Guppedantha Manasu January 20th Episode: భద్రను నిలదీసిన మహేంద్ర.. వసుధార బావతో శైలేంద్ర గొడవ.. సంతోషంలో దేవయాని

Best Web Hosting Provider In India 2024

Guppedantha Manasu Serial Episode 978: గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషిని చూడకుండా ఉండటం నా వల్ల కాదు. ఎక్కడ ఉన్నాడో చెప్పమ్మ వసుధార అని మహేంద్ర అడుగుతాడు. ఇప్పుడు వద్దు మావయ్య. పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కదా అని వసుధార అంటుంది. ఇంకెన్నాళ్లు అమ్మా. అసలు నా కొడుకు ఏం తప్పు చేశాడు. ఇక ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. శత్రువులకు ఇంకా ఎన్ని భయపడాలి అని మహేంద్ర అంటాడు.

 

ట్రెండింగ్ వార్తలు

చాటుగా భద్ర

మరోవైపు వాళ్ల మాటలను కిటికి పక్కన ఉండి వింటుంటాడు భద్ర. ఇవాళ వసుధార గట్టిగానే బుక్ అయినట్లు తెలుస్తుంది. మహేంద్ర సార్ వదిలేలా లేరు అని భద్ర అనుకుంటాడు. నువ్ రావని అర్థమైంది. నువ్ రాకు. కానీ, రిషి ఎక్కడున్నాడో చెప్పమ్మ అని వసుధారకు దండం పెడతాడు మహేంద్ర. ఇంతలో భద్రకు ఫోన్ వస్తుంది. దాంతో అలర్ట్ అయిన వసుధార కిటికి వైపు వెళ్లి చూస్తుంది. కానీ, అక్కడి నుంచి భద్ర వెళ్లిపోతాడు. ఎవరు లేరు మావయ్య అని వసుధార చెబుతుంది.

చూశావా మహేంద్ర.. మన చుట్టూ ప్రమాదం ఎలా ఉందో. అందుకే వసుధార జాగ్రత్త పడుతుంది అని అనుపమ అంటుంది. మరోవైపు ఏంటీ సార్ మీకు అస్సలు టైమ్ సెన్స్ లేదు. మహేంద్ర వాళ్లు ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుంటుంటే చాటుగా వింటున్నాను. ఇంతలో మీరు కాల్ చేసి చెడగొట్టారు. ప్లాన్ అంతా చెడగొట్టారు అని భద్ర అంటాడు. ఏడిసావ్‌లే అని శైలేంద్ర అంటే.. ఏడవలేదు సార్. మీరే ప్లాన్ చెడగొట్టి నన్ను అంటున్నారు అని భద్ర అంటాడు.

కాల్ చేసి చెడగొట్టారు

ఏంట్రా అంటున్నావ్. ప్యాకేజీ గాడివి నీకెందుకురా అది అని శైలేంద్ర అంటే.. నేను నా పర్సనల్ పని మీద లేను. మీరు చెప్పిన పని మీదే ఉన్నాను. ఇలా ఇంకోసారి ప్యాకేజీ గాడు అని మాటలు అనడం ఆపేయండి అని భద్ర అంటాడు. వసుధార వచ్చిందా అని శైలేంద్ర అడిగితే.. వచ్చింది. ఇక్కడే ఉందని భద్ర చెబుతాడు. ఆ రిషి గాడి గురించి ఏమైనా తెలిసిందా అని శైలేంద్ర అడుగుతాడు. లేదు. వాళ్లు వాడి గురించే మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇంతలో మీరు కాల్ చేసి చెడగొట్టారు అని భద్ర అంటాడు. నువ్ ఏం చేస్తున్నావో నాకు ఎలా తెలుస్తుందిరా అని శైలేంద్ర అంటాడు.

 

సరే నువ్ బాబాయ్‌తోనే ఉండు. రిషి గాడి గురించి తెలియగానే కాల్ చేయు అని శైలేంద్ర అంటాడు. మహేంద్ర సార్‌తో ఉంటే తెలుస్తుందా. అసలే మంచి ఛాన్స్ మిస్ చేసి మహేంద్ర సార్‌తో ఉంటే మాత్రం ఏమొస్తుంది అని భద్ర అంటాడు. రేయ్.. నేను చెప్పింది చేయ్. అంతే అని కోపంగా కాల్ కట్ చేస్తాడు శైలేంద్ర. ఆయన మరీను తేడాగా ఉన్నాడు. మనుషులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు అని భద్ర అనుకుంటూ పక్కకు తిరిగే సరికి అక్కడ వసుధార వాళ్లు ఉంటారు.

కథ చెప్పి కవర్ చేసిన భద్ర

వాళ్లను చూసి షాక్ అవుతాడు భద్ర. ఎవరు ఫోన్‌లో, ఎవరితో మాట్లాడుతున్నావ్ అని నిలదీస్తారు. కానీ, భద్ర సైలెంట్‌గా ఉండటంతో ఫోన్ లాక్కుంటుంది వసుధార. నెంబర్ చూస్తుంది. ఇది శైలేంద్ర నెంబర్ కాదని అనుకుంటుంది. నేను మాట్లాడింది విన్నారా, నాతో చెప్పించాలని చూస్తున్నారా అని ఆలోచిస్తాడు భద్ర. ఏదో మనుషులు అని అంటున్నావ్ అని మహేంద్ర అనడంతో.. వినలేదనుకున్న భద్ర.. లోన్స్, ఇంట్రెస్ట్ అని ఏదో కథ చెబుతాడు.

తర్వాత మీరు ఇలా నన్ను అవమానించడం నాకు నచ్చలేదు. మీరు చెప్పిందే చేస్తున్నాను. మీరు వసుధారకు అడుగడుగునా సెక్యురిటగా ఉండమంటేనే అక్కడికి వెళ్లాను. అంతేగానీ నేను తిన్నింటి వాసాలు లెక్కపెట్టే టైప్ కాదంటూ ఆత్మ, అభిమానం అంటూ పెద్ద ఎమోషనల్ డ్రామా చేస్తాడు. మీరు ఉండమంటే ఉంటాను లేకుంటే ఇప్పుడే వెళ్తాను అని భద్ర అంటాడు. వసుధారను ఆపిన అనుపమ సరే నీ పని చూసుకో అని అనుపమ చెబుతుంది.

 

కరెక్ట్ నెంబరే

దాంతో అక్కడి నుంచి వసుధార వాళ్లు వెళ్లిపోతారు. భద్ర కూడా వెళ్లిపోతాడు. మరోవైపు దేవయానికి ఏదో తెలియని నెంబర్ నుంచి కాల్ రావడం చూసిన శైలేంద్ర పిలుస్తాడు. కానీ, దేవయాని పలకకపోవడంతో లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. మేడమ్ జీ అని వసుధార బావ మాట్లాడుతాడు. ఎవర్రా నువ్. ఇక్కడ మేడమ్ జీలు ఎవరు లేరని శైలేంద్ర ఫైర్ అవుతాడు. ఇద్దరు వాదించుకుంటారు. నేను చేసింది కరెక్ట్ నెంబరే. నువ్ కాదంటున్నావ్. నీ పేరు ఏంట్రా అని వసుధార బావ అడుగుతాడు.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024