VK Naresh: మహేశ్ రాజమౌళి మూవీపై నరేష్ కామెంట్స్.. పదేళ్లు ఉండటమే గొప్ప అంటూ!

Best Web Hosting Provider In India 2024

VK Naresh Completes 50 Years Cine Journey: టాలీవుడ్ పాపులర్ నటుడు, సీనియర్ హీరో వీకే నరేష్ తాజాగా 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం, మహేశ్ బాబు, రాజమౌళి సినిమాకు తదితర విషయాలు, అనుభవాలను పంచుకున్నారు. “నటుడిగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 50 ఏళ్లు సినీ ప్రయాణం పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇదంతా ప్రేక్షకులు ప్రేమాభిమానాలు వల్లే సాధ్యమౌతోంది. నా జీవితాంతకాలం సినీ పరిశ్రమకు సేవ చేస్తాను” అని నరేష్ అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు

ఈ గోల్డెన్ జూబ్లీ జర్నీ ఎలా అనిపిస్తోంది ?

“ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసిందల్లా కృష్ణ గారు, అమ్మ విజయనిర్మల గారి మేకప్ రూమ్, పొద్దున్నే మద్రాస్‌లో వచ్చి కలిసే ప్రజలు, స్టూడియో వాతావణం.. ఇలా వీటి చుట్టూనే పెరిగాను. ఇదే నా జీవితం కావాలని కోరుకున్నాను. 9వ ఏటా ‘పండంటి కాపురం’ లాంటి అద్భుతమైన చిత్రంతో ఆరంగేట్రం చేశాను. అయితే బాల నటులుగా వచ్చిన వాళ్లు హీరోలుగా సక్సెస్ కారని చెబుతుంటారు. ఈ భయం ఉండేది. అయితే దాని గురించి పెద్దగా అలోచించలేదు” అని వీకే నరేష్ తెలిపారు.

అదృష్టం దొరికింది

“ఒక్క సినిమా హీరోగా నటిస్తే చాలని అనుకున్నాను. అనుకోకుండా.. అమ్మగారి ప్రేమ సంకెళ్లు, జంధ్యాల గారి నాలుగు నాలుగు స్తంభాలాట. ఇలా రెండు సినిమాలు వచ్చాయి. నాలుగు స్తంభాలాటతో నాకు అద్భుతమైన కెరీర్ స్టార్ట్ అయ్యింది. నా ఫస్ట్ ఇన్నింగ్స్ లో జంధ్యాల గారు, అమ్మ(విజయనిర్మల), విశ్వనాథ్ గారు, బాపు గారు, రమణ గారు, ఈవీవీ సత్యనారాయణ గారు, వంశీ గారు, రేలంగి నరసింహరావు గారు,.. ఇలాంటి మహనీయులతో కలసి పని చేసే అదృష్టం దొరికింది. వీరందరూ నా విజయానికి పునాది వేశారు. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని నరేష్ చెప్పారు.

 

నిరాశతోనే ఎండ్ అయింది

“ఒక మంచి యాక్టర్ కావాలని పరిశ్రమలోకి వచ్చాను. ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్తదనం ప్రయత్నించాను. ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేశాను. అయితే రాజీపడి సినిమాలు చేయడం నాకు ఇష్టం లేదు. అద్భుతమైన విజయాలు వచ్చినప్పటికీ నేను అనుకున్న సినిమాలు చేయలేకపోతున్నాననే ఒక చిన్న నిరాశతోనే తొలి ఇన్నింగ్స్ ఎండ్ అయ్యింది. నేను రీల్, రియల్ లైఫ్ లో కొంచెం అడ్వెంచరస్ పర్సన్‌ని. రిస్కులు తీసుకుంటాను. నా మనసుకి నచ్చింది చేస్తాను. కొంత కాలం రాజకీయాల్లో పని చేశాను. తర్వాత సోషల్ సర్విస్ లోకి వచ్చాను”.

వైవిధ్యమైన పాత్రలు

“ఈ క్రమంలో దాదాపు పదేళ్ల పాటు పరిశ్రమకి దూరమయ్యాను. సెకండ్ ఇన్నింగ్స్ పలు వైవిధ్యమైన పాత్రలు వచ్చినపుడు నటుడు ఎస్వీ రంగారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని చేశాను. పరిశ్రమలో ఓర్పు, క్రమ శిక్షణ చాలా అవసరం. ఇవి మా అమ్మగారి నుంచి నేర్చుకున్నాను. సెకండ్ ఇన్నింగ్స్‌లో మీ శ్రేయోభిలాషి , గుంటూరు టాకీస్. అ ఆ, దృశ్యం చిత్రాలలో వివిధ్యమైన పాత్రలు రావడంతో నాకు పరిశ్రమలో కొత్త మెరుగు వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త, వైవిధ్యమైన రావడం అనందంగా ఉంది. ఈ సందర్భంగా దర్శక, రచయితలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను”

 

పూర్వజన్మ సుకృతం

“ఒక నటుడు పదేళ్లు ఉండటమే గొప్ప. ఇంతమందికి ధన్యవాదాలు చెబుతూ 50 ఏళ్లు గడపడం ఆనందంగా ఉంది. గతేడాది సామజవరగమన నాకు చాలా మంచి బూస్ట్ ఇచ్చింది. లీడ్ రోల్ లో చేసిన మళ్లీ పెళ్లి తో పాటు ఓటీటీలో చేసిన ఇంటింటి రామాయణం, మాయాబజార్ మంచి విజయాలు సాధించాయి. ఇన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకొని విజయవంతంగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను”.

అరుదైన గౌరవం

ఒక నటుడిగా ఎలాంటి పాత్రలు చేయాలని అనుకున్నానో దానికి మించిన పాత్రలు వస్తున్నాయి. కోవిడ్ తర్వాత పెద్ద మార్పు వచ్చింది. తరం మారుతోంది. నేను అన్ని తరాలతో కలసి రావడం అనేది నా అదృష్టం. ఈ 50వ ఏట నాకు చాలా అరుదైన గౌరవాలు వచ్చాయి. యునైటెడ్ నేషన్స్ ‘సర్’ నైట్ వుడ్ తో సత్కరించడం ఒక అరుదైన గౌరవం. ఇన్ని విజయాలతో పాటు ఇన్ని గౌరవాలు దక్కడం ఒక నటుడికి అరుదుగా జరుగుతుంది. ఇదంతా ప్రేక్షకులు ప్రేమామాభిమానాల వలనే సాధ్యపడింది”.

మహేశ్ బాబు, రాజమౌళి గారి సినిమా గురించి?

మహేశ్‌కు మాస్, క్లాస్.. అన్ని వర్గాల్లో అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాజమౌళి గారు ప్రపంచానికి ఇండియన్ సినిమాని పరిచయం చేసిన ఐకాన్. వాళ్ల ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా తెలుగు సినీ పరిశ్రమని నెక్ట్స్ లెవల్‌కి తీసుకువెళుతుందని నమ్ముతున్నాను.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024