Buried Truth OTT Release Date: ఆ హైప్రొఫైల్ హత్య కేసుపై డాక్యుమెంటరీ.. బరీడ్ ట్రూత్ స్ట్రీమింగ్ డేట్ ఇదే

Best Web Hosting Provider In India 2024

Buried Truth OTT Release Date: పన్నెండేళ్ల కిందట జరిగిన షీనా బోరా హత్య కేసు గురించి తెలుసు కదా. ప్రపంచాన్ని షాక్ కు గురి చేసిన ఈ హత్యలో ప్రధాన నిందితురాలైన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీ స్టోరీని ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ (Buried Truth)పేరుతో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఫిబ్రవరి 23 నుంచి ఈ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.

షీనా బోరా హత్యపై ఇంద్రాణి స్టోరీ

ఐఎన్ఎక్స్ మీడియా ఫౌండర్ అయిన ఇంద్రాణి ముఖర్జీపై తన కూతురు షీనా బోరాను హత్య చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ఆమె ఏం చెబుతోందన్నది ఇప్పుడు రానున్న డాక్యుమెంటరీలో తెలియనుంది. బరీడ్ ట్రూత్ పేరుతో నెట్‌ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ స్ట్రీమింగ్ డేట్ ను ఓటీటీ అనౌన్స్ చేసింది.

ఈ పోస్టర్ లో ఇంద్రాణి ముఖర్జీ సగం ముఖం మనం చూడొచ్చు. ఈ డాక్యుమెంటరీ ఫిబ్రవరి 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నేరుగా ఇంద్రాణియే ఈ హైప్రొఫైల్ కేసు గురించి మాట్లాడబోతుండటం గమనార్హం. ఆమెతోపాటు షీనా బోరా హత్యపై ఇంద్రాణి మిగతా పిల్లలు విధీ ముఖర్జీ, మిఖాయిల్ బోరా కూడా స్పందించనున్నారు.

షీనా బోరా హత్య కేసుకు సంబంధించి ఇంత వరకూ ఎవరికీ తెలియని విషయాలు కూడా ఈ డాక్యుమెంటరీ ద్వారా బయటపెడుతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ చెబుతోంది. ఇంద్రాణి, ఆమె మాజీ భర్త పీటర్ ముఖర్జీ, అతని కొడుకు రాహుల్ ముఖర్జీ మధ్య జరిగిన కాల్ రికార్డింగ్ లు కూడా ఈ డాక్యుమెంటరీ ద్వారా వెలుగులోకి రానున్నాయి.

అసలేంటీ షీనా బోరా హత్య కేసు?

షీనా బోరాను 2012లో హత్య చేశారు. ఇప్పటికీ ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఇంద్రాణి, పీటర్ ముఖర్జీలు బెయిల్ పై బయట ఉన్నారు. ఇంద్రాణి ఇప్పటికే ఆరేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించింది. తన మూడో భర్త పీటర్ కొడుకు రాహుల్ తో షీనా ప్రేమలో ఉండటం ఇష్టం లేకే ఆమెను ఇంద్రాణి హత్య చేసినట్లు సీబీఐ తమ ఛార్జ్‌షీట్ లో వెల్లడించింది.

2012, ఏప్రిల్లో షీనా బోరా హత్య జరిగింది. ఈ కేసుకు సంబంధించి హత్య జరిగిన మూడేళ్ల తర్వాత షీనా తల్లి ఇంద్రాణిని అరెస్ట్ చేశారు. ఆమెను అరెస్ట్ చేసిన మరుసటి రోజే ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాను కూడా అరెస్ట్ చేశారు. 2022లో వరకూ ఇంద్రాణి జైల్లో ఉండగా.. ఆ ఏడాది సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.

ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న ఇంద్రాణి.. షీనా బోరా హత్యకు సంబంధించి ఎలాంటి విషయాలు చెబుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్ కానున్న బరీడ్ ట్రూత్ డాక్యుమెంటరీతో ఈ విషయం తేలనుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024