Best Web Hosting Provider In India 2024
Traffic Restrictions in Vijayawada: విజయవాడలో శుక్రవారం 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనుంది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో రేపు విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. నగరం వెలుపల ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 12 గంటలకు ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర పోలీసులు పేర్కొన్నారు. అనేక చోట్ల వాహనాల మళ్లింపు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ముఖ్య వివరాలను వెల్లడించారు. వాహనదారులు ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
ట్రెండింగ్ వార్తలు
ట్రాఫిక్ మళ్లింపులు….
-హైదరాబాద్-విశాఖ, విశాఖ-హైదరాబాద్ వైపు వాహనాలన్నీ ఇబ్రహీంపట్నం దగ్గర మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదగా దారి మళ్లిస్తారు.
-విజయవాడ నుంచి చెన్నై మరియు చెన్నై నుంచి విశాఖ వైపు భారీ వాహనాల మళ్లింప ఉంటుంది.
-చెన్నై నుంచి వైజాగ్ వెళ్లే వాహనాలను ఒంగోలు దగ్గర డైవర్షన్ చీరాల, బాపట్ల మీదగా మళ్లిస్తారు.
-వైజాగ్ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ దగ్గర దారి మళ్లిస్తారు.
-ఇక విజయవాడ నగరంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇతర వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల మళ్లింపు ఉంటంది.
– ఏడు ప్రాంతాల్లో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు.
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం
Ambedkar Statue: దేశంలో అణగారిన వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వాలు ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. నగరం మధ్య స్వరాజ్య మైదానంగా పిలిచే పిడబ్ల్యుడి గ్రౌండ్స్‌లో ఏపీ ప్రభుత్వం సబ్ ప్లాన్ నిధులతో నిర్మించిన 210 అడుగుల విగ్రహాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు.
అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా దాదాపు లక్షమందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహం నిలువనుంది. 85 అడుగల పీఠంపై నిర్మించిన విగ్రహం మొత్తం 210 అడుగుల ఎత్తున నగరం నలుదిక్కులా కనిపించనుంది. దేశంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహంగా నిలువనుంది.
-అంబేడ్కర్ విగ్రహంతో ఇకపై బెజవాడకు ప్రత్యేక గుర్తింపు లభించ నుంది. ‘సామాజిక న్యాయ మహా శిల్పం’గా అంబేడ్కర్ స్మృతి వనాన్ని సందర్శనీయ స్థలంగా తీర్చిదిద్దారు. భావితరాలకు అంబేడ్కర్ ఆదర్శాలు, ఆలోచనలను అందించే గొప్ప ప్రయత్నమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు.
-ఆంధ్రప్రదేశ్ రాస్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా అంబేడ్కర్ విగ్రహ నిర్మాణాన్ని చేపట్టింది. దీని కోసం 18ఎకరాల ఇరిగేషన్ స్థలాన్ని ఆ శాఖకు బదలాయించారు. స్మృతి వనం నిర్మాణాన్ని AP ఇండస్ట్రీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టారు.
-హైదరాబాద్‌కు చెందిన KPC ప్రాజెక్ట్స్ లిమిటెడ్ విగ్రహ నిర్మాణం చేపట్టింది. నోయిడాలోని డిజైన్ అసోసియేట్స్ డిజైన్లను తయారు చేసింది. రూ.170కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు పూర్తయ్యేసరికి రూ.404.35 కోట్లకు చేరింది.
-విగ్రహ నిర్మాణం జరిగే ప్రదేశం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలని దృష్టిలో ఉంచుకుని, నగరం మధ్యలో ఉన్న స్వరాజ్య మైదానంలో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం చేపట్టారు. సాధారణ ప్రజలు ఉదయం, సాయంత్రం నడిచేందుకు వీలుగా చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు నిర్మించారు.
-85 అడుగుల ఎత్తులో నిర్మించిన రెండంతస్తుల కాంక్రీట్ పీఠంపై 125 అడుగుల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాటాలకు వేదికైన స్వరాజ్య మైదానాన్ని ఇకపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్వరాజ్ మైదాన్‌గా పరిగణిస్తారు.
టాపిక్