AP E-Offices : ఏపీ ప్రజలకు అలర్ట్, ఈ నెల 25 నుంచి 31 వరకు ప్రభుత్వ ఈ-ఆఫీసులు బంద్

Best Web Hosting Provider In India 2024

AP E-Offices : ఏపీలో ఆరు రోజులు పాటు ఈ-ఆఫీస్ లు బంద్ కానున్నారు. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జనవరి 25 నుంచి 31వ తేదీ వరకు ఆరు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ-ఆఫీస్‌లు పని చేయవని సీఎస్ స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి సచివాలయ వరకు అన్ని శాఖలు, శాఖాధిపతులు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాష్ట్ర యూనిట్లు, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోని ఈ-ఆఫీస్‌లను అప్ డేట్ చేస్తున్నారు. ఈ-ఆఫీస్ లను ప్రస్తుత వెర్షన్‌ నుంచి కొత్త వెర్షన్‌కు మార్పు చేస్తున్నారు. దీంతో ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు ఓల్డ్ వెర్షన్‌లోని ఈ-ఆఫీస్‌లు పనిచేయవని సీఎస్ చేసింది.

 

ట్రెండింగ్ వార్తలు

కొత్త వెర్షన్ పై శిక్షణ

ఈ ఆరు రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త వెర్షన్ ఈ-ఆఫీస్ లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అప్పటి వరకు కార్యకలాపాలకు అవాంతరాలు రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సీఎస్ సూచించారు. కొత్త వెర్షన్ పై ఈ నెల 23, 24 తేదీల్లో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల వరకు మాస్టర్ శిక్షకులకు శిక్షణ ఇస్తామని ఐటీ శాఖ వెల్లడించింది. సచివాలయ శాఖలు, ఇతర శాఖాధిపతుల కార్యాలయాల నుంచి మాస్టర్‌ శిక్షణకు సిబ్బందిని పంపాలని ఉన్నతాధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ-ఆఫీసుల కొత్త వెర్షన్ ప్రారంభించిన తర్వాత తిరిగి ప్రకటన చేస్తామన్నారు.

WhatsApp channel
 

టాపిక్

 
Andhra Pradesh NewsGovernment Of Andhra PradeshAp GovtTrending ApTelugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024