Best Web Hosting Provider In India 2024
YS Sharmila Deeksha For AP Special Statue: ఏపీ ప్రజలను బీజేపీ పార్టీ అతిహీనంగా చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. అలాంటి పార్టీకి టీడీపీ, వైసీపీ గులాంగిరి చేస్తున్నాయని విమర్శించారు. రెండు పార్టీలు కలిసి పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ… హోదాపై పోరాడటం లేదన్నారు. రాష్ట్రం నుంచి గెలిచిన 25 మంది ఎంపీలు కూడా బీజేపీకి తొత్తులుగా మారారని దుయ్యబట్టారు. వీరంతా మోదీకి బానిసలుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రెండింగ్ వార్తలు
“టీడీపీ, వైసీపీలు హోదాపై ప్రజలకు ఇచ్చిన మాట తప్పుతున్నారు. హామీలను నెరవేర్చలేదు. అయినప్పటికీ బీజేపీకి గులాంగిరి ఎందుకు చేస్తున్నారు..? ఇవాళ అధికారంలో ఉన్న వారు ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేశారు. వీరంతా ఇప్పుడు ఏమైపోయారు. ఏపీలో బీజేపీ ఒక్క సీటు లేదు. కానీ వీరంతా వారికి గులాంగిరి చేస్తున్నారు. అసలు మీ మధ్య ఒప్పందం ఏంటో చెప్పాలి. ఇలాగే పరిస్థితులు ఉంటే పోలవరం రాజధాని, కడప స్టీల్ ఎప్పుడు తీసుకొచ్చుకుంటాం..? ఎంపీలు రాజీనామా చేస్తే హోదా వచ్చేది కాదా..? వీరంతా మోదీని ప్రశ్నించారా..?” అని షర్మిల నిలదీశారు.
ప్రత్యేక హోదా విషయంపై చంద్రబాబు, జగన్ గతంలో మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు వైఎస్ షర్మిల. చంద్రబాబు, జగన్ ఇద్దరూ కూడా హోదా కోసం పోరాడుతామని చెప్పి… ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. ఇలా చేస్తే ప్రజలను మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. ఉత్తరాఖాండ్, హిమాచల్ ప్రదేశ్ కు హోదా వస్తే వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేశారు. అలాగే ఏపీకి హోదా ఇస్తే పరిశ్రమలు వస్తాయి కదా వ్యాఖ్యానించారు. అన్ని విషయాల్లో మోసం చేసిన బీజేపీ పార్టీకే ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు వైఎస్ షర్మిల.
టాపిక్