Best Web Hosting Provider In India 2024
Priyamani Bhamakalapam 2 Glimpse: నూరుశాతం తెలుగు ఓటీటీగా పేరొందిన ఆహా ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలతో వినోదాన్ని పంచుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు, వెబ్ సిరీసులు అందించిన ఆహా ఓటీటీ తాజాగా మరో ఒరిజినల్ మూవీతో రానుంది. ఇదివరకు ఆహా ఓటీటీలో భామాకలాపం మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. హీరోయిన్ ప్రియమణి, శరణ్య ప్రదీప్ నటించిన ఈ సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
విజనరీ డైరెక్టర్ అభిమన్యు తాడిమేటి తెరకెక్కించిన భామాకలాపం ఫిబ్రవరి 11న 2022లో విడుదలై అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. నాలుగు మిలియన్స్‌కు పైగా వ్యూయింగ్‌ను సాధించి రికార్డ్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా భామాకలాపం 2 రానుంది. ఇదివరకు భామాకలాపం 2 మూవీ గురించి ప్రకటించిన మేకర్స్ తాజాగా గ్లింప్స్ వీడియో విడుదల చేశారు. భామాకలాపం 2 గ్లింప్స్ ఎంతో ఆకట్టుకునేలా ఉంది.
ప్రియమణి, శరణ్య సస్పెన్స్ డైలాగ్స్‌తో ప్రేక్షకుల్లో భామాకలాపం 2పై మరింత ఆసక్తిని పెంచారు మేకర్స్. ఇందులో ప్రియమణి, శరణ్య ఇద్దరూ ఏదో దొంగతనానికి వెళ్తున్నట్లుగా చూపించారు. చెరో 25 లక్షలు. ఇద్దరికి కలిపి 50 లక్షలు. ఎన్ని ఇడ్లీలు అమ్మితే అంత డబ్బు వస్తుంది అని శరణ్య చెప్పే డైలాగ్ క్యూరియాసిటీ పెంచేలా ఉంది. మనం చేస్తుంది కరెక్టేనా అని ప్రియమణి అడిగితే.. అసలు ఇది మొదలు పెట్టిందే మీరు. మీరు మాములు వైఫా.. డేంజరస్ వైఫ్ అని శరణ్య చెప్పడం హైలెట్‌గా నిలిచింది.
ఇక మొహానికి మంకీ క్యాప్ పెట్టుకుని నడుచుకుంటూ రావడం.. బ్యాక్ గ్రౌండ్ మిస్ అయిందని శరణ్య ప్రదీప్ చెప్పడం నవ్వు తెప్పించేలా ఉంది. దాంతో వెనక్కి వెళ్లి మళ్లీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ఇద్దరూ స్లో మోషన్లో నడుచుకుంటూ వస్తారు. మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. డేంజరస్ వైఫ్ త్వరలో వస్తుంది అంటూ వీడియోను ముగించారు మేకర్స్. ఇలా ఆకట్టుకునేలా ప్రియమణి భామాకలాపం 2 స్నీక్ పీక్ వీడియో బాగుంది.
భామాకలాపం 2లో అనుపమ పాత్రలో ప్రియమణి అమాయక ఇల్లాలుగా మెప్పించనుంది. భామాకలాపం 2 చిత్రాన్ని డ్రీమ్ ఫార్మర్స్, బాపినీడు.బి, సుదీర్ ఈదరతోపాటు ఆహా రూపొందిస్తోంది. అయితే, భామాకలాపం ఓటీటీలో మంచి విజయం సాధించగా.. భామాకలాపం 2 చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయనున్నారు. అంటే ఈసారి ప్రేక్షకులకు థియేటర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించటానికి భామాకలాపం 2తో రానున్నారు.
భామాకలాపం 2 చిత్రంలో సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, అనుజ్ గుర్వార్, బ్రహ్మాజీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. త్వరలోనే భామాకలాపం 2 వంటి సెన్సేషనల్ ఒరిజనల్‌తో థియేటర్స్‌లో సందడి చేయటానికి సిద్ధంగా ఉండండి అని మేకర్స్ తెలిపారు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో ప్రియమణి ఎక్కువగా ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ ఫ్రాంచైజీ, సర్వం శక్తిమయం వంటి సిరీసులు చేసింది. అలాగే ఇటీవలే జవాన్‌లో కీలక పాత్ర పోషించింది.