Best Web Hosting Provider In India 2024
Bhakshak OTT Streaming: ఓటీటీలో ఎప్పటికప్పుడూ సరికొత్త సినిమాలు, వెబ్ సిరీసులు దర్శనం ఇస్తూనే ఉంటాయి. వారం వారం కొత్త సినిమాలు విడదలవుతూ మూవీ లవర్స్‌ను ఎంటర్టైన్ చేస్తుంటాయి. అయితే, సినీ లవర్స్‌కు జోనర్‌తో పని లేకుండా అన్ని రకాల చిత్రాలను తిలకిస్తారు. కానీ, హారర్, క్రైమ్ థ్రిల్లర్‌తోపాటు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీస్ అంటే ఎక్కువ మంది ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు. అలాంటి వారికోసమే ఓటీటీలోకి నేరుగా సరికొత్త రియల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ రానుంది.
ట్రెండింగ్ వార్తలు
బాలీవుడ్ ముద్దుగుమ్మ భూమి పెడ్నేకర్ మెయిన్ లీడ్ రోల్‌లో నటించిన కొత్త సినిమా భక్షక్. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ జోనర్‌లో తెరకెక్కిన భక్షక్ సినిమాకు పులకిత్ దర్శకత్వం వహించారు. భక్షక్ సినిమాను బాలీవుడ్ బాద్ షో, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్‌మెంట్ పతాకంపై భక్షక్ సినిమాను షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ నిర్మించారు. దీంతో భక్షక్ సినిమాపై హిందీ చిత్ర పరిశ్రమలో మంచి బజ్ క్రియేట్ అయింది.
భక్షక్ మూవీలో భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్ర పోషిస్తుంటే.. ఆదిత్య శ్రీవాస్తవ, సాయి థమకర్, రాజ్‌పాల్ యాదవ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. వీరిలో ఆదిత్య శ్రీవాస్తవ అంటే చాలా మందికి గుర్తుండే ఉంటారు. ఎందుకంటే ఆయన హిందీ టీవీ షోలలో సూపర్ సక్సెస్ అయిన సీఐడీలో కీలక పాత్ర పోషించారు. సీఐడీ సీరియల్‌లో అభిజీత్ పాత్ర చాలా మందికి ఫెవరెట్‌గా ఉంటుంది. ఆ అభిజీత్ పాత్రను చేసింది ఈ ఆదిత్య శ్రీవాస్తవే.
ఈ సీఐడీ సీరియల్ తెలుగులోనూ మంచి విజయం సాధించింది. కాగా చాలా కాలం గ్యాప్ తర్వాత ఆదిత్య శ్రీవాస్తవ భక్షక్ మూవీ ద్వారా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక భక్షక్ మూవీని నేరుగా ఓటీటీలోకి విడుదల చేస్తున్నారు మేకర్స్. తాజాగా భక్షక్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను రివీల్ చేసింది మూవీ టీమ్. ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా భక్షక్ మూవీ విడుదల కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9 నుంచి భక్షక్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
భక్షక్ ఓటీటీ విడుదల తేది ప్రకటిస్తూ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. భక్షక్ ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్ క్రియేట్ చేస్తూ సాగింది. బాలికలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, అఘాయిత్యాల గురించి భక్షక్ సినిమాలో చర్చించనున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. భక్షక్‌లో బ్యూటిఫుల్ భూమి పెడ్నేకర్ పవర్ ఫుల్ జర్నలిస్ట్ వైశాలి పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం సమాజంలో చిన్నారులపై, మహిళలపై జరుగుతున్న నేరాలను ఆమె ఎలా గుర్తించింది, ఎలా వెలుగులోకి తీసుకొచ్చింది వంటి అంశాలతో భక్షక్ కథ ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, భక్షక్ మూవీని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు సమాచారం. దేశంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా చేసుకుని భక్షక్ నిర్మించినట్లు తెలుస్తోంది. భక్షక్‌లో ఊహించని ట్విస్టులు ఉంటాయని బజ్ క్రియేట్ అయింది. మరి ఓటీటీలోకి వచ్చాకా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు మరి ఓటీటీలోకి రిలీజ్ అయ్యాక లుక్కేసి ఎంజాయ్ చేయండి.