Best Web Hosting Provider In India 2024
Sreeleela: యంగ్ హీరోయిన్ శ్రీలీల.. టాలీవుడ్‍లో సెన్సేషన్‍గా మారారు. గత రెండు సంవత్సరాలుగా వరుసగా సినిమాలు చేస్తున్నారు. అందంతో పాటు తన డ్యాన్స్‌తో దుమ్మురేపుతున్నారు తెలుగమ్మాయి శ్రీలీల. దీంతో ఆమెకు మూవీ ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. కొన్ని నెలలుగా శ్రీలీల రోజులో మూడు షిఫ్ట్‌ల్లో షూటింగ్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అయితే, గతేడాది శ్రీలీల నటించిన స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఇటీవల వచ్చిన గుంటూరు కారం మూవీ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే, ఈ తరుణంలో శ్రీలీల ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారని సమాచారం బయటికి వచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
శ్రీలీల ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకొని తన చదువుపై ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. శ్రీలీల ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్నారు. పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంది. అయితే, గుంటూరు కారం చిత్రం కోసం ఆమె కొన్ని పరీక్షలకు కూడా గైర్హాజరయ్యారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకొని.. చదువుపై దృష్టి సారించాలని శ్రీలీల అనుకుంటున్నారని ఓటీటీ ప్లే రిపోర్ట్ వెల్లడించింది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేసేందుకు శ్రీలీల అంగీకరించారు. అయితే, ప్రస్తుతం ఆ ప్రాజెక్టు ఇంకా మొదలుకాలేదు. అలాగే, పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‍లోనూ శ్రీలీల నటించనున్నారు. అయితే, పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ మూవీ షూటింగ్ కూడా నిలిచింది. ఇక, గత నెల రోజులుగా ఇతర ఏ సినిమాలకు శ్రీలీల ఓకే చెప్పలేదు.
దీంతో, సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొని మెడిసిన్ పరీక్షలకు సిద్ధం అవ్వాలని శ్రీలీల నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత కాస్త విశ్రాంతి తీసుకొని మళ్లీ సినిమాలకు ఓకే చెప్పనున్నారు.
ఇప్పటి నుంచి జాగ్రత్తగా..
2023లో శ్రీలీల నటించిన నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. భగవంత్ కేసరి హిట్ అయినా.. తన గత చిత్రాలతో పోలిస్తే విభిన్నమైన పాత్రను ఈ చిత్రంలో శ్రీలీల పోషించారు. ఒకే ఏడాది వెంటవెంటనే మూడు ప్లాఫ్‍లు పడటంతో శ్రీలీలపై విమర్శలు వచ్చాయి. ఆమె కథల సెలెక్షన్ బాగోవడం లేదని, పాత్రకు ప్రాధాన్యత లేకున్నా సినిమాలు చేసేస్తున్నారని ట్రోల్స్ వచ్చాయి. దీంతో బ్రేక్ తర్వాత మరింత జాగ్రత్తగా స్కిప్ట్స్ ఓకే చేయాలని శ్రీలీల అనుకుంటున్నారట. మూవీలో ప్రాధాన్యత ఉంటేనే హీరోయిన్ పాత్ర చేయాలని డిసైడ్ అయ్యారని టాక్.
ఇక ఈ ఏడాది సంక్రాంతికి ఇటీవల రిలీజైన మహేశ్ బాబు మూవీ గుంటూరు కారంలో శ్రీలీల హీరోయిన్‍గా చేశారు. ఈ చిత్రంలో శ్రీలీల డ్యాన్స్ అందరినీ మెప్పించింది. మహేశ్‍తో ఆమె కెమెస్ట్రీ కూడా బాగా కుదిరింది.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప 2: ది రూల్ మూవీలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేయనున్నారని, ఇందుకోసం ఆమె రూ.2కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని ఇటీవల రూమర్లు వచ్చాయి. అయితే, వీటిని శ్రీలీల టీమ్ ఖండించింది. మరి, శ్రీలీల ఎన్ని రోజులు బ్రేక్ తీసుకుంటారో.. తదుపరి ఏ సినిమాలకు ఓకే చెబుతారో చూడాలి.