Best Web Hosting Provider In India 2024
Hing: సాంబారుకు కమ్మటి వాసన రావాలంటే చిటికెడు ఇంగువ పొడి పడాల్సిందే. పప్పులో కూడా కాస్త ఇంగువను వేసుకుంటే వంటిల్లు ఘుమఘుమలాడిపోతుంది. భారతీయ సంప్రదాయ వంటకాల్లో ఇంగువది ప్రత్యేక స్థానం. ఎప్పుడైనా ఆలోచించారా ఈ ఇంగువ ఎక్కడ పండుతుంది? దీన్ని ఎలా తయారు చేస్తారు అని?
ట్రెండింగ్ వార్తలు
ఇంగువ ఇలా తయారీ
ఇంగువను శాస్త్రీయంగా అసాఫోటిడా అంటారని చెప్పుకున్నాం. పర్షియన్ భాషలో ‘అసా’ అంటే జిగురు, ఫోటిడా అంటే లాటిన్ లో ఘాటైన వాసన అని అర్థం . ఫెరులా అని పిలిచే మొక్క కాండం, వేర్ల నుంచి వచ్చే రసంతో ఈ ఇంగువను తయారు చేస్తారు. ఈ మొక్కలు ఒక రకమైన జిగురు లాంటి పదార్థాలను స్రవిస్తాయి. ఆ జిగురును సేకరిస్తే అవి గట్టిగా రాళ్లల్లా తయారవుతాయి. ఆ రాళ్ళను మెత్తటి చూర్ణంలా మార్చి ఇంగువను తయారు చేస్తారు. ఇంగువను మొదటిసారి 12వ శతాబ్దం చివరిలో సాగు చేసినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. అధికంగా ఇరాన్ ఎడారుల్లో, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ పర్వత ప్రాంతంలో ఉండే ప్రజలు సాగు చేస్తూ ఉంటారు. ఎడారుల వంటి ఎండిపోయిన ప్రాంతాల్లోనే ఈ ఇంగువ మొక్కలు పెరుగుతూ ఉంటాయి.
ఇంగువను ఏమని పిలుస్తారు?
మనం తెలుగులో దీన్ని ఇంగువ అని పిలుస్తాము. అదే హిందీ, గుజరాతి, మరాఠీలలో ‘హింగ్’ అని పిలుస్తారు. పర్షియాలో అంగృష్ట గంధ అంటారు. సంస్కృతంలో బడిక అని, తమిళంలో పెరుంగాయం అని, మలయాళంలో కాయం అని పిలుస్తారు. అలెగ్జాండర్ ద గ్రేట్ కూడా ఇంగువ గొప్పతనాన్ని తెలుసుకొని తనతో పాటు తీసుకువెళ్లాడని అంటారు. దీన్ని వంటల్లోనూ, మందుల్లోనూ వాడే వారిని చెప్పుకుంటారు. ఇప్పటికీ కూడా ఇంగువను వంటల్లోనే కాదు, ఔషధాల తయారీలో కూడా వినియోగిస్తున్నారు.
ఇంగువలో యాంటీబయోటిక్ లక్షణాలు ఎక్కువ. ఇది బ్యాక్టీరియా కారణంగా శరీరంలో ఎలాంటి నష్టం కలగకుండా అడ్డుకుంటుంది. గర్భంతో ఉన్నవారు మాత్రం ఇంగువను తినక పోవడమే మంచిది. ఎందుకంటే దీనిలో గర్భనిరోధక లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అజీర్తి సమస్యలకు ఇది చెక్ పెడుతుంది. ఆహారం కలుషితం కాకుండా అడ్డుకుంటుంది. ఊరగాయల్లో ఇంగువను వేస్తూ ఉంటారు. ఎక్కువ కాలం పాటు పాడవకుండా ఉండేలా ఇంగువ కాపాడుతుంది. కూరలు, సాంబారు, పప్పుల్లో చిటికెడు ఇంగువను వేస్తే ఘుమఘుమలాడిపోవడం ఖాయం. అదే కాశ్మీరీ వంటకాలలో అయితే మటన్ రెసిపీలలో కచ్చితంగా ఇంగువ ఉండాల్సిందే.
ఇంగువ ఉపయోగాలు
పొట్టలో గ్యాస్ చేరడం, మలబద్ధకం, జీర్ణక్రియ సరిగా జరగకపోవడం వంటి సమస్యలకు ఇది చెక్ పెడుతుంది. మజ్జిగలో చిటికెడు ఇంగువను కలిపి తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మొత్తం శుభ్రపడుతుంది. కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇది ఉపయోగపడుతుంది. కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. ధమనుల్లో రక్తపోటు రాకుండా నివారిస్తుంది. కాబట్టి గుండె ఆరోగ్యం పై ఇది సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది.
ఇంగువ మొక్కలు పొదల్లాగా పెరుగుతాయి, వీటి కాండం మాత్రం కాస్త సన్నగా ఉంటుంది. ఆ కాండం, వేర్ల నుండి జిగురు లాంటి ద్రవం ఉత్పత్తి అవుతుంది. దాన్ని అలాగే వదిలేస్తే గట్టిగా మారుతుంది. అలా గట్టిగా మారిన స్పటికాలను సేకరించి ఇంగువను తయారు చేస్తారు.
టాపిక్