Best Web Hosting Provider In India 2024
Animal OTT: బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ యానిమల్ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామా మూవీ రిపబ్లిక్ డే కానుకగా నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు యానిమల్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై నెట్‌ఫ్లిక్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
ట్రెండింగ్ వార్తలు
మరో రెండు, మూడు రోజుల్లో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో యానిమల్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. యానిమల్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దాదాపు వంద కోట్లకు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.
ఓటీటీలో నిడివి ఎక్కువే…
కాగా థియేటర్ వెర్షన్‌తో పోలిస్తే యానిమల్ ఓటీటీ వెర్షన్‌లో చాలా మార్పులు చేసినట్లు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీలో యానిమల్ లెంగ్త్ పెరగనున్నట్లు సమాచారం. థియేటర్ వెర్షన్‌ను మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నిడివితో దర్శకుడు సందీప్ వంగా రిలీజ్ చేశాడు. ఓటీటీలో మాత్రం మూడున్నర గంటల పైనే నిడివితో యానిమల్ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. పది నుంచి పదిహేను నిమిషాల నిడివి పెరగనున్నట్లు తెలిసింది.
ఓటీటీ వెర్షన్‌లో చాలా వరకు రష్మిక మందన్న సీన్స్‌ను యాడ్ చేయబోతున్నట్లు తెలిసింది. రణ్‌బీర్‌కపూర్, రష్మిక మందన్నలపై షూట్ చేసిన రొమాంటిక్ సీన్స్ నిడివి ఎక్కువనే ఆలోచనలో థియేటర్లలో కట్ చేశారు. ఆ సీన్స్ మొత్తం ఓటీటీ వెర్షన్‌కు యాడ్ చేయబోతున్నట్లు తెలిసింది. రణ్‌బీర్, రష్మికల లిప్‌లాక్ సీన్స్ కూడా కలపబోతున్నట్లు సమాచారం. ఈ రొమాంటిక్, ఇంటిమేట్ సీన్స్ ఓటీటీ ఫ్యాన్స్‌ను అలరిస్తాయని ప్రచారం జరుగుతోంది. యానిమల్‌తోనే బాలీవుడ్‌లో రష్మిక మందన్న ఫస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నది.
920 కోట్లు…
యానిమల్ మూవీకి సందీప్ వంగా దర్శకత్వం వహించాడు. తండ్రీకొడుకుల అనుబంధానికి వయోలెన్స్ జోడించి హై ఇంటెన్స్ యాక్షన్ అంశాలతో సందీప్ వంగా యానిమల్ మూవీని తెరకెక్కించిన తీరుకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ 920 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. గత ఏడాది బాలీవుడ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. యానిమల్ మూవీని తెలుగులోకి డబ్ చేయగా 85 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.
యానిమల్ మూవీలో బాబీ డియోల్ విలన్‌గా నటించాడు. ర ణ్‌బీర్‌కపూర్ తండ్రిగా అనిల్ కపూర్ నటించాడు. త్రిప్తి దిమ్రీ కీలక పాత్ర పోషించింది. యానిమల్ మూవీకి అర్జున్ రెడ్డి ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించాడు. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో కలిసి సందీప్ వంగా సోదరుడు ప్రణయ్ వంగా ఈ మూవీని నిర్మించాడు. కబీర్ సింగ్ తర్వాత సందీప్ వంగా దర్శకత్వం వహించిన సినిమా ఇది. యానిమల్ తర్వాత ప్రభాస్‌తో స్పిరిట్ మూవీ చేయబోతున్నాడు సందీప్ వంగా.