SCR Additional Halts : ప్రయాణికులకు అలర్ట్… ఏపీ, తెలంగాణలో పలు రైళ్లకు అదనపు హాల్టులు – ఇవాళ్టి నుంచే అమలు

Best Web Hosting Provider In India 2024

South Central Railway Latest News: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని ప్రాంతాల మీదుగా వెళ్లే పలు రైళ్లకు అదనపు హాల్ట్ లు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు జనవరి 19వ తేదీన ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం జనవరి 20వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

 

ట్రెండింగ్ వార్తలు

రైల్వే శాఖ తాజా నిర్ణయంతో హైదరాబాద్ – నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్… జమ్మికుంట స్టేషన్ లో ఆగనుంది. నిజాముద్దీన్‌ – సెంట్రల్ చెన్నై ఎక్స్‌ప్రెస్‌ వరంగల్‌, సెంట్రల్ చెన్నై- ఆహ్మదాబాద్ ఎక్స్ ప్రెస్ పెద్దపల్లి స్టేషన్ లో ఆగుతుందని తెలిపింది. .సికింద్రాబాద్‌-రాయ్‌పూర్‌, సికింద్రాబాద్‌-రాయ్‌పూర్‌ హిస్సార్‌, హైదరాబాద్‌-రాక్సల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పెద్దపల్లి స్టేషన్ లో ఆగుతుంది. సికింద్రాబాద్‌-బీదర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ మర్పల్లి స్టేషన్‌లో ఆగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

ఇవే కాకుండా… నారాయణాద్రి విశాఖ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై సెంట్రల్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లు మిర్యాలగూడలో ఆగనున్నాయి. నాగర్‌సోల్‌-చెన్సై సెంట్రల్‌, గోరఖ్‌పూర్‌-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్‌లో నిలపనుంది. ఈ అదనపు హాల్టుల నిర్ణయం ఆరు నెలల పాటు అమల్లో ఉంటుందని రైల్వే శాఖ వెల్లడించింది.

కింద ఇచ్చిన పీడీఎఫ్ లో పూర్తి వివరాలను చూడొచ్చు…

 

Open PDF in New Window

అయోధ్యకు ప్రత్యేక రైళ్లు….

Ayodhya Special Trains 2024: శ్రీరాముడి జన్మస్థలంలో రామమందిరం ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తుల తాకిడి పెరుగుతుందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది. ఆలయ ప్రతిష్టాపన జరిగాక అయోధ్యకు రద్దీ పెరగనున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది.

 

తెలంగాణలోని సికింద్రాబాద్‌, కాజీపేట రైల్వేస్టేషన్ల నుంచి అయోధ్య స్టేషన్‌కు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్ల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడపనున్నారు. సికింద్రాబాద్‌ – అయోధ్య ప్రత్యేక రైళ్లను జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. విజయవాడ నుంచి బయల్దేరే అయోధ్య రైళ్లు.. ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌ రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

ముఖ్య తేదీలు…

సికింద్రాబాద్‌ – అయోధ్య ప్రత్యేక రైళ్లు జనవరి 29, 31 ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25 తేదీల్లో సాయంత్రం 4.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతాయి. అయోధ్య నుంచి సికింద్రాబాద్‌కు తిరుగుప్రయాణం అవుతాయి. కాజీపేట నుంచి అయోధ్యకు జనవరి 30, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 తేదీల్లో సాయంత్రం 6.20 గంటలకు బయల్దేరుతాయి. ఈ రైళ్లు అయోధ్య నుంచి తిరిగి కాజీపేట వస్తాయి.

 

విజయవాడ నుంచి ఫిబ్రవరి 4న, గుంటూరు నుంచి జనవరి 31న, రాజమహేంద్రవరం నుంచి ఫిబ్రవరి 7న సామర్లకోట నుంచి ఫిబ్రవరి 11న ప్రత్యేక రైళ్లు అయోధ్యకు బయల్దేరుతాయి. తిరుగు ప్రయాణంలో అయోధ్య నుంచి తిరిగి ఆయా స్టేషన్లకు వీటిని నడుపుతారని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

WhatsApp channel
 

టాపిక్

 
 
RailwaySouth Central RailwayHyderabadTelangana NewsAyodhya Pran PratishthaAyodhya Ram MandirShani Trayodashi

Source / Credits

Best Web Hosting Provider In India 2024