Janasena Balasowri: జనసేన తరపున తండ్రి కొడుకులు పోటీ చేస్తారా?

Best Web Hosting Provider In India 2024

Janasena Balasowri: వైసీపీ అధిష్టానంతో గిట్టక ఆ పార్టీని వీడిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి నాలుగో తేదీన జనసేనలో చేరేందుకు ముహుర్తం ఖరారైంది. పవన్ కళ్యాణ్ సమక్షంలో బాలశౌరి జనసేనలో చేరనున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు

వైసీపీ సిట్టింగ్ ఎంపీ వల్లభేని బాలశౌరి జనసేనలో చేరేందుకు ముహుర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో తలెత్తిన విభేదాల నేపథ్యంలో జనసేనలో చేరుతున్నట్లు వల్లభనేని బాలశౌరి ఇప్పటికే ప్రకటించారు.

2019 ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి గెలిచిన బాలశౌరి.. ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే సందేహాలు ఉన్నాయి. బాలశౌరి గుంటూరు నుంచి పోటీ చేయాలని భావించినా పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని ప్రచారం జరుగుతోంది.

జనసేనలో కీలక నాయకుడిగా ఉన్న నాదెండ్ల మనోహర్ తెానాలి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. తెనాలి సీటు కోసం టీడీపీలో సీనియర్ నాయకుడు ఆలపాటి రాజా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెనాలి సీటును వదులుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే పార్టీ అధిష్టానం ఆలపాటి రాజాకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి బదులుగా గుంటూరు పార్లమెంటులో పోటీ చేయాలని ప్రతిపాదించినట్టు చెబుతున్నారు.

ఆలపాటి రాజా గుంటూరు పార్లమెంటు నుంచి పోటీ చేయాల్సి వస్తే వల్లభనేని బాలశౌరికి ఆ సీటును కేటాయించడం కుదరదు. కాపు సామాజిక వర్గంలో వల్లభనేని బాలశౌరి బలమైన నాయకుడు కావడంతో మరో స్థానాన్ని ఎంచుకోవాలని జనసేన బాధ్యులు సూచించినట్టు చెబుతున్నారు.

 

దీంతో మచిలీపట్నం పార్లమెంటు నియోజక వర్గం నుంచి బాలశౌరి తిరిగి పోటీ చేయాల్సి వస్తే ఆయన కుమారుడిని అవనిగడ్డ నుంచి పోటీ చేయించాలని యోచిస్తున్నారు. బాలశౌరి కుమారుడిని అవనిగడ్డ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయించడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు.

అవనిగడ్డలో ప్రస్తుతం సీనియర్ నాయకుడు మండలి బుద్దప్రసాద్ ఉన్నారు. బుద్దప్రసాద్‌‌‌ను తప్పించి, భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తారనే హామీ ఇస్తారని చెబుతున్నారు. ఆయన స్థానంలో కూటమిలో జనసేన తరపున బాలశౌరి కుమారుడిని అవనిగడ్డ నుంచి పోటీ చేయిస్తారని బాలశౌరి సన్నిహితులు చెబుతున్నారు.

కాపులకు బలమైన ఓటు బ్యాంకు ఉన్న అవనిగడ్డలో బాలశౌరి పోటీ చేస్తే సామాజిక సమీకరణలతో పాటు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్‌ను బందరు పార్లమెంటుకు పోటీ చేయించాలని వైసీపీ భావిస్తోంది.

ఈ నేపథ్యంలో జనసేన, టీడీపీ కూటమి గెలుపు అవకాశాలు ఉంటాయని బాలశౌరి వర్గం అభిప్రాయపడుతోంది. మచిలీపట్నంలో వైసీపీ తరపున ఎవరు పోటీ చేసినా పెద్దగా ఫోటీ ఉండదని అంచనా వేస్తున్నారు.

 
WhatsApp channel
 

టాపిక్

 
 
Ap PoliticsTelugu NewsBreaking Telugu NewsLatest Telugu NewsAndhra Pradesh NewsYsrcpYsrcp Vs JanasenaJanasena

Source / Credits

Best Web Hosting Provider In India 2024