NTR Family Issues: “తీసిపారేయ్..” జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు తీయించిన బాలయ్య

Best Web Hosting Provider In India 2024

NTR Family Issues: నందమూరి కుటుంబంలో విభేదాలు ఎన్టీఆర్‌ వర్దంతి సందర్భంగా మరోమారు బయట పడ్డాయి. హరికృష్ణ మరణం తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌లతో అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్న బాలకృష్ణ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

ఎన్టీఆర్‌ 28వ వర్ధంతి సందర్భంగా తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌‌లు నెక్లెస్‌రోడ్డులో ఉన్న ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులు అర్పించారు. ఈ క్రమంలో పరిసర ప్రాంతాల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ సోదరులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత నందమూరి బాలకృష్ణ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తండ్రికి నివాళులు అర్పించేందుకు అక్కడకు వచ్చారు. ఈ క్రమంలో ఘాట్‌ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్‌-జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలతో ఏర్ాపటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని అనుచరులకు సూచించారు. తీసేయ్‌ అని చెప్పిన తర్వాత అనుచరుడు మరోమారు ప్రశ్నించడంతో తీసిపారేయాలని ఆగ్రహం వ్యక్తం చేయడం వైరల్‌గా మారింది. ఆ వెంటనే బాలయ్య అనుచరులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు.

రాష్ట్ర విభజన సమయంలో లో నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హరికృష్ణను టీడీపీలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన కుటుంబాన్ని టీడీపీ పూర్తిగా పక్కన పెట్టేసింది. ఆ తర్వాత హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్‌, కొద్ది రోజులకే హరికృష్ణ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు.

హరికృష్ణ బ్రతికున్న రోజుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని భావన జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ సోదరుల్లో ఉంది. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నందమూరి సుహాసిని పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తమను విస్మరించడంపై హరికృష్ణ కుమారులు ఇద్దరు కినుక వహించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గత ఏడాది నందమూరి తారకరత్న మరణించిన సమయంలో మాత్రమే వారు ఒకే చోట కనిపించారు.

స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాములో చంద్రబాబు నాయుడు అరెస్టైన తర్వాత దాదాపు 53రోజులు జైల్లో ఉన్న సమయంలో ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ ఆయన్ని పరామర‌్శించేందుకు రాకపోవడం బాలకృష్ణకు ఆగ్రహం కలిగించినట్టు చెబుతున్నారు. దీంతో పాటు టీడీపీ కష్టాల్లో ఉన్నపుడు వారు పట్టించుకోలేదని బాలకృష్ణ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.

మరోవైపు రాజకీయాలతో తమకు సంబంధం లేదని, తాము పూర్తిగా సినీ పరిశ్రమకే పరిమితం అవుతున్నట్లు పలు సందర్భాల్లో కళ్యాణ్‌ రామ్‌ స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు అరెస్ట్, ఏపీ రాజకీయ వ్యవహారాలపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. వీటన్నింటిని మనసులో పెట్టుకునే బాలకృష్ణ ఎన్టీఆర్ వర్దంతి సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలను తొలగించాలని చెప్పినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంపై ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ స్పందించక పోవడంపై బాలకృష్ణ గతంలో డోండ్‌ కేర్ అని వ్యాఖ్యానించారు. తాజాగా ఫ్లెక్సీలు తీసి పారేయాలని ఆదేశించడం కుటుంబంలో విభేదాలను బయటపెట్టింది. అల్లుడు కోసం బాలకృష్ణ జూనియర్ ఫ్లెక్సీలను తొలగించి ఉంటాడని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించినా జూనియర్ ఎన్టీఆర్‌కు వచ్చే నష్టం ఏమి ఉండదన్నారు.

ఎన్టీఆర్‌ పేరు చెప్పి భజన చేసే కుటుంబ సభ్యులు.. పెద్ద ఎన్టీఆర్‌ను చంద్రబాబు కోసం బలిచేశారని, జూనియర్‌ ఎన్టీఆర్‌‌ను లోకేష్‌ కోసం సర్వనాశనం చేయాలని చూస్తున్నారని, ఎన్టీఆర్‌కు వచ్చే నష్టం ఏమి లేదన్నారు. బాలకృష్ణ, చంద్రబాబు లాంటి వారు వెయ్యి మంది వచ్చినా జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఏమి చేయలేరన్నారు.

WhatsApp channel

టాపిక్

TdpJr NtrAp PoliticsTelugu NewsBreaking Telugu NewsLatest Telugu NewsBalakrishnaChandrababu Naidu
Source / Credits

Best Web Hosting Provider In India 2024