్సనల్ వర్క్ కాదు. కాలేజీకి సంబంధిందింది కాబట్టి బోర్డ్ మెంబర్స్ అందరికి తెలియాలి. ఆ పని సరైందని అందరూ అనుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలి.
అంతేకానీ ఎవరికి చెప్పకుండా సీక్రెట్ ఆపరేషన్ అంటూ చెప్పడంలో న్యాయం లేదని మహేంద్రపై ఫైర్ అవుతాడు శైలేంద్ర. న్యాయన్యాయల గురించి నువ్వే మాట్లాడాలి అంటూ శైలేంద్రపై సెటైర్ వేస్తాడు మహేంద్ర.
మీరు నా తండ్రిని మోసం చేస్తున్నారంటూ మహేంద్రను రెచ్చగొడతాడు శైలేంద్ర. మహేంద్రను రెచ్చగొట్టి రిషి చేస్తోన్న వర్క్ ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటాడు శైలేంద్ర. కానీ అతడి ప్లాన్‌ను మహేంద్ర కనిపెడతాడు. ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తాటతీస్తానని శైలేంద్రను హెచ్చరిస్తాడు మహేంద్ర.
ఇక నుంచి నా దగ్గర నీ పప్పులు ఉడకవ్ అంటూ వార్నింగ్ ఇచ్చి వసుధారతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు మహేంద్ర. మీరు నన్ను ఏం చేయలేరని శైలేంద్ర మనసులో అనుకుంటాడు. వసుధార తనకు పదే పదే అడ్డువస్తుందని, తొలుత ఆమె అడ్డు తొలగించుకోవాలని మనసులో నిర్ణయించుకుంటాడు.
వసుధార బావ ఎంట్రీ…
సీన్‌లోకి వసుధార బావ ఎంట్రీ ఇస్తాడు. ఆటలు ఆడుకోవడం నీకే కాదు నాకు వచ్చు అని వసుధార ఫొటో చూస్తూ అంటాడు. ఈ బావను దెబ్బకొట్టి రిషిని పెళ్లి చేసుకుంటే ఎలా అంటూ వసుధారపై ద్వేషంతో రగిలిపోతాడు. నీ అందం, చూపులు, నువ్వు నా మీద చూపించిన ప్రేమ నా మనసును ఓ పట్టాన వదలడం లేదని వసుధార ఫొటో చూస్తూ చెబుతాడు. నీ మెడలో తాళికట్టాల్సిన నేను ఏడాది పాటు ఎవరికి కనిపించకుండా తిరగాల్సివచ్చిందని అంటాడు.
నువ్వు రిషిని పెళ్లిచేసుకోవడం వెరీ బ్యాడ్ అని వసుధార ఫొటో చూస్తూ చెబుతాడు. నాలో లేనిది ఏమిటి? రిషిగాడిలో ఉన్నదేమిటి అని కోపంతో రగిలిపోతాడు. ఈ బావను ఒంటరిచేసి వెళ్లిపోవడం న్యాయంగా ఉందా? నిన్ను పెళ్లి చేసుకోవడమే నా కర్తవ్యం, నిన్ను వదిలిపెట్టేది లేదని వసుధార ఫొటో చూస్తూ డిసైడ్ అవుతాడు. అందుకే నేను మళ్లీ కథలోకి ఎంట్రీ అయ్యానని అంటాడు.
నువ్వు ఎవడి కోసమైతే నన్ను దెబ్బకొట్టావో వాడినే చంపేయబోతున్నానని వసుధార బావ అంటాడు. నీ మెడలో రిషి కట్టిన తాళి తెంపి ఈ తాళి కడతా అని తన దగ్గర ఉన్న తాళిని వసుధార ఫొటోకు చూపిస్తాడు. ఇంతకు ముందు నా ప్లాన్ ఫెయిలైంది. ఈ సారి పక్కా ప్లాన్‌తో వస్తున్నా. నిన్ను నా సొంతం చేసుకుంటా. నువ్వు ఎక్కడ ఉన్నా వదిలే సమస్య లేదని వసుధార బావ అంటాడు.
వసు ఎమోషనల్…
తండ్రికి ఫోన్ చేసి రిషి గురించి అడుగుతుంది వసుధార. మహేంద్ర ఎలా ఉన్నాడని కూతురితో అంటాడు చక్రపాణి. మేము ఇక్కడ ఉన్నామంటే ఉన్నాం…కానీ మా మనసంతా రిషి మీదే ఉందని వసుధార బదులిస్తుంది. రిషి ఎక్కడున్నాడో మహేంద్రకు తెలియదని వసుధార అంటుంది. రిషికి దూరంగా ఉండటం మహేంద్రకు ఇష్టం లేదని, కానీ నీ మాట కాదనలేక వదిలిపెట్టి ఉంటున్నారని కూతురితో అంటాడు చక్రపాణి.
రిషికి దూరంగా ఉంటున్నందుకు ఆయన ఎంతబాధపడుతున్నారో…ఎంత మదనపడుతున్నారో నని చక్రపాణి చెబుతాడు. రిషి ఎక్కడున్నాడో తెలియక మహేంద్ర చిత్రవథ అనుభవిస్తుంటారని, రిషి ఇక్కడ ఉన్న విషయం మహేంద్రకు చెబితేనే మంచిదని కూతురికి సలహా ఇస్తాడు చక్రపాణి. కానీ వసుధార అందుకు ఒప్పుకోదు. రిషి ఎక్కడున్నది మహేంద్రకు చెబితే ఆయన ప్రవర్తన ద్వారా రిషి ఆచూకీని శైలేంద్ర ఈజీగా కనిపెడతాడని తండ్రికి బదులిస్తుంది వసుధార.
అందుకే మహేంద్ర ఎంత బాధపడుతోన్న రిషి ఎక్కడున్నది ఆయనకు చెప్పడం లేదని అంటుంది. రిషి కోలుకున్న తర్వాత డైరెక్ట్‌గా ఆయన్ని మహేంద్ర ముందుకు తీసుకెళతానని తండ్రితో అంటుంది వసుధార. అంతవరకు రిషి ఎక్కడున్నది ఎవరికి తెలియకూడదని, ఈ విషయం మన మధ్యే ఉండాలని చెబుతుంది. కూతురు చెప్పినట్లే చేయాలని చక్రపాణి ఫిక్స్ అవుతాడు.
శైలేంద్ర కుట్రలు…
రిషికి పెద్దయ్య, పెద్దమ్మ కలిసి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని వసుధారతో అంటాడు చక్రపాణి. అయిన వాళ్లు ప్రాణాలు తీయాలని చూస్తే ఏం సంబంధం లేనివాళ్లు అతడి ప్రాణాలను కాపాడుతున్నారని ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత కాలేజీలో తనను ఎండీ పదవి నుంచి తొలగించేందుకు శైలేంద్ర చేసిన కుట్రలను తండ్రికి వివరిస్తుంది వసుధార. శైలేంద్ర విషయంలో జాగ్రత్తగా ఉండమని కూతురిని హెచ్చరిస్తాడు చక్రపాణి. కాలేజీ విషయాలు రిషికి చెప్పొద్దని తండ్రితో అంటుంది వసుధార.
వసు కోసం రిషి ఎదురుచూపులు…
రిషి నిన్ను కలవలాని, చూడాలని తపిస్తున్నాడని వసుధారకు చెబుతాడు చక్రపాణి. కాలేజీలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించిన వెంటనే వస్తానని తండ్రితో అంటుంది వసుధార.
రిషి చక్రపాణి దగ్గరే ఉన్నాడని, అతడే రిషిని ఎక్కడో దాచిపెట్టాడని శైలేంద్ర అనుమానపడతాడు. బోర్డ్ మీటింగ్‌లో రిషి లేడనే పాయింట్‌ను హైలైట్ చేసి మినిస్టర్ ముందు అతడిని ఇరికించాలని అనుకున్నానని, లాస్ట్ మినిట్‌లో రిషి వాయిస్ మెసేజ్ పంపించాడని తల్లి దేవయానితో అంటాడు శైలేంద్ర.
రిషి పంపించిన వాయిస్ మెసేజ్‌ను తల్లికి వినిపిస్తాడు శైలేంద్ర. రిషి ఎక్కడున్నాడో ఎవరికి తెలియకుండా వసుధార మ్యానేజ్ చేస్తుందని, ఆ ప్లేస్ ఏదో ఎంత ఆలోచించిన తెలియడం లేదని శైలేంద్ర ఆవేశానికి లోనవుతాడు. రిషి నువ్వు ఎక్కడున్నావ్…నిన్ను ఎలా కనిపెట్టేది అని అనుకుంటాడు.
రిషి జ్ఞాపకాలు…
అర్ధరాత్రి వరకు కాలేజీ పనులు చేస్తూ ఉంటుంది వసుధార. ఆ పనుల్లో తాము సాయపడుతామని మహేంద్ర, అనుపమ అంటారు. కానీ ఈ పనులు తాను మాత్రమే చేయాల్సినవని వసుధార వారికి ఆన్సర్ ఇస్తుంది. రిషి సలహాతోనే ఇవన్నీ చేస్తున్నానని చెబుతుంది. కానీ రిషి తన పక్కన లేకపోవడం బాధను కలిగిస్తుందని అంటుంది. రిషితో ముడిపడిన తీపిజ్ఞాపకాల్ని గుర్తుచేసుకొని వసుధార ఎమోషనల్ అవుతుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.