Brahmamudi January 20th Episode: కల్యాణ్‌కు ఆఫీస్ బాధ్యతలు? రుద్రాణితో అనామిక ప్లాన్.. కావ్యకు దొరికిపోయిన రాజ్

Best Web Hosting Provider In India 2024

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో శ్వేత ఇంట్లోకి ఎవరో అజ్ఞాతవ్యక్తి వస్తాడు. శ్వేతకు ఇంట్లో నీడలా కనిపిస్తుంది. తర్వాత బెడ్ రూమ్‌లో పడుకుంటే హాల్లో టీవీ ఆన్ అవుతుంది. దాంతో భయంగా గదిలోనుంచి బయటకు వచ్చి టీవీ ఆఫ్ చేస్తుంది. ఓ కర్ర పట్టుకుని డోర్ వైపు భయంగా వెళ్తుంది. డోర్ తీసి కొట్టబోతుంటే.. అక్కడ రాజ్ ఉంటాడు. ఏమైందని రాజ్ అడిగితే.. ఇంట్లో ఎవరో ఉన్నారు రాజ్. చాలా భయంగా ఉంది అని శ్వేత అంటుంది.

 

ట్రెండింగ్ వార్తలు

రిమైండర్ పెట్టుకున్నాను

పద చూద్దాం అని ఇంట్లోకి వచ్చిన రాజ్ ముందు లైట్ ఆన్ చేస్తాడు. తర్వాత నేను మెయిన్ డోర్ లాక్ చేసుకుని బెడ్ రూమ్‌లో పడుకున్నాను. ఇంతలో టీవీ ఆన్ అయింది అని శ్వేత చెబుతుంది. దాంతో టీవీ రిమోట్ ఆన్ చేసి చూస్తాడు రాజ్. అది చూసి ఎవరో ఆన్ చేయలేదు. నువ్వే రిమైండర్ పెట్టుకున్నావ్ అని రాజ్ అంటాడు. అవును రాజ్.. ఇందాక ఏదో సిరీస్ చూస్తూ రిమైండర్ పెట్టుకున్నాను అని శ్వేత అంటుంది. మరోవైపు కావ్యకు రాజ్ సెక్రటరీ కాల్ చేసి సార్ ఉన్నారా అని అడుగుతుంది.

లేరు. ఆఫీస్‌కు వెళ్లారు అని కావ్య చెబుతుంది. నాతో కూడా స్టార్ట్ అవుతున్నట్లు చెప్పారు. కానీ, ఇంతవరకు రాలేదు. కాల్ చేస్తే కట్ చేస్తున్నారు. ఇవాళే డిజైన్స్ కంప్లీట్ చేసి పంపించాలి. రెండు కోట్ల ప్రాజెక్ట్ మేడమ్. అవ్వకుంటే ప్లాబ్లమ్ అవుతుంది. నాకు చాలా టెన్షన్‌గా ఉందని సెక్రటరీ చెబుతుంది. సరే ఆ డిజైన్స్ ఎలా కావాలో నాకు మెయిల్ చేయి నేను రెడీ చేసి పంపిస్తాను అని కావ్య అంటుంది. మేడమ్ అది.. మళ్లీ మీకు చెప్పినట్లు తెలిస్తే సార్ కోప్పడతారు అని సెక్రటరీ అంటుంది.

 

ఫ్లవర్ వాజ్ చూపిస్తూ

ఇప్పుడు నీకు ఏదైనా ఆప్షన్ ఉందా. ముందు ప్రాబ్లమ్ నుంచి బయటపడు. ఎలాగు సార్ తిట్లు నీకు అలవాటే కదా అని కావ్య అంటుంది. సరే మేడమ్ మీకు క్లైంట్‌కు కావాల్సిన రిక్వైర్‌మెంట్స్ మెయిల్ చేస్తాను అని సెక్రటరీ శ్రుతి అంటుంది. మరోవైపు లేదు రాజ్ ఇంట్లో ఎవరున్నారు. నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని కంగారుపడుతుంది శ్వేత. రాజ్ నమ్మకపోవడంతో తీసుకెళ్లి ఫ్లవర్ వాజ్ చూపిస్తూ కింద పడిందని, నేనే పైన పెట్టానని చెబుతుంది.

రాజ్ ఏదో చెప్పబోతుంటే.. గాలికి పడిందంటావా.. సరే ఇటు రా అని కిచెన్‌లోకి తీసుకెళ్తుంది. అక్కడ కింద పడి ఉన్న కత్తిని చూపిస్తూ.. పైన ట్రేలో ఉన్న కత్తి కింద ఎలా పడింది. ఇది కూడా గాలికి పడిందంటావా అని శ్వేత ఆవేదనగా చెబుతుంది. నా చుట్టూ ఏదో జరుగుతుంది రాజ్. నాకు చాలా టెన్షన్‌గా ఉందని శ్వేత భయపడుతుంటే.. రాజ్ చనువుగా ఉంటూ ఓదార్చుతుంటాడు. అలా వాళ్లిద్దరు ఉంటే.. ఇంట్లోకి వచ్చిన వ్యక్తి వాళ్లను వీడియో తీస్తాడు.

డిజైన్స్ చూస్తుంటే

మరోవైపు కావ్యకు కాల్ చేసిన సెక్రటరీ మేడమ్ డిజైన్స్ బాగున్నాయని చెబుతుంది. కానీ, వాటిని డిలీట్ చేయి. అందులో కొన్ని లోపాలు ఉన్నాయి. ఇప్పుడు మరికొన్ని డిజైన్స్ పంపిస్తాను. డిజైన్స్ బాగున్నాయా లేదా అని కాదు. క్లైంట్స్‌కు నచ్చేలా ఉండాలి అని కావ్య అంటుంది. సార్ ఒక్కరే మిస్టర్ పర్ఫెక్ట్ అనుకున్నాను. మీరు మిస్సెస్ పర్ఫెక్ట్ అని సెక్రటరీ చెబుతుంది. కావ్య డిజైన్స్ చూస్తూ ఉంటుంది. ఇంతలో ఫోన్‌కు మేసెజ్ రావడం చూస్తుంది.

 

అందులో రాజ్, శ్వేత ఉన్న ఫొటో చూసి షాక్ అవుతుంది కావ్య. ఇదివరకు రోడ్డు మీద ఐస్ క్రీమ్ తిన్నది గుర్తు చేసుకుని చాలా బాధపడుతుంది కావ్య. రాత్రంతా లైట్ ఆన్, ఆఫ్ చేస్తూ రాజ్‌తో ప్రేమగా ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మరుసటిరోజు ఉదయం కల్యాణ్‌కు కాఫీ ఇస్తుంది అనామిక. నువ్ బావ గారిలా ఆఫీస్‌కు వెళ్లవా అని అనామిక అడుగుతుంది. నేను రోజు వెళ్లను. అన్నయ్యకు ఇంపార్టెంట్ పని ఉందంటే వెళ్తాను అని కల్యాణ్ చెబుతాడు.

ఇంపార్టెంట్ పని ఉంటే తప్పా

మరి రోజు ఏం చేస్తావు అని అనామిక అంటే.. ఇంతలో వచ్చిన రాహుల్.. ఏముంది.. పిచ్చి రాతలు రాస్తూ కూర్చుంటాడు. ఆఫీస్ అంతా రాజ్ చేతుల్లోనే ఉంది. నేను ఆఫీస్‌కు వెళ్తానన్న రానివ్వరు. ఇంపార్టెంట్ పని ఉంటే తప్పా వీడు వెళ్లడు అని చెప్పేసి వెళ్లిపోతాడు రాహుల్. చూశావా అనామిక అందరు నావి పిచ్చిరాతలు అనుకుంటారు. కానీ, నువ్ ఒక్కదానివే వాటిని గుర్తించావ్. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని కల్యాణ్ అంటాడు.

నవ్ ఇలా ఇంట్లో కవిత్వాలు రాసుకుంటూ కూర్చుంటే భార్యగా నాకు ఏం గుర్తింపు ఉంటుంది అని అనామిక ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తున్నావని కల్యాణ్ అడిగితే.. ఏం లేదని చెప్పి వెళ్లిపోతుంది అనామిక. ఇంతలో రుద్రాణి ఎదురుపడుతుంది. నీ బాధేంటో నాకు అర్థం అవుతుంది అనామిక. రాజ్ అలా ఆఫీస్‌లో ఉంటే కల్యాణ్ ఇలా కవితలు రాసుకుంటూ కూర్చుని ఉండటం నచ్చలేదు కదా అని రుద్రాణి అంటే.. అవును ఆంటీ అంటుంది అనామిక.

 

మా అత్తయ్యకు చెప్పండి

నా బాధ అదే కదా. ఇంట్లో రాజ్‌ను రాజకుమారుడిలా చూస్తారు కానీ, రాహుల్, కల్యాణ్‌కు విలువ ఇవ్వట్లేదని రుద్రాణి అంటుంది. మరి అత్తయ్య ఎలా ఊరుకున్నారు అని అనామిక అంటే.. ఆవిడో పిచ్చిది.. నువ్ ఏమనుకున్నా. తనో పిచ్చిది అని రుద్రాణి అంటుంది. మీరు నాకు సాయం చేస్తానంటే నేను అది మారుస్తాను. నేను చెప్పినట్లు వెళ్లి మా అత్తయ్యకు చెప్పండి అని అనామిక ఏదో చెబుతుంది. రాహుల్, కల్యాణ్‌కు విలువ పెరుగుతుందంటే నేను ఎందుకు చేయను అని రుద్రాణి అంటుంది.

చూద్దాం. కొత్త కోడలిగా నువ్వేనా గెలుస్తావేమో అని రుద్రాణి వెళ్లిపోతుంది. నేనే గెలుస్తాను అని అనామిక మనసులో అనుకుంటుంది. తర్వాత హాల్లో అందరికీ కాఫీ ఇస్తుంది కావ్య. ఇంతలో రాజ్ బయటి నుంచి రావడం చూసి ఎక్కడికి వెళ్లావని అడుగుతారు. ఆఫీస్‌కు వెళ్లారు అత్తయ్య. కొత్త కొత్త డిజైన్స్ ట్రై చేయడానికి. రాత్రంతా చాలా కష్టపడ్డారు. ఎక్కడ మిస్ అయిపోతానేమో అని అలారం పెట్టుకుని మరి వెళ్లారు అని రాజ్‌ను అడిగిన అన్ని ప్రశ్నలకు కావ్య సమాధానం చెబుతుంది.

రాజ్‌ను మెచ్చుకుంటున్నారు

అంత కష్టపడటం ఎందుకు నాన్నా అని అపర్ణ అంటే.. మన ఆస్తిని రాజ్ రెట్టింపు చేస్తాడనే నమ్మకం నాకుంది. తనకు బాధ్యతలు అప్పజెప్పినప్పటి నుంచి బాగా చేస్తున్నాడు అని ఇందిరాదేవి మెచ్చుకుంటుంది. రాజ్ నువ్ అలసిపోయినట్టున్నావ్. వెళ్లి రెస్ట్ తీసుకో అని ధాన్యలక్ష్మి అంటుంది. దాంతో రాజ్ వెళ్లిపోతాడు. ఇంటిల్లిపాది రాజ్‌ను అలా మెచ్చుకుంటున్నారు. కల్యాణ్, రాహుల్‌ను ఎప్పుడైనా మెచ్చుకున్నారా అని రుద్రాణి అంటుంది.

 

కంపెనీ కోసం రాజ్ చాలా కష్టపడుతుంటారు కదా అందుకే అని ధాన్యలక్ష్మీ అంటుంది. నీకు నాకు అలా అనిపిస్తే ఒకే. కానీ, అనామికకు ఇప్పటికే ఇంట్లో రాజ్ ఒక్కడికే విలువ ఇస్తున్నారని అనుకుంటుంది. కల్యాణ్‌కు కూడా పగ్గాలు ఇవ్వమని అడుగు. లేకుంటే అనామిక కంపేర్ చేసుకునే అవకాశం ఉంది. తన భర్తకు విలువ ఉండాలని అనుకుంటుంది కదా అని రుద్రాణి అంటుంది. అంతేనంటావా అని ధాన్యలక్ష్మీ అంటుంది. అవును అని రుద్రాణి అంటుంది.

భయపడిపోయిన రాజ్

రాజ్ బెడ్‌పై అలసటగా వాలుతాడు. సెక్రటరీ కాల్ చేస్తే.. అయ్యో… డిజైన్స్ సంగతే మర్చిపోయానే అని టెన్షన్ పడుతుంటాడు. ఇంతలో కావ్వ వచ్చి డిజైన్స్ ఇస్తుంది. ముద్ర వాళ్లకు ఇచ్చే డిజైన్స్ అని చెబుతుంది. నీకు ఎలా తెలుసు అని రాజ్ అంటే.. నాకు అన్ని తెలుసు అని కావ్య అంటుంది. దాంతో భయంతో షాక్ అవుతాడు రాజ్. ఏమైనా అడగాలా అని రాజ్ అనుమానంగా అంటే.. ఏమైనా చెప్పాలా అని కావ్య అంటుంది. లేదని రాజ్ అంటాడు.

చెప్పాల్సింది ఏం లేనప్పుడు. అడగడానికి ఏముంటుంది అని కావ్య చెప్పేసి వెళ్లిపోతుంది. వెళ్తూ ఒక్కసారి రాజ్‌ను కావ్య కోపంగా చూస్తుంది. అది చూసి భయపడిపోతాడు రాజ్. కొంపముంచిందని సెక్రటరీకి కాల్ చేసి కావ్యకు ఆఫీస్‌కు రాలేదని చెప్పావా అని అడుగుతాడు. దాంతో అవును అని సెక్రటరీ అంటుంది. చిచ్చు పెట్టావ్ గా. సరే ముద్ర వాళ్లకు డిజైన్స్ కలెక్ట్ చేసుకోమ్మని చెప్పమని చెబుతాడు. తర్వాత నా గురించి కావ్య ఎలా ఆలోచించి ఉంటుంది. అర్థం చేసుకుందా. అనుమానిస్తుందా అని రాజ్ ఆలోచిస్తుంటాడు.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024