Best Web Hosting Provider In India 2024
Fighter Movie: బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. రిపబ్లిక్ డే ముందు రోజు జనవరి 25వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. విమానాలతో యాక్షన్ సీన్లు ఈ చిత్రంలో హైలైట్‍గా నిలిచాయి. అయితే, తొలి వీకెండ్‍లో మంచి వసూళ్లనే రాట్టిన ఫైటర్.. ఐదో రోజు మాత్రం బిగ్ డ్రాప్ చూసింది.
ట్రెండింగ్ వార్తలు
ఫైటర్ సినిమా ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.225.87 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. భారీ అంచనాలతో ఈ మూవీ రాగా.. అందుకు తగ్గట్టుగా వసూళ్లలో జోరు చూపించలేకపోయింది. ఫైటర్ మూవీకి తొలి రోజు రూ.40కోట్ల లోపే రాగా.. ఆ తర్వాత బాగా పుంజుకుంది. అయితే ఐదో రోజు మళ్లీ డ్రాప్ అయింది. ఐదో రోజైన సోమవారం ఈ చిత్రానికి రూ.16.33 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ట్వీట్ చేశారు.
ఫైటర్ సినిమా తొలి రోజు రూ.36.04 కోట్లను దక్కించుకుంది. అయితే, రెండో రోజు అనూహ్యంగా పుంజుకొని రూ.64.57 కోట్లను కైవసం చేసుకుంది. మూడో రోజు రూ.56.19 కోట్లు, నాలుగో రోజు రూ.52 కోట్లతో జోరు చూపించింది. నాలుగు రోజుల్లోనే రూ.200కోట్లను అధిగమించింది. అయితే, ఐదో రోజు ఈ మూవీకి వసూళ్లు ఊహించని రీతిలో పడిపోయాయి. కేవలం రూ.16.33 కోట్లే వచ్చాయి.
ఇండియాలో ఇలా..
భారత్‍లోనే ఫైటర్ మూవీకి ఐదు రోజుల్లో రూ.126.50 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. తొలి నాలుగు రోజులు రూ.118 నెట్ వసూళ్లు రాగా.. ఐదో రోజు రూ.8కోట్లకు పరిమితమైంది. విదేశాల్లోనూ ఫైటర్ మోస్తరు వసూళ్లను దక్కించుకుంటోంది. ఉత్తర అమెరికాలో ఈ మూవీ ఇప్పటి వరకు 5.2 మిలియన్ డాలర్లను రాబట్టింది.
పఠాన్ చిత్రంతో గతేడాది బ్లాక్‍బాస్టర్ కొట్టిన సిద్ధార్థ్ ఆనంద్.. ఈ ఫైటర్ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హృతిక్ సరసన దీపికా పదుకొణ్ హీరోయిన్‍గా నటించారు. ఈ మూవీలో హృతిక్, దీపికా ఎయిర్ ఫోర్స్ యుద్ధవిమానాల పైలెట్లుగా చేశారు. అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, రిషబ్ సాహ్నీ, సంజీదా షేక్, అషుతోశ్ రానా కీలకపాత్రలు పోషించారు. వియాకామ్ 18, మ్యాట్రిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‍పాండే, రామన్ చిబ్, అజిత్ అంధారే, అంకు పాండే, కెవిన్ వాజ్, మమతా భాటియా ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందినట్టు అంచనా.
ఆకాశంలో విమానాలతో యాక్షన్ సీక్వెన్సులు ఫైటర్ మూవీకి హైలైట్‍గా నిలిచాయి. హృతిక్ రోషన్, దీపికా పదుకొణ్ మరోసారి పర్ఫార్మెన్స్ అదరగొట్టారు. ఈ చిత్రానికి ఎక్కువగా పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా సచిత్ పౌలోజ్.. సినిమాటోగ్రఫీ ఈ చిత్రంలో చాలా ఆకట్టుకుంటుంది. ఏరియల్ యాక్షన్, దేశభక్తి కలగలిసిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రియాక్షన్స్ వస్తున్నాయి.