Best Web Hosting Provider In India 2024
Yash Puri Happy Ending: యష్ పూరి హీరోగా నటించిన కొత్త సినిమా హ్యాపీ ఎండింగ్. ఈ మూవీలో అపూర్వ రావ్ హీరోయిన్‌గా నటించింది. హ్యాపీ ఎండింగ్ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హ్యాపీ ఎండింగ్ మూవీకి కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. హ్యాపీ ఎండింగ్ సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ట్రెండింగ్ వార్తలు
హ్యపీ ఎండింగ్ ట్రైలర్‌ను శనివారం డైరెక్టర్ వేణు ఊడుగుల చేతుల మీదుగా రిలీజ్ చేశారు. హ్యాపీ ఎండింగ్ ట్రైలర్ ఆద్యంతం నవ్విస్తూ ఆకట్టుకునేలా ఉంది. హీరో గురించి తన ఫ్రెండ్ ఒక బాబాకు చెప్పుకోవడంతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. “మా ఫ్రెండ్‌కు ఓ బాబా శాపం ఇచ్చాడు స్వామి. మా ఫ్రెండ్ ఎవరికైన పూజ చేసి తాంబూళం ఇస్తే వారి ఫొటోలకు అందరూ పూలు పెడుతున్నారు స్వామి” అని అతను చెబుతాడు. అది కార్థం కానీ స్వామి ఏమిటి అని అడుగుతాడు.
మళ్లీ అలాగే అతను చెబుతాడు. ఈసారి చెప్పేటప్పుడు విజువల్ చూపించడంతో మ్యాటర్ ఏంటనేది అర్థం అవుతుంది. పూలు పెట్టడం అంటే వాళ్లంతా చనిపోతున్నారు అని ఆ కమెడియన్ చెప్పాడు. అలా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయిన ట్రైలర్ నవ్విస్తూ ఉంది. ఇందులో అజయ్ ఘోష్ బాబా గెటప్‌లో కనిపించాడు. యాంకర్ ఝాన్సీ కూడా ఓ కీ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. మనుషుల్లో రెండు రకాలు. కోరికలు కంట్రోల్ చేసుకునేవాళ్లు. వాటివల్ల కంట్రోల్ కాబడే వాళ్లు అని అజయ్ ఘోష్ డైలాగ్‌తో హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేశారు.
హ్యాపీ ఎండింగ్ మూవీ ఒక అడల్ట్ కామెడీ చిత్రంగా కనిపిస్తోంది. అలాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీలా ఉంది. మొత్తానికి ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. కాగా హ్యాపీ ఎండింగ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ వేణు ఊడుగుల మాట్లాడారు. “హ్యాపీ ఎండింగ్ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇదొక న్యూ ఏజ్ మూవీ అనిపిస్తోంది. క్లాసిక్ అప్రోచ్ తో తెరకెక్కించారు. హీరో హీరోయిన్లు ఇద్దరు బాగా పర్ ఫార్మ్ చేశారు. పాటలు బాగున్నాయి. దర్శకుడు కౌశిక్‌కు ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది. రైటర్ నాగసాయి నాకు బాగా పరిచయం. నాతో వర్క్ చేస్తున్నాడు. బాలీవుడ్‌లో వికీ డోనర్‌లా తెలుగులో హ్యాపీ ఎండింగ్ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా” అని వేణు ఊడుగుల తెలిపారు.
“హీరోగా నేను చేస్తున్న రెండో సినిమా హ్యాపీ ఎండింగ్. నా ఫస్ట్ మూవీ నుంచి ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మా హమ్స్ టెక్ స్టూడెంట్స్, మీడియా మిత్రులు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరంతా నా ఫ్యామిలీ ట్రైలర్ చూస్తే మీకు కొంచెం అడల్ట్ కంటెంట్ ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ, సెన్సార్ అయ్యాక మాకు యు సర్టిఫికెట్ వస్తుందని ఆశిస్తున్నాను. మీరు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి నిరభ్యంతరంగా మా సినిమా చూడొచ్చు. ఈ సినిమాలో హర్ష్ కు కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. నేను అలాంటివి నమ్మను” అని హీరో యశ్ పూరి చెప్పాడు.
“మాది చిన్న సినిమా కాదు మంచి సినిమా. మంచి కంటెంట్ ఉంటే మీరు తప్పకుండా ఆదరిస్తారు. హ్యాపీ ఎండింగ్ అనే సినిమాకు నాలుగు ఫిల్లర్స్ గా నిలిచారు ఎడిటర్, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్. రేపు సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే సక్సెస్ క్రెడిట్ వీళ్లకే ఇవ్వాలి. మీరంతా మా సినిమా చూసి మిగతా వారికి చెప్పాలి” అని యష్ పూరి చెప్పుకొచ్చాడు.