HanuMan 7 Days Collections: కొనసాగుతున్న హనుమాన్ కలెక్షన్ల హవా.. మరో మైలురాయి దాటిన మూవీ

Best Web Hosting Provider In India 2024

HanuMan 7 Days Worldwide Collections: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ (హను-మ్యాన్) సినిమా కలెక్షన్లలో దూసుకెళుతోంది. తక్కువ బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ మూవీ.. భారీ వసూళ్లతో సంచలనం సృష్టిస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ సూపర్ హీరో మూవీకి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో హనుమాన్‍కు కలెక్షన్ల జోరు కొనసాగుతూనే ఉంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. హనుమాన్ సినిమా ఏడు రోజుల కలెక్షన్లపై మూవీ యూనిట్ అప్‍డేట్ ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లో రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఈ విషయాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్ అధికారికంగా ప్రకటించింది. చిన్న మూవీగా వచ్చిన హనుమాన్ వారంలోనే ఈ మైలురాయి దాటడం విశేషంగా ఉంది. అంచనాలకు మించి అన్ని చోట్ల ఈ మూవీకి భారీ కలెక్షన్లు వస్తున్నాయి.

హనుమాన్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటి వరకు సుమారు రూ.65కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. హిందీలో రూ.30కోట్ల మార్కుకు ఈ చిత్రం చేరువైంది. విదేశాల్లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు రూ.37 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇతర భాషల్లోనూ ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ వీకెండ్‍లోనూ హనుమాన్ చిత్రానికి కలెక్షన్ల జోరు మరింత పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. భారత్‍తో పాటు ఓవర్సీస్‍లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది ఈ చిత్రం. ఇప్పటికే మూడు రెట్ల లాభాలు వచ్చినట్టు తెలుస్తోంది.

హనుమాన్ సినిమా కలెక్షన్ల జోరు రెండో వారంలోనూ కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మూవీకి వర్కింగ్ డేల్లో కూడా థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీ ఉంది. మూవీ యూనిట్ చెప్పినట్టు ఈ చిత్రానికి లాంగ్ రన్ కొనసాగే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

నార్త్ అమెరికాలో..

హనుమాన్ సినిమాకు నార్త్ అమెరికాలో భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే అక్కడ ఈ మూవీ 3.5 మిలియన్ డాలర్లను రాబట్టింది. దీంతో టాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ గ్రాసర్ల జాబితాలో ఏకంగా 5వ స్థానానికి వచ్చింది హనుమాన్. నార్త్ అమెరికాలో హైయెస్ట్ టాలీవుడ్ గ్రాసర్లుగా ఈ మూవీ కంటే ముందు బాహుబలి 2 (20.79 మిలియన్ డాలర్లు), ఆర్ఆర్ఆర్ (14.85 మిలియన్ డాలర్లు), సలార్ (8.92 మిలియన్), బాహుబలి-1 (8.49 మిలియన్) మాత్రమే ఉన్నాయి. ఇక్కడ హనుమాన్ వసూళ్ల హోరు కొనసాగే ఛాన్స్ అధికంగా ఉంది. 

హనుమాన్ చిత్రంలో హనుమంతుడిని చూపించిన తీరు, వీఎఫ్ఎక్స్, ఎంటర్‌టైన్‍మెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రశంసలు దక్కుతున్నాయి. హనుమంతుడి మణి వల్ల అతీత శక్తులు పొందే యువకుడిగా తేజ సజ్జా నటన ఈ మూవీలో అదిరిపోయింది. ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్‍గా నటించగా.. వినయ్ రాజ్, వరలక్ష్మి శరత్‍కుమార్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సముద్రఖని కీలకపాత్రలు పోషించారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి.. హనుమాన్ చిత్రాన్ని నిర్మించారు.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024