Best Web Hosting Provider In India 2024
Guntur Kaaram 8 Days Collection: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం చిత్రం థియేటర్లలో మంచి ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ వారం రోజుల్లోనే నెమ్మదించింది. ట్రేడ్ సంస్థ Sacnilk.com ప్రకారం గుంటూరు కారం మూవీ రెండో శుక్రవారం కేవలం రూ.3 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం చిత్రానికి మొదటి వారంలో రూ.107.9 కోట్లు వసూలు చేసింది. ఇక ఎనిమిదో రోజు ఇండియాలో రూ.3 కోట్లు వసూలు చేసింది.
ట్రెండింగ్ వార్తలు
8వ రోజు కలెక్షన్స్
ఇలా గుంటూరు కారం సినిమాకు ఇప్పటి వరకు రూ.110.90 కోట్లు వసూలు చేసింది. గుంటూరు కారం సినిమాకు 8వ రోజున తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.79 కోట్ల షేర్, రూ. 3.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి వాటిలో నైజాం రూ. 20 లక్షలు, సీడెడ్‌లో 22 లక్షలు, ఉత్తారంధ్రలో రూ. 47 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 36 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలు కలెక్ట్ చేసింది.
ఏపీ తెలంగాణలో
ఇక గుంటూరు కారం సినిమా ఏపీ, తెలంగాణలో 8 రోజుల్లో రూ. 83.10 కోట్ల షేర్ కలెక్షన్స్, రూ. 126.80 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. వాటిలో నైజాం ఏరియా నుంచి రూ. 31.77 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.05 కోట్లు, ఉత్తారంధ్రలో రూ. 11.06 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 8.57 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.48 కోట్లు, గుంటూరులో రూ. 7.80 కోట్లు, కృష్ణాలో రూ. 6 కోట్లు, నెల్లూరులో రూ. 3.37 కోట్లు వచ్చాయి. కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.10 కోట్లు రాగా ఓవర్సీస్ నుంచి రూ. 14.22 కోట్లు కలెక్ట్ అయింది.
వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ఇలా గుంటూరు కారం సినిమాకు వరల్డ్ వైడ్‌గా 8 రోజుల్లో రూ. 110.90 కోట్ల షేర్ కలెక్షన్స్, రూ. 168.55 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అంటే ఇప్పటివరకు గుంటూరు కారం సినిమాకు 78 శాతం రికవరీ అయింది. ఇంకా ఈ సినిమా రూ. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకోవాలంటే రూ. 29 కోట్ల వరకు రాబట్టాలి. అలా అయితేనే గుంటూరు కారం హిట్ అయినట్లు. అయితే గుంటూరు కారం సినిమాకు మొదటి వారంలోనే వరల్డ్ వైడ్‌గా రూ. 212 కోట్ల గ్రాస్ వచ్చినట్లుగా నిర్మాతలు సోషల్ మీడియాలో తెలిపారు.
ఫ్యామిలీ ఆడియెన్స్
యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్‌గా వచ్చిన గుంటూరు కారం సినిమాలో మహేశ్ బాబుకు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఆమెతోపాటు మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా చేసింది. సీనియర్ హీరో జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందించాడు. ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమా మాస్ మూవీ అనుకుని ఫ్యాన్స్ నిరాశపడినట్లు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మాత్రం నచ్చినట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు.