Best Web Hosting Provider In India 2024
Guntur Kaaram First Week Collection: మహేష్ బాబు గుంటూరు కారం ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ను సినిమా యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. వారం రోజుల్లో ఈ మూవీ 212 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టినట్లు పేర్కొన్నది. ఈ మేరకు మహేష్ బాబు కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆల్ టైమ్ రికార్డ్ పేరుతో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. రీజనల్ మూవీస్‌లో వారం రోజుల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీ గుంటూరు కారం అంటూ ఫ్యాన్స్ చెబుతోన్నారు.
ట్రెండింగ్ వార్తలు
యావరేజ్ టాక్‌తోనే బాక్సాఫీస్ వద్ద మహేష్‌బాబు కుమ్మేశాడని ట్వీట్స్ చేస్తున్నారు. సర్కారువారి పాట, సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు కెరీర్లో 200 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన మూడో మూవీగా గుంటూరు కారం నిలిచిందని కామెంట్స్ చేస్తోన్నారు.
ఏడు రోజుల్లో 106 కోట్లు…
ఏడు రోజుల్లో గుంటూరు కారం మూవీ 106 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. గురువారం రోజు వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ ఎనిమిదిన్నర కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 132 కోట్ల వరకు జరిగింది. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో గుంటూరు కారం రిలీజైంది.
బ్రేక్ ఈవెన్‌కు ఇంకో 27 కోట్ల దూరంగా ఈ మూవీ నిలిచింది. ఇప్పటివరకు 74 శాతం వరకు ఈ మూవీ రికవరీ సాధించింది. మహేష్ బాబు ఓన్ థియేటర్ ఏఎంబీలో వరుసగా కోటి రూపాయల కలెక్షన్స్ రాబట్టిన నాలుగో మూవీగా గుంటూరు కారం రికార్డ్ క్రియేట్ చేసినట్లు థియేటర్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌ను సాధించినట్లు సమాచారం.
పోస్టర్‌పై ట్రోల్స్…
గుంటూరు కారం 212 కోట్ల ఆల్‌టైమ్ రికార్డ్ పోస్టర్‌ను కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గుంటూరు కారం మూవీకి చాలా ఏరియాల్లో కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయని, అలాంటప్పుడు రెండు వందల కోట్లు ఎలా వస్తాయని అంటున్నారు. ఫేక్ కలెక్షన్స్ ఇవని కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు గుంటూరు కారం టికెట్ రేట్లను తగ్గించారు. ఫస్ట్ వీక్‌లో టికెట్ ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నారు నిర్మాతలు. గడువు ముగియడంతో శుక్రవారం (నేటి) నుంచి నార్మల్ రేట్స్‌కు ఈ మూవీని స్క్రీనింగ్ అవుతోంది.
అత్తారింటికి దారేది…
గుంటూరు కారం మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. తల్లీకొడుకుల సెంటిమెంట్‌కు యాక్షన్, ఎంటర్టైన్మెంట్ను జోడించి రూపొందించిన గుంటూరు కారం మూవీకి ఫస్ట్ డే నుంచే మిక్స్డ్ టాక్ వస్తోంది. మహేష్ యాక్టింగ్, ఎనర్జీ లెవెల్స్ బాగున్నా త్రివిక్రమ్ కథలో మాత్రం కొత్తదనం మిస్సయిందని కామెంట్స్ చేస్తున్నారు. అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురములో కథల్లో మార్పులు చేస్తూ త్రివిక్రమ్ ఈ మూవీని తెరకెక్కించాడని కామెంట్స్ చేస్తున్నారు.
గుంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ, జయరాం, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది. థియేటర్లలో రిలీజైన నలభై ఐదు రోజుల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గుంటూరు కారం మూవీకి తమన్ సంగీతాన్ని అందించాడు.