Best Web Hosting Provider In India 2024

Neru OTT Release Date: మోహన్ లాల్ నటించిన నేరు మూవీ థియేటర్లలో క్రియేట్ చేసిన సెన్సేషన్ తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. కేరళలో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిందీ కోర్టు రూమ్ డ్రామా. ప్రపంచవ్యాప్తంగా రూ.86 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా జనవరి 23 నుంచి ఓటీటీలోకి రానుంది.
ట్రెండింగ్ వార్తలు
జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో మోహన్ లాల్ నటించిన నేరు మూవీ గతేడాది క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. మలయాళంలో రిలీజైన ఈ సినిమా కేరళలోనే రూ.47 కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా రూ.86 కోట్ల వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాల్లో ఐదో స్థానంలో నిలిచింది.
నేరు.. తెలుగులో లేనట్లే..
నేరు మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఇది బ్యాడ్ న్యూసే. ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్ కావడం లేదు. నేరు మూవీని తెలుగులో వెంకటేశ్ రీమేక్ చేయాలని భావిస్తున్నాడు. దీంతో తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. ప్రస్తుతానికి మలయాళంలో మాత్రమే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. గతంలో జీతూ జోసెఫే డైరెక్ట్ చేసిన దృశ్యం మూవీ రెండు పార్ట్ లనూ తెలుగులో వెంకటేశ్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడీ నేరు మూవీ కూడా వెంకీయే తెలుగులోకి తీసుకురానున్నాడు. మలయాళంలో మోహన్ లాల్ తోపాటు శాంతి, జగదీశ్, గణేష్ కుమార్, నందు, అదితి రవిలాంటి వాళ్లు నటించారు. ఇప్పటికే మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో దృశ్యం, దృశ్యం 2, 12th మ్యాన్, నేరు సినిమాలు రాగా.. ఇప్పుడు రామ్: పార్ట్ 1 కూడా రాబోతోంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.
నేరు స్టోరీ ఏంటి?
మోహన్‌లాల్, జీతు జోసేఫ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ న్యాయం కోసం బలవంతుడితో సామాన్యుడు సాగించే పోరాటం చుట్టూ నడుస్తుంటాయి. నేరు కూడా ఆ కోవకు చెందినసినిమానే. గత సినిమాలకు భిన్నంగా కొత్త బ్యాక్‌డ్రాప్‌లో జీతూ జోసెఫ్ సినిమాను తెరకెక్కించాడు.
కంప్లీట్ కోర్టు రూమ్ డ్రామాగా నేరు మూవీ సాగుతుంది. ఓ నిస్సహాయురాలైన అంధురాలికి జరిగిన అన్యాయంపై పోరాడే ఓ లాయర్ కథతో ఎంగేజింగ్ డ్రామాగా నేరు మూవీని తెరకెక్కించాడు జీతూ జోసెఫ్.
అబద్దాలతో కేసు గెలవాలని ప్రయత్నించే లాయర్ ఓ వైపు…నిజం కోసం పోరాడే లాయర్ మరోవైపు…ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు పై ఎత్తులతో నేరు మూవీ థ్రిల్లింగ్‌ను పంచుతుంది. కోర్టుల్లో సామాన్యుడికి న్యాయం అందుతుందా? న్యాయ వ్యవస్థను డబ్బు, అధికారం ఎలా ప్రభావితం చేస్తున్నాయనే సందేశాన్ని అంతర్లీనంగా నేరు మూవీలో చూపించాడు డైరెక్టర్ జీతూ జోసెఫ్.
మోహన్‌లాల్ కెరీర్లో మూడో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నేరు నిలిచింది. గతంలో పులిమురుగన్, లూసిఫర్ సినిమాలు టాప్‌లో ఉన్నాయి. సాధారణ బడ్జెట్, రిలీజ్‌కు ముందు పెద్దగా హడావిడి లేకుండానే రిలీజైనా నేరు మూవీని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
టాపిక్