Best Web Hosting Provider In India 2024
Friday OTT Movies Release: ప్రతి వీకెండ్ లాగే ఈ వారం కూడా ఓటీటీలో విభిన్న రకాల జోనర్స్ చిత్రాలు, వెబ్ సిరీసులు ప్రేక్షకులను అలరించేందుకు రిలీజ్ అయ్యాయి. వాటిలో శుక్రవారం (ఫిబ్రవరి 2) ఏకంగా 9 సినిమాలు, వెబ్ సిరీసులు విడుదల అయ్యాయి. మొత్తంగా ఈవారం సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి 21 ఓటీటీల్లో విడుదల కాగా వాటిలో కేవలం ఒక్క శుక్రవారం రోజే 19 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి ఆ చిత్రాలు, వెబ్ సిరీసులు ఏ ఓటీటీల్లో ఉన్నాయో లుక్కేద్దాం.
ట్రెండింగ్ వార్తలు
నెట్ ఫ్లిక్స్
ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్ మూవీ)- ఫిబ్రవరి 1 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
లెట్స్ టాక్ అబౌట్ చు (మాండరీన్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 2 (ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది)
ఓరియన్ అండ్ ది డార్క్ (ఇంగ్లీష్ సినిమా)- ఫిబ్రవరి 2 (ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది)
అమెజాన్ ప్రైమ్
డీ ప్రాంక్ షో (డచ్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 2 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
మిస్టర్ అండ్ మిస్ స్మిత్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 2 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
సైంధవ్ (తెలుగు సినిమా)- ఫిబ్రవరి 2 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
పిండం (తెలుగు మూవీ)- ఫిబ్రవరి 2 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
కైవా (కన్నడ మూవీ)- ఫిబ్రవరి 2 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
గారడి (కన్నడ మూవీ)- ఫిబ్రవరి 2 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
కన్నగి (తమిళ చిత్రం)- ఫిబ్రవరి 2 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
జోరమ్ (హిందీ మూవీ)- (ఫిబ్రవరి 2) (రెంటల్ విధానంలో స్ట్రీమింగ్)
ఫ్యామిలీ (జపనీస్ మూవీ)- ఫిబ్రవరి 2 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
మిస్టర్ అండ్ మిస్ స్మిత్ (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 2 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
మిస్ పర్ఫెక్ట్ (తెలుగు వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 2 (ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది)
సెల్ఫ్ (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్)- ఫిబ్రవరి 2 (స్ట్రీమింగ్ అవుతోంది)
పరంపోరుల్ (తెలుగు మూవీ)- ఈటీవీ విన్ ఓటీటీ- పరంపోరుల్
మతిమారన్ (తమిళ చిత్రం)- ఆహా తమిళ్- ఫిబ్రవరి 2 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
జెహన్ (హిందీ మూవీ)- జీ5 ఓటీటీ- ఫిబ్రవరి 2 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
ఓ మై డార్లింగ్ (మలయాళ సినిమా)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- ఫిబ్రవరి 2 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
ఎల్‌ఎస్‌డీ (తెలుగు వెబ్ సిరీస్)- ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- ఫిబ్రవరి 2 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
ఇలా ఓటీటీల్లో శుక్రవారం ఒక్కరోజు ఏకంగా 19 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఎక్కువగా అమెజాన్ ప్రైమ్‌లో 10 రిలీజయ్యాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ. ఫిబ్రవరి 2 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో సైంధవ్ స్ట్రీమింగ్ అవుతుందని రూమర్స్ వినిపించాయి. కానీ, అవి రూమర్స్ కాకుండా అమెజాన్ ప్రైమ్‌లో సైంధవ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో లావణ్య త్రిపాఠి నటించిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది కూడా ఈవారం స్పెషల్ సిరీసే.
ఈ రెండింటితో పాటు ఈటీవీ విన్ ఓటీటీలో పరంపోరుల్ అనే తెలుగు మూవీపై కూడా లుక్ వేయొచ్చు. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఓ విగ్రహం చుట్టు జరిగే కథతో ఈ సినిమా ఉంటుంది. కాబట్టి ఈ వారం ఇది కూడా స్పెషల్ మూవీనే. ఇక ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో విడుదలైన ఎల్ఎస్‌డీ తెలుగు వెబ్ సిరీస్ కూడా స్పెషల్ అని చెప్పవచ్చు. ఇలా ఫిబ్రవరి 2న రిలీజైన వాటిలో నాలుగు స్పెషల్‌గా ఉన్నాయి.
టాపిక్