Best Web Hosting Provider In India 2024
Sreeleela: 2023లో శ్రీలీల హ్యాట్రిక్ ఫ్లాపులను మూటగట్టుకుంది. ఈ డిజాస్టర్స్ ఎఫెక్ట్ ఆమె కెరీర్‌పై గట్టిగానే పడినట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ఈ పుకార్లపై ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా ఆ ప్రచారం నిజమేనని తెలుస్తోంది. ఐఎమ్‌డీబీ సైట్‌లో వీడీ 12 మూవీలో హీరోయిన్‌గా ఇన్నాళ్లు శ్రీలీల పేరు కనిపించింది. తాజాగా శ్రీలీల స్థానంలో హీరోయిన్‌గా రష్మిక మందన్న పేరు కనిపించడం ఆసక్తికరంగా మారింది. శ్రీలీల స్థానాన్ని రష్మిక మందన్నతో భర్తీ చేసినట్లు తెలుస్తోంది. హ్యాట్రిక్ డిజాస్టర్స్ కారణంగానే శ్రీలీలను ఈ సినిమా నుంచి తీసేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
భగవంత్ కేసరి మినహా…
గత ఏడాది స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవతో పాటు ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు చేసింది శ్రీలీల. ఇందులో భగవంత్ కేసరిలో హీరోయిన్‌గా కాకుండా ఇంపార్టెంట్ రోల్ చేసింది. ఆ సినిమా హిట్టయింది. హీరోయిన్‌గా నటించిన స్కంద, ఆదికేశవతో పాటు ఎక్స్‌ట్రా ఆర్డనరీ మ్యాన్ పరాజయాలుగా నిలిచాయి. ఇటీవల రిలీజైన గుంటూరు కారం కలెక్షన్స్ బాగున్నా శ్రీలీల క్యారెక్టర్‌పై దారుణంగా ట్రోల్స్ వస్తోన్నాయి. ఈ డిజాస్టర్స్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ మూవీ నుంచి శ్రీలీలను తప్పించినట్లు తెలుస్తోంది.
రష్మికతో మూడోసారి…
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గతంలో గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు చేశారు. వీరిద్దరు కలిసి నటిస్తోన్న మూడో మూవీ ఇది కావడం గమనార్హం. ఈ జోడీకి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని వీడీ 12 మూవీలో రష్మికను హీరోయిన్‌గా తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు విజయ్, రష్మిక ప్రేమలోఉన్నట్లు చాలా కాలంగా పుకార్లు షికారు చేస్తోన్నాయి. త్వరలోనే విజయ్, రష్మిక ఎంగేజ్‌మెంట్ జరుగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వీడీ 12 అనిరుధ్ మ్యూజిక్
మళ్లీరావా, జెర్సీ వంటి సినిమాలతో సాఫ్ట్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి తన పంథాకు భిన్నంగా స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో విజయ్ దేవరకొండ మూవీని తెరకెక్కిస్తోన్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తోంది.
ఏప్రిల్ నుంచి షూటింగ్…
బడ్జెట్ ఎక్కువైన కారణంగా విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి మూవీ ఆగిపోయినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పుకార్లను సినిమా యూనిట్ ఖండించింది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ స్టార్‌తో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే గౌతమ్ తిన్ననూరి మూవీ షూటింగ్‌ను విజయ్ దేవరకొండ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. వీడీ 12 మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. షూటింగ్ మొదలుకాకముందే ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి. భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నది. దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.