NNS January 19th Episode: అరుంధతికి పెద్ద షాక్.. ఇంట్లోంచి మిస్సమ్మ బయటకు.. సీసీటీవీతో దొరకనున్న దొంగ

Best Web Hosting Provider In India 2024

Nindu Noorella Saavasam 19th January Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 19th January Episode) మిస్సమ్మపై దొంగతనం నింద వేసి అమర్​ ఇంట్లో నుంచి పంపించేందుకు ప్లాన్​ చేస్తుంది మనోహరి. అందులో భాగంగానే అమర్​ తల్లిదండ్రుల రూమ్​లో దాచిన డబ్బులను దొంగిలిస్తుంది. దొంగతనం జరిగిన సమయానికి మిస్సమ్మ ఇంట్లో లేకపోవడం, ఫోన్​ కూడా తీసుకుపోకుండా, ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లడాన్ని అవకాశంగా మలుచుకుని అందరి ముందూ మిస్సమ్మనే దొంగతనం చేసిందంటూ మాట్లాడుతుంది మనోహరి.

ట్రెండింగ్ వార్తలు

హంతుకుడికి ఇవ్వాలని

కానీ, అమర్​ కుటుంబ సభ్యులు ఎవరూ మిస్సమ్మ దొంగతనం చేసిందని నమ్మకపోవడంతో తన ప్లాన్​ ఫెయిల్​అవుతుందని కోపం తెచ్చుకుంటుంది మనోహరి. తనని దొంగని చేసి మాట్లాడుతున్న మనోహరిని ఏమనకుండా తాను దొంగతనం చేయలేదని బాధపడుతుంది మిస్సమ్మ. ఎలాగైనా డబ్బుని ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లి అరుంధతిని చంపిన హంతకుడికి ఇవ్వాలని అనుకుంటుంది మనోహరి. నీలని ఎవరైనా ఉన్నారో చూడమని చెబుతుంది. హాల్లో

తిరుగుతూ అనుమానంగా తిరుగుతున్న నీలను గమనిస్తుంది అరుంధతి. అసలు దొంగ నీలనేమో అనుకుని ఆమెను ఫాలో అవుతుంది. మనోహరి, నీల మాటలు విన్న అరుంధతికి నిజం తెలిసిపోతుంది. అసలు దొంగ మనోహరి అని తెలుసుకున్న అరుంధతి పరిగెత్తుకెళ్లి చిత్రగుప్తుడికి చెబుతుంది. మిస్సమ్మకి కూడా చెప్పేస్తానంటూ పరిగెడుతున్న అరుంధతిని హెచ్చరిస్తాడు చిత్రగుప్తుడు. అయినా వినకుండా మిస్సమ్మ దగ్గరికి పరిగెత్తి నిజం చెప్పేందుకు ప్రయత్నిస్తుంది.

మిస్సమ్మను ఆపిన పిల్లలు

కానీ, ఆ మాటలు మిస్సమ్మకు వినిపించవు. అరుంధతి కూడా మిస్సమ్మకు కనపడదు. దాంతో కంగారుగా చిత్రగుప్తుడి దగ్గరకు మళ్లీ పరిగెత్తుకుని వచ్చి అడుగుతుంది అరుంధతి. నీకున్న వరాన్ని దుర్వినియోగం చేస్తే ఫలితం అలాగే ఉంటుందని అంటాడు చిత్రగుప్తుడు. తనపై పడిన నిందకి బాధపడుతూ ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది మిస్సమ్మ. కానీ, పిల్లలు మిస్సమ్మను ఆపి తాను దొంగతనం చేయలేదని అందరికీ తెలుసనీ అంటారు.

కానీ, ఆ నిందతో బయటకు వెళ్లడం కరెక్ట్​ కాదని భాగమతికి పిల్లలు నచ్చజెప్పుతారు. నువ్వు దొంగతనం చేయనప్పుడు ఇంట్లో ఇంకెవరో ఆ డబ్బులు తీసి ఉంటారు కదా. వాళ్లెవరో కనిపెడితే నువ్వు నిర్దోషివని తేలిపోతుంది కదా అంటూ ధైర్యం చెబుతారు. రాథోడ్​ కూడా అమర్​ దగ్గరకు వెళ్లి మిస్సమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు తయారవుతుందని చెబుతాడు. అదేంటని ఆశ్చర్యపోతాడు అమర్​. పిల్లలు చెప్పిన మాటలతో అసలు దొంగ ఎవరా అని ఆలోచనలో పడుతుంది మిస్సమ్మ.

సీసీటీవీలో రికార్డ్

వెంటనే రాథోడ్​ని పిలిచి సీసీటీవీ ఫుటేజ్​ తియ్యమని చెబుతుంది మిస్సమ్మ. అమర్​ కూడా సరే అనడంతో అందరూ కలిసి సీసీటీవీ ఫుటేజ్​ చూస్తారు. దాంట్లో మిస్సమ్మ ఒక్కతే బయటకు వెళ్లడం రికార్డవుతుంది. మిస్సమ్మ చేతిలో ఎలాంటి బ్యాగ్​ లేదని అందరూ గమనిస్తారు.

మరోవైపు తను చేసిన పని బయటపడుతుందని కంగారు పడుతుంది మనోహరి. సీసీటీవీ ఫుటేజ్​తో మనోహరి దొంగ అని బయటపడనుందా? అరుంధతి చేసిన తప్పుతో మిస్సమ్మకు కనపడే అవకాశం కోల్పోయిందా? అనే విషయాలు తెలియాలంటే జనవరి 20న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024