PV Sindhu on Fighter Movie: ఫైటర్ మూవీపై పీవీ సింధు ఇచ్చిన రివ్యూ చూశారా?

Best Web Hosting Provider In India 2024

PV Sindhu on Fighter Movie: రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న రిలీజైన ఫైటర్ మూవీపై బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన అభిప్రాయం చెప్పింది. తాజాగా ఈ సినిమాను చూసిన సింధు.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో రెండు వరుసల్లో రివ్యూ రాసింది.

ట్రెండింగ్ వార్తలు

ఫైటర్ సినిమాతోపాటు హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ లపైనా ఆమె ప్రశంసల వర్షం కురిపించింది. ఫైటర్ మూవీ తొలి ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.225 కోట్ల గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్తోంది.

ఫైటర్ మూవీపై సింధు

సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన ఈ ఫైటర్ మూవీలో హృతిక్, దీపికా, అనిల్ కపూర్ నటించారు. ఈ సినిమాను ఈ మధ్యే చూసిన పీవీ సింధు చాలా బాగుందంటూ ప్రశంసించింది. “ఏం సినిమా ఇది.. హృతిక్, దీపికా ఉఫ్.. అనిల్ సర్, జస్ట్ టైమ్‌లెస్” అంటూ కొనియాడింది. ఫైటర్ మూవీ పోస్టర్ పోస్ట్ చేస్తూ సింధు తన మూవీ రివ్యూను రెండు ముక్కల్లో తేల్చేసింది.

సింధు చేసిన ఈ పోస్ట్ ను దీపికా రీపోస్ట్ చేస్తూ లవ్ యూ అని కామెంట్ చేయడం విశేషం. సింధుతోపాటు పలువురు ఇతర సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా రివ్యూతోపాటు అంతకుముందు ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు తాను హాజరైన ఫొటోలను కూడా సింధు తన ఇన్‌స్టా స్టోరీస్ లో షేర్ చేసింది. ఓ లాంగ్ సిల్వర్ కలర్ డ్రెస్ లో సింధు ఈ అవార్డుల సెర్మనీకి వచ్చింది.

ఫైటర్ బాక్సాఫీస్ కలెక్షన్లు ఇలా..

ఫైటర్ మూవీ జనవరి 25న రిలీజైంది. తొలి ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.225 కోట్లు వసూలు చేసింది. తొలి సోమవారం పరీక్షను ఫైటర్ పాస్ కాలేకపోయింది.ఈ మూవీ కేవలం రూ.8 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో ఇండియాలో ఇప్పటి వరకూ రూ.126.5 కోట్లు వసూలు చేసినట్లయింది. ఫైటర్ మూవీ కేవలం హిందీలోనే రిలీజ్ కావడం, గల్ఫ్ దేశాల్లో మూవీపై నిషేధం ఉండటం కూడా కలెక్షన్లు అనుకున్న స్థాయిలో లేకపోవడానికి కారణాలుగా చెప్పొచ్చు.

నిజానికి ఫైటర్ మూవీకి చాలా వరకు పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. అయినా సిద్ధార్థ్ ఆనంద్ గత సినిమాలు వార్, పఠాన్ లతో పోలిస్తే ఈ సినిమా కలెక్షన్లు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. వార్ మూవీ తొలి ఐదు రోజుల్లో రూ.166 కోట్లు, పఠాన్ రూ.280 కోట్లు వసూలు చేశాయి. వార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.475 కోట్లు, పఠాన్ రూ.1050 కోట్లు వసూలు చేశాయి.

వాటితో పోలిస్తే ఫైటర్ వసూళ్లు ఆ స్థాయిని అందుకోవడం కష్టమే అని చెప్పాలి. ఈ సినిమాలో హృతిక్, దీపికా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో స్క్వాడ్రన్ లీడర్లుగా కనిపించారు. ఇక అనిల్ కపూర్ వాళ్ల గ్రూప్ కెప్టెన్ గా నటించాడు. మూవీలోని స్టంట్స్, యాక్షన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024