Aloo Bonda Recipe: ఆలు బోండా ఇలా చేశారంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే

Best Web Hosting Provider In India 2024

Aloo Bonda: ఆలూ బోండా అంటే పిల్లలకు తెగ నచ్చుతుంది. ప్రతిసారి వారికి ఇడ్లీ, దోశె, ఉప్మా లాంటివి పెడితే బోర్ కొట్టేస్తుంది. పది రోజులకు ఒకసారి అయినా ఆలూ బోండా చేసి పెట్టండి. బంగాళదుంపతో చేసిన వంటకాలకు పిల్లలు పెద్ద ఫ్యాన్స్. అలాగే ఆలూ బోండాను కూడా చాలా ఇష్టపడతారు. దీన్ని సులువుగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆలూ బోండా రెసిపీ ఎలాగో చూద్దాం.

 

ట్రెండింగ్ వార్తలు

ఆలూ బోండా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

బంగాళదుంపలు – మూడు

అల్లం – చిన్న ముక్క

వెల్లుల్లి రెబ్బలు – నాలుగు

పచ్చిమిర్చి – మూడు

ధనియాలు – అర స్పూను

ఆవాలు – అర స్పూను

ఉల్లిపాయ – ఒకటి

పసుపు – పావు స్పూను

కారం – అర స్పూను

ఉప్పు – రుచికి సరిపడా

ఇంగువ – చిటికెడు

జీలకర్ర – అర స్పూను

నూనె – తగినంత

కొత్తిమీర తరుగు – ఒక స్పూను

నిమ్మరసం – ఒక స్పూను

శెనగపిండి – ఒక కప్పు

బియ్యప్పిండి – పావు కప్పు

వాము – అర స్పూను

నీళ్లు – తగినన్ని

ఆలూ బోండా రెసిపీ

1. ఒక గిన్నెలో శెనగపిండిని వేసి అందులోనే బియ్యప్పిండి పసుపు, కారం, వాము, రుచికి సరిపడా ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి కలుపుకోవాలి.

2. ఇది మరీ పల్చగా కాకుండా, అలా అని మరీ చిక్కగా కాకుండా చూసుకోవాలి.

3. ఈ మిశ్రమం పై మూత పెట్టి ఒక పక్కన పెట్టాలి.

4. ఇప్పుడు బంగాళదుంపలను ఉడకబెట్టి ఒక గిన్నెలో వేయాలి. వాటిని చేత్తోనే మెత్తగా మెదుపుకోవాలి.

5. మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి బరకగా రుబ్బుకోవాలి.

6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

 

7. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి.

8. మిక్సీలో రుబ్బుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసి వేయించాలి.

9. ఆ తర్వాత నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి.

10. అందులోనే కారం, పసుపు, ఇంగువ వేసి కలుపుకోవాలి.

11. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. చివరగా మెదిపిన ఆలూ ను బంగాళదుంపను వేసి బాగా వేయించుకోవాలి.

12. నిమ్మరసం వేసి, కొత్తిమీర చల్లుకోవాలి. ఈ మొత్తం మిశ్రమం గట్టిగా అయ్యేవరకు వేయించాలి.

13. ఆ తర్వాత దాన్ని ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చాలి. బంగాళదుంప స్టఫింగ్ కోసం రెడీ అయినట్టే.

14. ఇప్పుడు ఈ బంగాళాదుంపలను చేతితోనే చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.

15. స్టవ్ మీద సరిపడా కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి.

16. ఈ బంగాళదుంప ఉండలను ముందుగా చేసుకున్న శెనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయించాలి.

17. అవి బ్రౌన్ రంగులో వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అంతే రుచికరంగా ఆలూ బోండా రెడీ అయినట్టే.

WhatsApp channel
 

టాపిక్

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024