Best Web Hosting Provider In India 2024
Dheera Movie Review: లక్ష్ చదలవాడ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన ధీర మూవీ ఫిబ్రవరి 2న (శుక్రవారం) థియేటర్లలో రిలీజైంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. నేహా పఠాన్, సోనియా భన్సాల్ హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమా ఎలా ఉందంటే…
ట్రెండింగ్ వార్తలు
ధీర పోరాటం…
రణ్‌ధీర్ అలియా ధీర (లక్ష్ చదలవాడ) డబ్బు మనిషి. మనీ వస్తుందంటే ముందు వెనుక చూసుకోకుండా ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్ధపడుతుంటాడు. డబ్బు కోసమే ప్రేమించిన డాక్టర్ అమృతను (నేహా పఠాన్) వదిలేస్తాడు. అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేసే ధీర వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు రాజ్‌గురు అనే పేషెంట్‌ను షిఫ్ట్ చేసేందుకు 25 లక్షలకు ఓ డీల్ కుదుర్చుకుంటాడు. రాజ్‌గురుకు సహాయంగా ఆ అంబులెన్స్‌లో డాక్టర్ అమృతతో పాటు కిరణ్ ( మిర్చి కిరణ్) కూడా ప్రయాణిస్తుంటారు. .
డబ్బు మోజుతో డీల్ అంగీకరించిన ధీరకు ఆ తర్వాతే అసలు కష్టాలు మొదలవుతాయి. రాజ్‌గురును చంపేందుకు కొందరు ప్రయత్నిస్తారు. అదే టైమ్‌లో ఓ చిన్నారి ధీర లైఫ్‌లోకి వస్తుంది. ఆ చిన్నారి ఆచూకీ కోసం సీఏం సెక్రటరీ హంసలేఖతో పాటు ఏసీపీ ఖన్నా, అపోజిషన్ లీడర్ చాణక్య (బాబీ బేడీ) అన్వేషిస్తుంటారు.
రాజ్‌గురుతో ఆ పాపకు ఏమైనా సంబంధం ఉందా? రాజ్‌గురును చంపాలని ప్రయత్నిస్తోన్న ముఠా ఎవరు?వారిని ధీర ఎలా ఎదుర్కొన్నాడు? రాజ్‌గురును ధీర హైదరాబాద్‌కు షిప్ట్ చేశాడా? అమృతతో ధీర ప్రేమయాణం సక్సెస్ అయ్యిందా? అతడి జీవితంలోకి వచ్చిన మరో అమ్మాయి మనీషా ఎవరు? ఈ కథలో ముఖ్యమంత్రి కృష్ణమూర్తి( సుమన్) పాత్ర ఏమిటి అన్నదే ధీర మూవీ కథ.
పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్…
పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు విక్రాంత్ శ్రీనివాస్ ధీర కథను రాసుకున్నాడు. డబ్బు తప్ప జీవితంలో దేనికి ప్రాధాన్యతనివ్వని ఓ యువకుడిలో ఎలా మార్పు వచ్చిందన్నది ఫక్తు కమర్షియల్ కోణంలో ఈ సినిమాలో చూపించాడు. కథ మొత్తం మల్టీలేయర్స్‌లో నడుస్తుంది. అనేక ఉపకథలతో చూపిస్తూ వాటన్నింటిని హీరో క్యారెక్టర్‌తో లింక్ చేస్తూ కథను అల్లుకున్న తీరు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. వాటిలో ఓ రెండ్ లవ్ స్టోరీస్ కూడా ఉంటాయి.
పొలిటికల్, చిన్నారి ఎమోషనల్ సీన్స్‌ను సీరియస్‌గా నడిపించిన డైరెక్టర్ లవ్‌స్టోరీని మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌తో నడిపించాడు. కావాల్సినంత ఫన్ లవ్ ట్రాక్ నుంచే రాబట్టుకునే ప్రయత్నం చేశాడు.
ఫన్ టోన్ తో…
హీరోను డబ్బు మనిషిగా చూపించే సీన్స్‌తో ఫన్‌టోన్‌లో ఈ సినిమా మొదలవుతుంది. డబ్బు కోసం అమృతను దూరం పెట్టిన ధీర జీవితంలోకి మళ్లీ ఆమె ఎలా వచ్చింది? హీరోహీరోయిన్ ఇద్దరి కోణంలో రెండేసి ఫ్లాష్‌బ్యాక్స్, హీరోయిన్‌కు అసిస్టెంట్‌గా వచ్చిన కిరణ్ వేసే పంచ్‌లతో ఫస్ట్‌హాఫ్‌ను కామెడీతో నెట్టుకొచ్చాడు డైరెక్టర్.
సెకండాఫ్ మాత్రం అందుకు భిన్నంగా సాగుతుంది. ఓ చిన్నారి ఎమోషన్ తో కథ సాగుతుంది. హీరో దగ్గర ఉన్న చిన్నారి కోసం ఏకంగా సీఏం, అపోజిషన్ లీడర్స్ వెతకడం లాంటి సీన్స్ ఆసక్తిని పంచుతాయి. ఆ పాప ఎవరన్నది తెలుసుకునేందుకు ధీర చేసే అన్వేషణతో ఒక్క ట్విస్ట్ రివీల్ చేస్తూ వచ్చాడు. చివరకు ఓ పానను కాపాడేందుకు కోట్ల రూపాయల డబ్బును హీరో త్యాగం చేసే సీన్‌తో హీరోలో మార్పు వచ్చినట్లుగా చూపించి భారీ యాక్షన్ సీన్‌తో సినిమా ఎండ్ అవుతుంది.
థ్రిల్, ఎగ్జైట్‌మెంట్…
ధీర కథ ఒకే అనిపించిన కథనమే నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. తన దగ్గర ఉన్న చిన్నారి ఎవరో తెలుసుకునేందుకు ధీర సాగించిన అన్వేషణ, ట్విస్ట్‌లలో థ్రిల్, ఎగ్జైట్‌మెంట్ రెండు మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. హీరో క్యారెక్టర్‌ను పవర్‌ఫుల్‌గా చూపించాలనే తాపత్రయంతో కొన్ని యాక్షన్ సన్నివేశాలను కావాలనే కథలో ఇరికించినట్లుగా అనిపిస్తుంది. ప్రేమకథలు కూడా సినిమా నిడివి పెంచడానికే ఉపయోగిపడినట్లుగా అనిపిస్తాయి.
యాక్షన్ హీరోగా…
ధీరలో యాక్షన్ హీరోగా కనిపించాడు లక్ష్. మాస్, క్లాస్ కాంబోగా అతడి క్యారెక్టర్‌ను డైరెక్టర్ డిజైన్ చేశాడు. గత సినిమాలతో పోలిస్తే నటన పరంగా లక్ష్ పర్వలేదనిపించాడు. ఎమోషనల్ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. ఇద్దరు హీరోయిన్లలో నేహా పఠాన్ యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించింది. సోనియా భన్సాల్ గ్లామర్‌తో మెప్పించింది. మిర్చి కిరణ్ పంచ్ డైలాగ్స్ అక్కడక్కడ నవ్వించాయి. టెక్నికల్ పరంగా సాయికార్తిక్ బీజీఎమ్ సినిమాకు ప్లస్సయింది. పాటలు మాత్రం పెద్దగా మెప్పించవు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. తానే ప్రొడ్యూసర్ కావడంతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా లక్ష్ ఈ సినిమాను తెరకెక్కించారు.
ధీర వన్ టైమ్ వాచ్…
ధీర వన్ టైమ్ వాచ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ. ఈ వారం బాక్సాఫీస్ వద్ద పోటీగా పెద్ద సినిమాలేవి రిలీజ్ కాకపోవడం ధీరకు కొంత వరకు ప్లస్సయ్యే అవకాశం ఉంది.
రేటింగ్: 2.5/5