Hanuman Day 8 Collection: హనుమాన్‌కు వంద కోట్ల నెట్ కలెక్షన్స్.. 8వ రోజు వచ్చింది ఇంతే.. లాభాలు ఎంతంటే?

Best Web Hosting Provider In India 2024

Hanuman Day 8 Worldwide Collection: తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం జనవరి 12న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, అమృతా అయ్యర్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. విడుదలైన తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకుపోతోంది హనుమాన్ మూవీ. ఇలా ఇప్పటికీ 8 రోజులు పూర్తి చేసుకుంది హనుమాన్ మూవీ.

 

ట్రెండింగ్ వార్తలు

ప్రముఖ ట్రేడ్ వైబ్‌సైట్ Sacnilk.com ప్రకారం హనుమాన్ మూవీ ఇప్పటివరకు దాదాపు రూ.99 కోట్లు నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు తెలిపింది. దాంతో ఇప్పటివరకు అంటే హనుమాన్‌కు 7 రోజుల్లో రూ. 143.80 కోట్లు ఉన్న గ్రాస్ 8వ రోజుతో మరింత పెరిగే అవకాశం ఉంది. హనుమాన్ మూవీకి 8 రోజుల్లో రూ. 99 కోట్ల షేర్ కలెక్షన్లతో పాటు రూ. 166 కోట్ల గ్రాస్ రానుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేసి చెప్పాయి. మొత్తంగా హనుమాన్ మూవీ రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరడానికి ఇంకా ఒక్క రోజే మిగిలి ఉందని తెలుస్తోంది.

హనుమాన్ మూవీకి బ్రేక్ ఈవెన్ పూర్తి అయి 7 రోజుల్లో రూ. 46.19 కోట్ల లాభాలు రాగా.. 8వ రోజుతో రూ. 55.19 కోట్ల ప్రాఫిట్ వచ్చినట్లు సమాచారం. ఇక హనుమాన్ సినిమాకు తొలి రోజున రూ.8.05 కోట్లు (తెలుగు: రూ.5.89 కోట్లు; హిందీ: రూ.2.1 కోట్లు; తమిళంలో రూ.3 లక్షలు; కన్నడలో రూ.2 లక్షలు; మలయాళం రూ.లక్ష) వచ్చాయి. రెండో రోజున రూ.12.45 కోట్లు, మూడో రోజున రూ.16 కోట్లు, నాలుగో రోజున రూ.15.2 కోట్ల వసూళ్లు వచ్చాయి.

 

అలాగే హనుమాన్ మూవీకి ఐదో రోజున రూ.13.11 కోట్లు, ఆరో రోజున రూ.11.34 కోట్లు, ఏడో రోజున రూ. 9.5 కోట్లు రాగా 8వ రోజున రూ. 9 కోట్లు వచ్చాయి. అంటే రోజు రోజుకీ హనుమాన్ కలెక్షన్స్ తగ్గుతున్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. 7వ రోజు కంటే 8వ రోజున రూ. 50 లక్షల కలెక్షన్స్ తగ్గాయి.

ఇదిలా ఉంటే అంజనాద్రి అనే కాల్పనిక గ్రామంలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ) ప్రారంభమైంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద హనుమంతన్ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. తెలుగులో వచ్చిన ఈ సూపర్ హీరో చిత్రానికి ప్రశాంత్ వర్మే కథ అందించారు. అయితే, సినిమా ప్రమోషన్లలో భాగంగా ఏఎన్ఐతో హీరో తేజ సజ్జా మాట్లాడాడు. సూపర్ హీరో సినిమా చేయాలనే ఆలోచన తనకు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించిందని చెప్పాడు.

హనుమాన్ షూటింగ్ అంతటా ఉత్తేజకరంగా ఉందని తేజ సజ్జా అన్నాడు. ”పిల్లల వినోదం కోసం సూపర్ హీరో యాక్షన్ సీక్వెన్స్ లు, కామెడీ పుష్కలంగా ఉన్న చిత్రమిది. అదే సమయంలో మన చరిత్ర కూడా సూపర్ హీరో ఎలిమెంట్ తో ముడిపడి ఉంది. సూపర్ హీరో కాన్సెప్ట్ తో మన ఇండియన్ ఇతిహాసాన్ని మేళవించే ప్రయత్నం చేశాం కాబట్టి ఇది చాలా ఎంటర్ టైనింగ్ సినిమా” అని తేజ సజ్జ చెప్పుకొచ్చాడు. కాగా హనుమాన్ సినిమాలో హనుమంతుని అనుగ్రహంతో ఓ కుర్రాడు సూపర్ పవర్స్ పొందుతాడు, ఆ తర్వాత తన ప్రజల కోసం, తన మతం కోసం ఎలా పోరాడతాడో చూపించారు.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024